Islamabad in Lockdown: 10 రోజులుగా లాక్‌డౌన్‌లో ఇస్లామాబాద్.. తిట్టిపోస్తున్న పాక్ ప్రజలు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Islamabad in Lockdown: పాకిస్తాన్ రాజధాని ఇస్లామాబాద్ గత 10 రోజులుగా అప్రకటిత లాక్‌డౌన్ పరిస్థితులను ఎదుర్కొంటోంది. అమెరికా-ఇరాన్ మధ్య ఉద్రిక్తతలు, శాంతి చర్చల అవకాశాలు, ఉన్నతస్థాయి విదేశీ ప్రతినిధుల పర్యటనల నేపథ్యంలో ప్రభుత్వం కట్టుదిట్టమైన భద్రతా చర్యలు చేపట్టింది. అయితే, ఈ ఆంక్షలతో సాధారణ ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఇస్లామాబాద్‌లో ప్రధాన రహదారులను మూసివేయడంతో పాటు మార్కెట్లు, వ్యాపార కేంద్రాలు కూడా మూతపడ్డాయి. నగరమంతా సైన్యం, పోలీసులు మోహరించడంతో ప్రజా రవాణా కూడా దాదాపు నిలిచిపోయింది. ప్రభుత్వ ఉద్యోగులను ఇంటి నుంచే పనిచేయాలని సూచించగా, రోజువారీ కూలీలు, చిన్న వ్యాపారులు మాత్రం ఆదాయం లేక తీవ్ర కష్టాల్లో పడిపోయారు.
Read Also: Aadarsha Kutumbam: ఆ వార్తలన్నీ ఫేక్!
Also Read
- RBI Repo Rate Hike: హోమ్, కార్ లోన్లు ఉన్నవారికి బిగ్ షాక్.. రెపో రేటు పెంచిన ఆర్బీఐ.. సామాన్యులపై తీవ్ర భారం..
- Amaravati Land Pooling: అమరావతిలో ల్యాండ్ పూలింగ్‌పై ఫోకస్.. అధికారులకు మంత్రి నారాయణ కీలక సూచనలు
- Tollywood: పాపం.. సక్సెస్ మీట్ కి డైరెక్టర్ నే పక్కన పెట్టారు.!
- PM Modi: సీఎంగా మొదలై ప్రధాని వరకు.. ప్రధాని 25 ఏళ్ల సుదీర్ఘ ప్రస్థానం.. ఆలయంలో మోడీ ప్రత్యేక పూజలు
ఇప్పటికే ద్రవ్యోల్బణం, పేదరికంతో సతమతమవుతున్న పాకిస్తాన్ ప్రజలకు ఈ పరిస్థితి మరింత భారంగా మారింది. పని లేక, సంపాదన లేక కుటుంబాలను పోషించలేకపోతున్నామని స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. చర్చలు జరుగుతున్నాయా, రద్దయ్యాయా అనే స్పష్టత లేక ప్రజల్లో అసహనం పెరుగుతోంది. స్థానిక నివాసి మహమ్మద్ సాబిర్ మాట్లాడుతూ, కొన్నిసార్లు ట్రంప్ వస్తున్నారని, మరికొన్నిసార్లు ఇరాన్ అధ్యక్షుడు వస్తున్నారని చెబుతున్నారని, కానీ ప్రజల సమస్యలను మాత్రం ఎవరూ పట్టించుకోవడం లేదని విమర్శించారు. వ్యాపారం లేదు, పని లేదు, ప్రజలు ఆకలితో అలమటిస్తున్నారని అన్నారు.
ప్రభుత్వ ఆదేశాల మేరకు ఇస్లామాబాద్, రావల్పిండి ప్రాంతాల్లోని కొన్ని హాస్టళ్లను ఖాళీ చేయించడంతో వేలాది మంది కార్మికులు ఇబ్బందులు ఎదుర్కొన్నారు. ముందస్తు సమాచారం లేకుండా గదులు ఖాళీ చేయించడంతో కొత్త వసతి కోసం వారు పరుగులు తీయాల్సి వచ్చింది. పాకిస్తాన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్‌లో ఉద్యోగిగా పనిచేస్తున్న అరీజ్ అక్తర్ మాట్లాడుతూ, ప్రజా రవాణా నిలిచిపోవడంతో తిరిగి నగరానికి చేరుకోలేకపోతున్నామని తెలిపారు. తాము పంజరంలో బంధించబడ్డట్లుగా అనిపిస్తోందని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు. మొత్తంగా.. అమెరికా-ఇరాన్ చర్చలపై అనిశ్చితి కొనసాగుతున్న వేళ, ఇస్లామాబాద్‌లో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ప్రభుత్వం భద్రతకు ప్రాధాన్యం ఇస్తున్నప్పటికీ, సామాన్య ప్రజల జీవితం మాత్రం స్తంభించిపోయింది. చర్చలు ముగిసే వరకు ఈ పరిస్థితి కొనసాగే అవకాశం ఉందని భావిస్తున్నారు.
తాజావార్తలు
-
Electricity Meter Red Light Blinking: కరెంట్ బిల్లు భారీగా వస్తుందా? మీటర్ ముందే ఇచ్చే సంకేతం ఇదే.. కచ్చితంగా తెలుసుకోండి..
-
Bhuvneshwar Kumar Comeback: అగార్కర్ హయాంలో భువనేశ్వర్‌కు ఎందుకు చోటు దక్కలేదు?
-
RBI Repo Rate Hike: హోమ్, కార్ లోన్లు ఉన్నవారికి బిగ్ షాక్.. రెపో రేటు పెంచిన ఆర్బీఐ.. సామాన్యులపై తీవ్ర భారం..
-
Dhanush Political Entry : తమిళనాడు రాజకీయాల్లోకి ధనుష్.. పార్టీ పేరు ఇదే?
-
Amaravati Land Pooling: అమరావతిలో ల్యాండ్ పూలింగ్‌పై ఫోకస్.. అధికారులకు మంత్రి నారాయణ కీలక సూచనలు
ట్రెండింగ్
-
Actors To Directors: టాలీవుడ్లో సరికొత్త ట్రెండ్.! యాక్టర్స్ టు డైరెక్టర్స్.. సొంత కథలతోనే హిట్ ప్లాన్.!
-
Tulsi Care Tips: తులసి మొక్కల పక్కన ఈ ఐదు మొక్కలను అస్సలు నాటొద్దు.. ఎందుకో తెలుసా?
-
Bathroom Tiles Cleaning Tips: హార్పిక్, యాసిడ్ అక్కర్లేదు.. కెమికల్స్ లేకుండానే బాత్రూమ్ టైల్స్‌పై మొండి గార మరకలను సులువుగా తొలగించండి ఇలా.!
-
Bhuvneshwar Kumar 2.O: 36 ఏళ్ల వయసులో రీఎంట్రీ.. భువీ ఊహించని పునరాగమనం వెనుక అసలు కథ ఇదే!
-
Shreyas Iyer History: శ్రేయస్ అయ్యర్ నయా రికార్డు.. సెంచరీ చేసిన మొదటి కెప్టెన్‌గా సర్పంచ్ సాబ్!