మిడ్-రేంజ్లో ఫ్లాగ్షిప్ ఫీచర్లు.. 200MP కెమెరా, 5-స్టార్ డ్రాప్ & క్రష్ సర్టిఫికేషన్, 7000mAh బ్యాటరీతో HONOR 600 సిరీస్ లాంచ్..!
- HONOR నుండి HONOR 600 సిరీస్ గ్లోబల్‌గా లాంచ్.
- ఈ సిరీస్‌లో HONOR 600, HONOR 600 Pro మోడళ్లు ఉన్నాయి.
- రెండు ఫోన్లలోనూ 200MP ప్రైమరీ కెమెరా, నైట్ ఇంజిన్ టెక్నాలజీ.
- HONOR 600 Proలో 50MP టెలిఫోటో లెన్స్, 120x డిజిటల్ జూమ్..
- 6.57-ఇంచ్ OLED డిస్ప్లే, 120Hz రిఫ్రెష్ రేట్, 8000 నిట్స్ బ్రైట్నెస్..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
HONOR 600 Series Launched: స్మార్ట్‌ఫోన్ దిగ్గజ కంపెనీలలో ఒక్కటైన హానర్ (HONOR) నుండి HONOR 600 సిరీస్‌ను గ్లోబల్ మార్కెట్ లో అధికారికంగా లాంచ్ చేసింది. ఈ సిరీస్ ను ముందుగా మలేషియాలో లాంచ్ చేయగా.. ఈ సిరీస్ లో HONOR 600, HONOR 600 Pro మోడళ్లు ఉన్నాయి. ఫ్లాగ్షిప్ స్థాయి ఫీచర్లను అందుబాటు ధరలో అందించడంపై కంపెనీ దృష్టి పెట్టింది.
ఈ రెండు ఫోన్లలోనూ 200 మెగాపిక్సెల్ ప్రైమరీ కెమెరా ఉంది. 1/1.4-ఇంచ్ సెన్సర్‌తో పాటు నైట్ ఇంజిన్ టెక్నాలజీ ఉండటం వల్ల లో-లైట్ ఫోటోగ్రఫీ మరింత మెరుగ్గా ఉంటుంది. HONOR 600 Proలో 50MP టెలిఫోటో లెన్స్ ఉండి 120x డిజిటల్ జూమ్ సపోర్ట్ చేస్తుంది. సాధారణ HONOR 600లో 30x జూమ్ సపోర్ట్ ఉంది. ఈ సిరీస్‌లో ముఖ్యమైన హైలైట్ AI Image to Video 2.0 ఫీచర్. ఇది మల్టీ-మోడల్ వీడియో జనరేషన్ టెక్నాలజీ ఆధారంగా పని చేస్తుంది. మూడు ఫోటోలను కలిపి 3–5 సెకన్ల చిన్న వీడియోలు రూపొందించవచ్చు. యూజర్లు తమకు నచ్చినట్లుగా టెక్స్ట్ ప్రాంప్ట్ ఇచ్చి వీడియో స్టోరీని కస్టమైజ్ చేసుకోవచ్చు. అలాగే రెడీమేడ్ టెంప్లేట్లు కూడా అందుబాటులో కూడా ఉన్నాయి.
Also Read
- Sai Pallavi: సీత పాత్రతో చాలా నేర్చుకున్నా.. సాయి పల్లవి ఆసక్తికర వ్యాఖ్యలు.!
- 29kmpl మైలేజ్, 160PS పవర్, పనోరమిక్ సన్‌రూఫ్ తో Renault Duster Hybrid E-Tech లాంచ్..
- Asian Para Games: తొలిరోజే 11 పతకాలు..! ఆసియా పారా గేమ్స్‌లో భారత్‌కు అదిరిపోయే ఆరంభం..
- India Playing XI: రోహిత్-గిల్ ఓపెనర్స్.. కోహ్లీ మూడో స్థానంలో.! 2027 ప్రపంచ కప్ జట్టును ఎంపిక చేసిన టీమిండియా మాజీ ప్లేయర్.!

