Soft Pink Lips Tips: మీ పెదాలు మృదువుగా.. గులాబీ రంగులో మెరిసిపోయే చిట్కాలు ఇవే..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Soft Pink Lips Tips: వేసవి కాలంలో పెదాలు పొడిబారడం, పగలడం, సహజ కాంతి కోల్పోవడం వంటి సమస్యలు చాలామందిని వేధిస్తుంటాయి. చాలామంది ఈ సమస్యలు చలికాలంలోనే వస్తాయని భావిస్తారు. కానీ, వేసవిలోని వేడి గాలులు, తీవ్రమైన ఎండ, హానికరమైన UV కిరణాలు కూడా పెదవులకు నష్టం కలిగిస్తాయి. ముఖంలోని ఇతర భాగాలతో పోలిస్తే పెదాలపై చర్మం చాలా పలుచగా ఉండటం వల్ల తేమ త్వరగా కోల్పోతుంది. దీంతో పెదాలు నల్లగా, నిర్జీవంగా కనిపించవచ్చు.
అయితే కొన్ని సులభమైన అలవాట్లు, ఇంటి చిట్కాలు పాటిస్తే పెదాలను మృదువుగా, గులాబీ రంగులో ఉంచుకోవచ్చు. ఖరీదైన బ్యూటీ ఉత్పత్తుల అవసరం లేకుండానే సహజమైన అందాన్ని పొందవచ్చు.
Also Read
- Breast Cancer: తేనెటీగ విషంతో క్యాన్సర్‌కు చెక్ పెట్టొచ్చా? పరిశోధనల్లో ఏం తేలింది?
- Dussehra Special Recipes: కరకరలాడే జంతికల నుంచి స్వీట్ షాప్ స్టైల్ చిక్కీ వరకు పిండివంటలు ట్రై చేయండి..!
- Tea Drinking Mistakes: 'టీ' తాగడం ఓకే.. కానీ, తాగే సమయలో ఈ తప్పులు చేసారో.. క్యాన్సర్ వచ్చే ప్రమాదం సుమీ..!
- Lunch Recipes: ఇంటికి చుట్టాలొస్తే కంగారేలా.? చిటికెలో సులువుగా చేసుకోగల రకరకాల కమ్మని కూరలు ఇదిగో..!
పుష్కలంగా నీరు త్రాగండి: డీహైడ్రేషన్ వల్ల పెదాలు త్వరగా పొడిబారిపోతాయి. అందుకే రోజుకు కనీసం 8 నుంచి 10 గ్లాసుల నీరు త్రాగడం అలవాటు చేసుకోవాలి. శరీరంలో తేమ సరిపడగా ఉంటే పెదాలు కూడా మృదువుగా కనిపిస్తాయి.
పెదాలకు స్క్రబ్ చేయండి: పంచదారలో కొద్దిగా తేనె కలిపి వారానికి రెండు సార్లు పెదవులపై సున్నితంగా రుద్దాలి. దీంతో చనిపోయిన చర్మం తొలగి పెదాలు నిగారింపుతో మెరిసిపోతాయి.
SPF ఉన్న లిప్ బామ్ వాడండి: ఎండలో బయటకు వెళ్లే ముందు SPF ఉన్న లిప్ బామ్ రాయడం మంచిది. ఇది సూర్యరశ్మి వల్ల పెదాలు నల్లబడకుండా కాపాడుతుంది.
బొడ్డుకు నూనె రాయండి: ఆయుర్వేదం ప్రకారం రాత్రి పడుకునే ముందు బొడ్డులో కొద్దిగా ఆవాల నూనె లేదా బాదం నూనె వేయడం వల్ల శరీరానికి తేమ అంది పెదాల ఆరోగ్యానికి కూడా మేలు జరుగుతుందని చెబుతారు.
దోసకాయ రసం ఉపయోగించండి: దోసకాయ రసాన్ని పెదవులకు రాస్తే నల్లదనం తగ్గడమే కాకుండా చల్లదనాన్ని కూడా ఇస్తుంది. వేసవిలో ఇది మంచి సహజ చికిత్సగా పనిచేస్తుంది.
పెదాలను పదేపదే తడపకండి: చాలామందికి పెదాలను నాలుకతో తడపడం అలవాటు ఉంటుంది. కానీ, లాలాజలంలోని ఎంజైమ్‌లు పెదాలను మరింత పొడిబారేలా చేస్తాయి. కాబట్టి ఈ అలవాటును వెంటనే మానుకోవాలి. మొత్తంగా ఈ చిన్న చిట్కాలు పాటిస్తే వేసవిలో కూడా మీ పెదాలు మృదువుగా, గులాబీ రంగులో ఆరోగ్యంగా మెరిసిపోతాయి.
తాజావార్తలు
-
Saddula Bathukamma : హైదరాబాద్ ట్యాంక్ బండ్ పై ఘనంగా సద్దుల బతుకమ్మ వేడుకలు
-
Tiger Shroff Firing: టైగర్ ష్రాఫ్‌పై కాల్పులు బిష్ణోయ్ గ్యాంగ్ పనే.. కారణం ఇదే.!
-
Rashmika: ‘పెళ్లి కోసం నన్ను ఏడాది పాటు తిప్పించుకున్నాడు’..!
-
Aadhaar Update: ఆధార్ కార్డుదారులకు గుడ్ న్యూస్.. డిసెంబర్ 31 వరకు ఈ అప్డేట్ ఫ్రీ!
-
Karimnagar Dumping Yard : పూజ గదిలోకి పొగ.. అమ్మవారికే అల్కాపురి ప్రజల మొర
ట్రెండింగ్
-
Ayudha Pooja : ఆయుధ, సరస్వతీ పూజలకు ఇల్లు సిద్ధమవుతోందా?.. ఈ సింపుల్ టిప్స్‌తో మెరిపించేయండి!
-
IND vs WI: సిరీస్ డిసైడర్‌కు పొంచిఉన్న వర్షం ముప్పు.. మ్యాచ్ జరగకుంటే కప్ ఎవరికిస్తారంటే.?
-
Mahela Jayawardene: ముంబై ఇండియన్స్‌కు బిగ్ షాక్.. హెడ్ కోచ్ పదవికి మహేల జయవర్ధనే గుడ్‌బై..!
-
Vaibhav Sooryavanshi: గంభీర్ ఎంత పనిచేస్తున్నావయ్యా..! టీమ్‌లో ఛాన్స్‌పై వైభవ్ ఆశలు.. ‘స్టిల్ బిలీవింగ్’ అంటూ.!
-
Wasim Jaffer: టీమిండియా మాజీ ఓపెనర్ కీలక నిర్ణయం.. చీఫ్ సెలెక్టర్ పదవికి దరఖాస్తు..!