Telugu News
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమాలు
    • సినిమా న్యూస్
    • స్పెషల్స్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • OTT
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • రివ్యూలు
  • Web Stories
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • అంతర్జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
  • ఆటోమొబైల్స్
  • బిజినెస్‌
  • టెక్నాలజీ
  • లైఫ్ స్టైల్
  • క్రైమ్
  • English
  • NTV Telugu
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమా న్యూస్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • వెబ్ స్టోరీలు
  • లైఫ్ స్టైల్
  • బిజినెస్‌
  • క్రీడలు
  • రివ్యూలు
  • Off The Record
  • క్రైమ్
close
Topics
  • IPL 2026
  • Story Board
  • Off The Record
  • OTT
  • Chairman's Desk
  • స్టడీ & జాబ్స్
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
    • అంతర్జాతీయ క్రీడలు
  • గ్యాలరీలు
    • Actors
    • Actress
    • General
    • Movies
    • Political
  • బిజినెస్‌
  • భక్తి
  • రాశి ఫలాలు
  • స్పెషల్‌ స్టోరీలు
  • ఆటోమొబైల్స్
  • టెక్నాలజీ
  • Off The Record
Home International News Trump Reposts Anti India Rant Birthright Citizenship Controversy

Donald Trump: ‘‘బిడ్డను కనడానికే వస్తారు’’.. భారతీయులపై ట్రంప్ అక్కసు..

Published Date :April 23, 2026 , 4:44 pm
By Venu Goapl Reddy
  • భారతీయులపై ట్రంప్ అక్కసు..
  • బిడ్డను కనడానికే వస్తారంటూ జాత్యాహంకార వ్యాఖ్యలు..
Donald Trump: ‘‘బిడ్డను కనడానికే వస్తారు’’.. భారతీయులపై ట్రంప్ అక్కసు..
  • Follow Us :
  • google news
  • dailyhunt

Donald Trump: అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ భారత్‌పై ఉన్న తన అక్కసును మరోసారి బయటపెట్టారు. అమెరికన్ పొలిటికల్ వ్యాఖ్యాత, రేడియో హోస్ట్ మైఖేల్ సావేజ్ భారతీయులు, చైనీయులపై జాత్యాంహకార వ్యాఖ్యలు చేశారు. ఈ వ్యాఖ్యల్ని ట్రంప్ సమర్థిస్తూ రీపోస్ట్ చేశారు. భారత్, చైనా ఇతర దేశాలను ‘‘నరకాలు’’గా అభివర్ణించారు. అమెరికాలో పుట్టుక ద్వారా వచ్చే జన్మహక్కు పౌరసత్వ చట్టంలో మార్పులు తీసుకురావాలని సావెజ్ కోరారు. ఈ రెండు దేశాల ఆసియా ప్రజలు తొమ్మిదవ నెలలో బిడ్డను కనడానికి అమెరికాకు వస్తారని ఆరోపించారు.

Read Also: OMG: ఆడుకుంటూ గంగాళంలో ఇరుక్కున్న చిన్నారి.. చివరి ప్రయత్నంలో ఇలా..

Also Read

  • Viral Video: భారత్ వస్తున్న నౌకను ఇరాన్ ఎలా సీజ్ చేసిందో చూడండి..
  • Islamabad in Lockdown: 10 రోజులుగా లాక్‌డౌన్‌లో ఇస్లామాబాద్‌.. తిట్టిపోస్తున్న పాక్‌ ప్రజలు..
  • Iran Mocks Trump: ‘‘షట్ అప్, ట్రంప్’’.. హైదరాబాద్ ఇరాన్ కాన్సులేట్ సెటైర్లు..
  • Trump-Iran: ‘‘ట్రంప్.. నోర్మూయ్’’.. సీజ్‌ఫైర్‌ పొడిగింపుపై ఇరాన్ సెటైర్ వీడియో