HONOR 600 Proలో Snapdragon 8 Elite మొబైల్ ప్లాట్ఫారం ప్రాసెసర్ ఉండగా, HONOR 600లో స్నాప్ డ్రాగన్ 7 జెన్ 4 చిప్సెట్ ఉంది. వీటితోపాటు Proలో పెద్ద 3D VC కూలింగ్ సిస్టమ్ ఉండటం వల్ల గేమింగ్, హెవీ యూజ్ సమయంలో వేడి సమస్య తగ్గుతుంది. ఇంకా 6.57-ఇంచ్ OLED డిస్ప్లేతో ఈ ఫోన్లు వస్తున్నాయి. 120Hz రిఫ్రెష్ రేట్, 8000 నిట్స్ పీక్ బ్రైట్నెస్ ఉండటం వల్ల అవుట్డోర్ లో కూడా క్లియర్ విజిబిలిటీ లభిస్తుంది. ఐ కంఫర్ట్ టెక్నాలజీ, 3840Hz PWM డిమ్మింగ్ వంటి ఫీచర్లు కళ్లకు ఇబ్బంది లేకుండా చూసుకుంటాయి.
ఈ సిరీస్‌లో 7000mAh సిలికాన్-కార్బన్ బ్యాటరీ ఉంది. 80W ఫాస్ట్ చార్జింగ్‌తో పాటు 27W రివర్స్ చార్జింగ్ సపోర్ట్ చేస్తుంది. HONOR 600 Proలో అదనంగా 50W వైర్లెస్ చార్జింగ్ కూడా ఉంది. HONOR 600 సిరీస్ ఫోన్లు IP68, IP69, IP69K రేటింగ్‌లతో వస్తున్నాయి. అంటే ఇవి డస్ట్, వాటర్‌కు గరిష్ట రక్షణ కల్పిస్తాయి. SGS 5-స్టార్ డ్రాప్ & క్రష్ సర్టిఫికేషన్ కూడా ఉండటం వల్ల ఇవి మరింత దృఢంగా ఉంటాయి.
HONOR 600 (12GB + 512GB) ధర రూ. 61,640 కాగా, HONOR 600 Pro (12GB + 256GB) ధర రూ. 73,490, 512GB వేరియంట్ రూ. 78,235 వరకు ఉంటుంది. ఈ ఫోన్లు ఏప్రిల్ 30, 2026 నుంచి విక్రయాలకు అందుబాటులోకి రానున్నాయి. ప్రీ-ఆర్డర్ చేసిన వారికి ప్రత్యేక ఆఫర్లలో భాగంగా.. HONOR 600 Proపై భారీ బండిల్ ఆఫర్లు, ఇన్స్టంట్ డిస్కౌంట్లు, వారంటీ సదుపాయాలు ఉన్నాయి.
తాజావార్తలు
-
Chairman’s Desk : ఎల్‌నినో సంక్షోభం.. ఒత్తిడిలో ప్రపంచం..!
-
Sajjala Ramakrishna Reddy: మీ పాలనపై నమ్మకముంటే ఈ భయమేంటి.. సజ్జల ఘాటు వ్యాఖ్యలు
-
Sai Pallavi: సీత పాత్రతో చాలా నేర్చుకున్నా.. సాయి పల్లవి ఆసక్తికర వ్యాఖ్యలు.!
-
Yash: రావణుడిగా ఎవరైనా చేస్తారు.. రాముడి పాత్ర అంత ఈజీ కాదు: యశ్
-
29kmpl మైలేజ్, 160PS పవర్, పనోరమిక్ సన్‌రూఫ్ తో Renault Duster Hybrid E-Tech లాంచ్..
ట్రెండింగ్
-
Asian Para Games: తొలిరోజే 11 పతకాలు..! ఆసియా పారా గేమ్స్‌లో భారత్‌కు అదిరిపోయే ఆరంభం..
-
India Playing XI: రోహిత్-గిల్ ఓపెనర్స్.. కోహ్లీ మూడో స్థానంలో.! 2027 ప్రపంచ కప్ జట్టును ఎంపిక చేసిన టీమిండియా మాజీ ప్లేయర్.!
-
New Recharge Plans: డేటా అవసరం లేదా? కొత్త రీఛార్జ్ ప్లాన్స్ వచ్చేశాయ్.. రూ.185 నుంచి మొదలు.!
-
WPL 2027 Auction: 27 స్థానాల కోసం 146 మంది ప్లేయర్లు.. WPL వేలం తేదీ, వేదిక ఖరారు..!
-
Manvanth Kumar: సంచలనం.. తొమ్మిదో స్థానంలో బ్యాటింగ్ వచ్చి సెంచరీ కొట్టిన కర్ణాటక ఆల్‌రౌండర్..!