పార్లమెంట్ సమావేశాలు ప్రారంభం అయిన రోజు నుంచి… ఇవాళ్టి వరకు సమావేశాలు చాలా వేడి వాడిగా సాగుతున్నాయి. ముఖ్యంగా రైతుల సమస్యలే ఫోకస్ గా విపక్షాలు ప్లారమెంట్ లో నిరసనలు తెలుపుతున్నాయి. ఇక ఇవాళ్టి రోజు కూడా టీఆర్‌ఎస్ పార్టీ ఎంపీలు కేంద్ర ప్రభుత్వాన్ని పార్లమెంట్ వేదికగా… నిలదీశారు. ప్రొక్యూర్మెంట్ పాలసీని ప్రకటించాలని డిమాండ్ చేశారు ఎంపీలు. ఈ నేపథ్యంలో.. ఇవాళ లోక్ సభలో టీఆర్‌ఎస్ ఎంపీలు.. స్పీకర్ పొడియాన్ని చుట్టుముట్టారు.
ప్లకార్డులు పట్టుకుని.. కేంద్రానికి వ్యతిరేకంగా.. నినాదాలు చేశారు టీఆర్‌ఎస్ ఎంపీలు. ప్రశ్నోత్తారాల సమయంలో టీఆర్‌ఎస్ ఎంపీలు.. వెల్ లోకి దూసుకెళ్లి.. రైతులను కాపాడాలంటూ నినాదాలు చేశారు. ధాన్యం సేకరణ పై విధానాన్ని ప్రకటించాలని డిమాండ్ చేశారు. మద్దతు ధర చట్టాన్ని తీసుకురావాలన్నారు. అలాగే.. 12 మంది ఎంపీలపై విధించిన సస్పెన్షన్ ను కూడా ఎత్తివేయాలని కోరుతూ.. రాజ్యసభలో టీఆర్‌ఎస్ తో సహా ఇతర పార్టీల ఎంపీలు ఆందోళన చేపట్టారు. దీంతో సభను చైర్మన్ వెంకయ్య నాయుడు వాయిదా వేశారు.