Andhra Pradesh Crime: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ట్రిపుల్ మర్డర్ కలకలం సృష్టిస్తోంది.. అనంతపురం జిల్లా యాడికి మండలం నిట్టూరు గ్రామంలో ముగ్గురి హత్య సంచలనంగా మారింది.. మొదట ఆరుబయట నిద్రిస్తున్న భార్యాభర్తలు బాలరాజు (53), సుంకులక్క (47 )లను కొడవలితో అతి దారుణంగా నరికి చంపాడు ప్రసాద్ అనే వ్యక్తి.. అయితే, హత్య విషయం తెలుసుకున్న బాలరాజు కుటుంబ సభ్యులు ఆగ్రహంతో ఊగిపోయారు.. స్థానికులతో కలిసి ప్రసాద్‌పై దాడి చేశారు.. రాళ్లతో కొట్టి చంపారు. కాగా, గొర్రెల మందకు కాపాలాగా బాలరాజు దంపతులు ఇంటి బయట నిద్రిస్తున్న సమయంలో ఈ దారుణంగా హత్య చేశాడు ప్రసాద్.. ఆ తర్వాత బాలరాజు కుటుంబ సభ్యులు, స్థానికుల దాడిలో ప్రాణాలు కోల్పోయాడు.. ఇక, ఘటనా స్థలానికి పరిశీలించిన పోలీసులు.. కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.. మూడు మృతదేహాలను పోస్ట్‌మార్టం నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. ప్రసాద్ కు మతిస్థిమితం సరిగా లేదని సమాచారం తెలుస్తుండగా.. ఈ ఘటనకు సంబంధించిన పూర్తి సమాచారం తెలియాల్సి ఉంది.
Read Also: Telangana: నేడే పాలమూరు–రంగారెడ్డి ఎత్తిపోతల పథకం ప్రారంభం.. కృష్ణమ్మకు జలహారతి ఇవ్వనున్న కేసీఆర్