Donald Trump: అమెరికా సుప్రీంకోర్టులో అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌కి భారీ విజయం లభించింది. వ్యక్తిగతంగా న్యాయమూర్తులు ట్రంప్ అధికారాలను కట్టడి చేయడాన్ని సుప్రీంకోర్టు పరిమితం చేసింది. జన్మహక్కు పౌరసత్వాన్ని రద్దు చేయాలనే ట్రంప్ ప్రయత్నంపై 6-3తో తీర్పు ఇచ్చింది. డిస్ట్రిక్ట్ కోర్ట్ న్యాయమూర్తులు దేశవ్యాప్తంగా జారీ చేసిన నిషేధాలు చట్ట సభలు కోర్టులకు ఇచ్చిన అధికారాలను మించిపోయేలా ఉందని కోర్టు పేర్కొంది.
Donald Trump: అమెరికా అధ్యక్ష బాధ్యతలు తీసుకున్నప్పటి నుంచి డొనాల్డ్ ట్రంప్ జెట్ వేగంతో పనిచేస్తున్నారు. ముఖ్యంగా తాను ఎన్నికల ప్రచారంలో ఏవైతే హామీలు ఇచ్చారో, వాటిపై ఎగ్జిక్యూటివ్ ఆర్డర్లు విడుదల చేశారు. అక్రమ వలసదారుల్ని దేశం నుంచి బహిష్కరించడం, వివిధ దేశాలపై వాణిజ్య సుంకాలు పెంచడం, జన్మహక్కు(బర్త్ రైట్) పౌరసత్వాలను నిషేధిస్తూ ఆర్డర్లపై సంతకాలు చేశారు.
Birthright Citizenship Order: జన్మతః పౌరసత్వం లభించే హక్కును రద్దు చేస్తూ యూఎస్ ప్రెసిడెంట్ డొనాల్డ్ ట్రంప్ ఇచ్చిన ఎగ్జిక్యూటివ్ ఆర్డర్‌ను సియాటిల్‌లోని ఫెడరల్ కోర్టు న్యాయమూర్తి తాత్కాలికంగా నిలిపివేస్తున్నట్లు ఆదేశాలు జారీ చేశారు.
Donald Trump: అమెరికా 47వ అధ్యక్షుడిగా డొనాల్డ్ ట్రంప్ అధికార బాధ్యతలు తీసుకున్నారు. వచ్చీ రాగానే ఆయన గత పాలకుడు జో బైడెన్ నిర్ణయాలను రద్దు చేస్తూ ఉత్తర్వులపై సంతకం చేశారు. ఇదిలా ఉంటే, తన ఎన్నికల హామీల్లో కీలకమైన ‘‘బర్త్ రైట్ పౌరసత్వం’’ని రద్దు చేస్తూ ఎగ్జిక్యూటివ్ ఆర్డర్ పాస్ చేశారు. దీంతో ముఖ్యంగా విదేశాల నుంచి అమెరికా వెళ్లిన వారికి భారీ షాక్ అని చెప్పొచ్చు. ముఖ్యంగా భారతీయ వలసదారులకు ఈ పరిణామం మింగుడుపడటం…
Donald Trump: అమెరికా గడ్డపై జన్మించిన ప్రతి చిన్నారికి పౌరసత్వం లభించే చట్టాన్ని నూతన అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ రద్దు చేశారు. ఇప్పటివరకు ఉన్న విధానం ప్రకారం, అమెరికాలో జన్మించిన ప్రతి చిన్నారికి సహజంగా పౌరసత్వ హక్కు లభించేది. ఇది 14వ రాజ్యాంగ సవరణ ద్వారా అమలులోకి వచ్చింది. కానీ, తాజాగా ట్రంప్ ఈ చట్టాన్ని ఎగ్జిక్యూటివ్ ఆర్డర్ (Executive Order) ద్వారా రద్దు చేస్తూ కీలక నిర్ణయం తీసుకున్నారు. ‘‘ వలసదారుల పిల్లలకు పౌరసత్వాన్ని మా…