OMG: ఆడుకుంటూ గంగాళంలో ఇరుక్కున్న చిన్నారి.. చివరి ప్రయత్నంలో ఇలా..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
పిల్లలు అంటేనే ఉత్సాహం, అమాయకత్వం , అంతులేని కుతూహలం. వారికి లోకంతో సంబంధం ఉండదు, ఏది ప్రమాదమో, ఏది కాదో అస్సలు తెలియదు. ఆడుకోవడానికి వస్తువు దొరికితే చాలు.. అది బొమ్మ అయినా, వంటగదిలోని పాత్రలైనా వాళ్లకు ఒకటే. గలగలమంటూ నవ్వుతూ ఇల్లంతా తిరిగే పిల్లలు ఒక్కోసారి చేసే చిన్న చిన్న పనులు పెద్ద ప్రమాదాలకు దారితీస్తుంటాయి. అందుకే ‘పిల్లలు ఉన్న ఇంట్లో కళ్లు వెనక కూడా ఉండాలి’ అని పెద్దలు అంటుంటారు.
కేరళంలో జరిగిన సంఘటన..
తాజాగా కేరళంలో ఒక చిన్నారి ఆడుకుంటూ ఇంట్లో ఉన్న ఒక పెద్ద అల్యూమినియం వంట పాత్ర (గంగాళం) లోకి దూరింది. లోపలికి వెళ్లడం అయితే సులభంగానే వెళ్ళింది కానీ.. తిరిగి బయటకు రావడానికి వీలు లేకుండా ఆ పాత్రలో ఇరుక్కుపోయింది. ఆ చిన్నారి ఎంత ప్రయత్నించినా బయటకు రాలేకపోవడంతో భయపడి ఏడవడం మొదలుపెట్టింది. వెంటనే గమనించిన తల్లిదండ్రులు కూడా ఆ పాపను బయటకు తీయడానికి శతవిధాలా ప్రయత్నించారు, కానీ ఫలితం లేకపోయింది. చివరకు అగ్నిమాపక సిబ్బందికి సమాచారం అందించారు. వారు వచ్చి చాలా జాగ్రత్తగా, ఒక లోహపు కట్టర్ సాయంతో ఆ అల్యూమినియం పాత్రను కట్ చేసి, పాపకు ఎటువంటి గాయం కాకుండా సురక్షితంగా బయటకు తీశారు.
Also Read
- UP News: ప్రియుడితో లేచిపోయిన కూతురు, షాక్‌లో తల్లి మృతి.. బతికున్న కుమార్తెకు అంత్యక్రియలు..
- Neha Bora: నాలుగోసారి కూడా.. శాంతి ఒప్పందంపై సంతకానికి నేహా బోరా నిరాకరణ
- Bangladesh: షేక్ హసీనా వీడియో వివాదం.. బంగ్లాదేశ్ మాజీ ఎయిర్‌ఫోర్స్ అధికారి మృతి..
- Naseeruddin Shah: 'నేను దిమాగీ నక్సల్‌నే'.. విద్యార్థుల పోరాటానికి మద్దతుగా నసీరుద్దీన్ షా సంచలన వ్యాఖ్యలు..
A child in Kerala got stuck inside an aluminium cooking pot while playing at home. Fire and Rescue Services team successfully rescued the kid.
