ట్రాఫిక్ సిగ్నల్స్‌పై ట్రాన్స్‌జెండర్లు డబ్బులు అడగకుండా నిషేధిస్తూ సీఆర్‌పీసీ సెక్షన్ 144 కింద పూణే పోలీసులు ఉత్తర్వులుజారీ చేశారు. ఇందులో ముఖ్యంగా ట్రాఫిక్ జంక్షన్లలో బలవంతంగా డబ్బు డిమాండ్ చేస్తూ ట్రాన్స్‌జెండర్లు, బిచ్చగాళ్ల పై ఫిర్యాదులు పెరుగుతున్న నేపథ్యంలో ఈ చర్య తీసుకున్నట్లు పోలీసులు తెలిపారు. ఇక అధికారిక నోటిఫికేషన్ ప్రకారం., నివాసితులు, సంస్థలను సందర్శించడానికి కూడా ఆహ్వానం లేకుండా ట్రాన్స్‌జెండర్లు అనుమతించబడరని పోలీసులు తెలిపారు. ఇక ఇందుకు సంబంధించి ఎవరైనా మితిమీరి హద్దు దాటితే భారతీయ శిక్షాస్మృతి మరియు ఇతర సంబంధిత సెక్షన్ల సెక్షన్ 188 కింద వ్యవహరించబడుతుందని పోలీసులు తెలిపారు.
ఇక ఈ విషయం గురించి పూణే సీపీ అమితేష్ కుమార్ మాట్లాడుతూ., “మేము సిఆర్పిసి సెక్షన్ 144 కింద ఆర్డర్ జారీ చేస్తున్నామని., లింగమార్పిడి, యాచకులను పెద్ద ఎత్తున ఇబ్బంది పెట్టడాన్ని మేము గమనించనట్లు ఆయన తెలిపారు. ముఖ్యంగా ట్రాఫిక్ జంక్షన్లలో వారు బలవంతంగా డబ్బు డిమాండ్ చేస్తారని.. అలాగే ఇళ్లు, వాణిజ్య సంస్థలు మరియు ప్రజల నుండి కూడా బలవంతంగా డబ్బు డిమాండ్ చేస్తున్నారని తమ దృష్టికి వచ్చినట్లు ఆయన తెలిపారు.
ఇక ఈ నోటిఫికేషన్ ప్రాథమికంగా అటువంటి వాటిని నిషేధించాలని, వారిని ఆహ్వానించబడకుండా ఎటువంటి నివాసితుల గృహాలు, సంస్థలను సందర్శించకూడదని తెలిపారు. ఇక ఈ విషయాన్ని మేము దీన్ని చాలా కఠినంగా అమలు చేస్తామని., ఇక ఈ విషయంపై నిఘా పెట్టేందుకు కూడా సిద్దమైనట్లు తెలిపారు. ఇక ఇప్పటి నుండి ఇలాంటి కేసు ఏదైనా వెలుగులోకి వస్తే చట్ట ప్రకారం చర్యలు తీసుకుంటాం అని ఆయన చెప్పుకొచ్చారు. ట్రాఫిక్ జంక్షన్ల వద్ద వారు క్రమశిక్షణ లోపించడం వల్ల ప్రయాణికులకు అసౌకర్యం కలుగుతోందని ఫిర్యాదులు అందుతున్నాయని కుమార్ పేర్కొన్నారు.