అమెరికా జన్మహక్కు పౌరసత్వంపై సుప్రీంకోర్టు వాదనల్ని సావేజ్ తీవ్రంగా విమర్శిస్తూ, చట్టంలో మార్పులు తీసుకురావాలని డిమాండ్ చేశారు. అమెరికాలో జన్మహక్కు పౌరసత్వం ద్వారా ఇక్కడ ఒక బిడ్డ అమెరికన్ పౌరుడిగా మారుతారని, ఆ తర్వాత చైనా, భారత్ ఇతర నరకూపాల నుంచి వారి మొత్తం కుటుంబాన్ని అమెరికాకు తీసుకువస్తారని బలుపు మాటలు మాట్లాడాడు. భారత్, చైనా వలసదారుల్ని ‘‘ల్యాప్ టాప్ కలిగిన గ్యాంగ్‌స్టర్లు’’గా అభివర్ణించారు. మాఫియా కుటుంబాలు ఈ దేశానికి చేసిన నష్టాని కన్నా వీరే ఈ దేశానికి ఎక్కువ నష్టం చేస్తారని ఆరోపించారు. భారతీయుల వల్ల అమెరికాలోని ప్రజలకు అవకాశాలు తగ్గాయని అన్నారు.

అయితే, సావేజ్ పోస్టునే ట్రంప్ రీపోస్ట్ చేశారు. ట్రంప్ సీఎన్‌బీసీకి ఇచ్చిన ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. అమెరికా తప్ప ప్రపంచంలో ఏ దేశం కూడా బర్త్ రైట్ సిటిజన్ షిప్ ఇవ్వదని అప్పుగా చెప్పారు. నిజానికి మెక్సికో, కెనడా వంటి అనేక దేశాలు ఇలా పౌరసత్వాన్ని ఇస్తున్నాయి. ట్రంప్ అధికారంలోకి వచ్చినప్పటి నుంచి అమెరికా వీసా విధానాన్ని మార్చాలని కోరుకుంటున్నారు. ఈమేరకు ఆటోమేటిక్ పౌరసత్వాన్ని నిలిపివేయడానికి ట్రంప్ ఎగ్జిక్యూటివ్ ఆర్డర్‌ను కూడా జారీ చేశాడు. అయితే, అమెరికా రాజ్యాంగంలోని ఆర్టికల్ 14 ప్రకారం.. జన్మహక్కు పౌరసత్వం హామీ ఉంటుందని అమెరికన్ న్యాయనిపుణులు చెబుతున్నారు. దీనిపై అక్కడి సుప్రీంకోర్టులో విచారణ కొనసాగుతోంది.

NTV తెలుగు  వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

  • Tags
  • Birthright Citizenship
  • Michael Savage comments India
  • racist remarks Indian immigrants
  • trump
  • Trump anti India remarks

తాజావార్తలు

  • Easy Mango Lassi Recipe: క్షణాల్లో అదిరిపోయే మామిడి లస్సీ.. ఒక్క గ్లాస్‌తో ఆగరు అంతే..

  • Donald Trump: ‘‘బిడ్డను కనడానికే వస్తారు’’.. భారతీయులపై ట్రంప్ అక్కసు..

  • Soft Pink Lips Tips: మీ పెదాలు మృదువుగా.. గులాబీ రంగులో మెరిసిపోయే చిట్కాలు ఇవే..

  • Darling Re-release: రీ-రిలీజ్‌లో ‘డార్లింగ్’ విధ్వంసం.. మైండ్ బ్లాకింగ్ కలెక్షన్స్!

  • OMG: ఆడుకుంటూ గంగాళంలో ఇరుక్కున్న చిన్నారి.. చివరి ప్రయత్నంలో ఇలా..

ట్రెండింగ్‌

  • రూ. 9,999కే 6.88 అంగుళాల పెద్ద స్క్రీన్, 5200mAh బ్యాటరీ.. POCO C81 సిరీస్ లాంచ్..!

  • Lava Bold N1 5G కొత్త వేరియంట్ లాంచ్.. ధర కూడా తక్కువే.!

  • Moong Dal Pakoda Recipe: శనగపిండి వాడకుండా ఆరోగ్యకరంగా, రుచిగా ఉండే ‘పెసరపప్పు పకోడీ’లను చేసేయండి ఇలా..!

  • మిడ్-రేంజ్‌లో ఫ్లాగ్‌షిప్ ఫీచర్లు.. 200MP కెమెరా, 5-స్టార్ డ్రాప్ & క్రష్ సర్టిఫికేషన్, 7000mAh బ్యాటరీతో HONOR 600 సిరీస్ లాంచ్..!

  • Kitchen Cleaning Hacks: మెరిసే పాత్రల కోసం చిట్కాలు.. పింగాణీ పాత్రలపై పసుపు మరకలను వదిలించుకోండిలా.!

  • twitter
NTV Telugu
For advertising contact :9949494238
Email: digital@ntvnetwork.com

Copyright © 2000 - 2026 - NTV

  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms & Conditions