Parents, please be extra careful and keep an eye on your children around household items!#Kerala #ChildSafety pic.twitter.com/DMG3ydxdJd— ಸನಾತನ (सनातन) (@sanatan_kannada) April 23, 2026
పిల్లలు ఇలాంటి వింతైన పనులు చేయడం సహజం, కానీ అది ప్రాణాపాయం కాకుండా చూడటం మన బాధ్యత. వంటగదిలోని వస్తువులతో ఆడుకునేటప్పుడు చాలా జాగ్రత్తలు తీసుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు. ఇంట్లో ఉండే ఖాళీ డ్రమ్ములు, పెద్ద పాత్రలు, బకెట్లు వంటి వాటిని పిల్లలకు అందుబాటులో లేకుండా బోర్లించి ఉంచండి లేదా ఎత్తులో పెట్టడం మంచిది. పిల్లలు తలకు ప్లాస్టిక్ కవర్లు తగిలించుకోవడం వల్ల ఊపిరి ఆడకపోయే ప్రమాదం ఉంది. వాటిని దూరంగా ఉంచితే మంచిది. అంతే కాకుండా.. గొలుసులు, తాళ్లు లేదా వైర్లతో ఆడుకునేటప్పుడు అవి మెడకు చుట్టుకోకుండా చూసుకోవాలి. పిల్లలు నిశ్శబ్దంగా ఒకే చోట ఉన్నారంటే ఏదో కొత్త ప్రయోగం చేస్తున్నారని అర్థం. కాబట్టి వారు ఏం చేస్తున్నారో ఎప్పటికప్పుడు గమనిస్తూ ఉండాలి. పెద్ద అల్మారాల్లో పిల్లలు దూరి లోపల లాక్ చేసుకునే అవకాశం ఉంటుంది. వాడుకలో లేని వాటికి తాళం వేయడం ఉత్తమం అని నిపుణులు సూచిస్తున్నారు.
కేరళం చిన్నారి సంఘటన మనందరికీ ఒక హెచ్చరిక. అదృష్టవశాత్తూ అగ్నిమాపక సిబ్బంది సమయానికి స్పందించి ఆ పాపను రక్షించారు. కానీ ప్రతిసారీ ఇలాగే జరుగుతుందని చెప్పలేము. కాబట్టి, మన ఇంట్లోని వస్తువులు మన పిల్లలకు ప్రాణసంకటం కాకుండా చూసుకోవాలి. చిన్నపిల్లల అల్లరిని ఆస్వాదిస్తూనే, వారి భద్రత విషయంలో ఎప్పుడూ అప్రమత్తంగా ఉందాం. మీ పిల్లల భద్రత మీ చేతుల్లోనే ఉంది.
తాజావార్తలు
-
OTR : స్థానిక ఎన్నికల వేళ ఏపీలో పూర్తి స్థాయి పొలిటికల్ హీట్
-
Telangana MLC Elections: MLC ఎన్నికల్లో కామ్రేడ్స్ చెరోదారి! కాంగ్రెస్‌కు షాక్ తప్పదా?
-
UP News: ప్రియుడితో లేచిపోయిన కూతురు, షాక్‌లో తల్లి మృతి.. బతికున్న కుమార్తెకు అంత్యక్రియలు..
-
CM Revanth Reddy : తెలంగాణలో పెట్టుబడులు రెట్టింపు చేయండి.. భద్రత నాది
-
Keerthy Suresh: విమానంలో కీర్తి సురేశ్‌తో తాగుబోతు రచ్చ!
ట్రెండింగ్
-
Scalp Care Tips : చలికాలంలో చుండ్రు వేధిస్తోందా? ఈజీ అండ్ నాచురల్ చిట్కాలతో చెక్ పెట్టండిలా
-
Ragi Biscuits: ఓవెన్ లేకుండానే ఇంట్లో కరకరలాడే ‘రాగి బిస్కెట్లు’.. ఇలా చేస్తే పిల్లలు లొట్టలేసుకుంటూ తింటారంతే..!
-
Rice Flour Poori Recipe: ప్రతీసారి గోధుమ పిండి పూరీలేనా?.. ఈ ఫెస్టివల్ సీజన్లో సాఫ్ట్ బియ్యప్పిండి పూరీలు ట్రై చేయండి..
-
Remove Stubborn Stains: ఈ ఒక్క చిట్కా పాటిస్తే చాలు.. బట్టలపై ఉండే ఎంతటి జిడ్డు, మొండి మరకలైనా ఇట్టే వదలాల్సిందే..!
-
Tata Motors Diwali Offers: ఆఫర్లే.. ఆఫర్లు.. టాటా మోటార్స్ దీపావళి సేల్..! ఏ కారుపై ఎంత తగ్గించారంటే..?