ఎమ్మెల్సీ ఎన్నికల నేపథ్యంలో ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో రెండు రోజులు మద్యం షాపులు మూతపడనున్నాయి.. టీచర్ ఎమ్మెల్సీ ఎన్నికలను దృష్టిలో ఉంచుకొని ఈ సాయంత్రం 4 గంటల నుంచి వైన్స్‌లు, బార్లు ఇతర మద్యం షాపులు మూసివేశారు. ఈనెల 5వ తేదీ సాయంత్రం వరకు మద్యం షాపులు మూసివేయనున్నారు. ఎన్నికల కమిషన్ ఆదేశాలు మేరకు మద్యం షాపులు మూసివేశారు నిర్వహకులు..
హర్యానా అసెంబ్లీ ఎన్నికల ఓట్ల లెక్కింపు కొనసాగుతుంది. మూడోసారి అధికారం దిశగా బీజేపీ దూసుకెళ్తుంది. బీజేపీకి స్పష్టమైన ఆధిక్యం ఉంది. ప్రస్తుతం 50 చోట్ల ఆధిక్యంలో బీజేపీ ఉండగా.. 35 స్థానాల్లో లీడ్ లో కాంగ్రెస్ ఉంది. ఈ క్రమంలో.. భారతీయ జనతా పార్టీ (బిజెపి) హర్యానా యూనిట్ రాష్ట్ర అధ్యక్షుడు మోహన్ లాల్ బడోలి మాట్లాడారు. కాంగ్రెస్‌కు రెండు రోజులు సంతోషం మాత్రమే మిగులుతుందని ఎగ్జిట్ పోల్ సమయంలోనే తాను చెప్పానని అన్నారు. వస్తున్న ఫలితాలను…
కోల్‌కతా వైద్యురాలి హత్యాచార ఘటన దేశాన్ని కుదిపేసింది. ఈ ఘటన తర్వాత పెద్ద ఎత్తున దేశ వ్యాప్తంగా ఆందోళనలు, నిరసనలు చోటుచేసుకున్నాయి. ఇక ఈ కేసును సుప్రీంకోర్టు సుమోటోగా స్వీకరించి దర్యాప్తు చేస్తోంది.
భారత వాతావరణ శాఖ ఈ రాష్ట్రాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు పడుతాయని హెచ్చరించింది. గంగా నది పశ్చిమ బెంగాల్‌పై లోతైన అల్పపీడనం ఏర్పడిన ప్రభావంతో.. ఈరోజు, రేపు జార్ఖండ్, గంగానది పశ్చిమ బెంగాల్, ఒడిశా, బీహార్‌లో అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది. గత 24 గంటల్లో గంగా పశ్చిమ బెంగాల్, జార్ఖండ్, ఒడిశా, బీహార్‌లో భారీ నుండి అతి భారీ వర్షపాతం నమోదైంది.
కేరళలోని ఓ ఆస్పత్రిలో ఆశ్చర్యకరమైన ఘటన వెలుగులోకి వచ్చింది. ఆసుపత్రిలో చికిత్స కోసం వచ్చిన ఓ రోగి రెండు రోజులుగా లిఫ్ట్‌లో ఇరుక్కుపోయాడు. రెండ్రోజులు నరకయాతన అనుభవించిన అతను.. ఈరోజు లిఫ్ట్‌లో నుంచి బయటకు వచ్చాడు. ఎన్నిసార్లు అరిచినా అతని అరుపులు బయటి వారికి వినిపించలేదు.
మాచర్ల మాజీ ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డిని రెండు రోజులు పాటు పోలీస్ కస్టడీకి ఇస్తూ మాచర్ల కోర్టు ఆదేశాలు ఇచ్చింది. పిన్నెల్లిని ఈనెల 8, 9 తేదీల్లో నెల్లూరు జైల్లోనే విచారణ చేసేందుకు అనుమతి ఇచ్చింది కోర్టు. కారంపూడిలో సర్కిల్ ఇన్స్పెక్టర్ పై దాడితో పాటు, పాలవాయి గేట్ లో ఓ వ్యక్తిపై హత్యాయత్నం కేసులో పూర్తి దర్యాప్తు కోసం పిన్నెల్లి రామకృష్ణారెడ్డిని నాలుగు రోజులు కస్టడీకి కోరారు పోలీసులు.
రెండ్రోజుల్లో అన్ని స్టాక్ పాయింట్లలో తనిఖీలు పూర్తి చేయాలని సివిల్ సప్లయిస్ మంత్రి నాదెండ్ల మనోహర్ ఆదేశించారు. సివిల్ సప్లయిస్ కార్యాలయంలో తూనికలు కొలతలు విభాగపు అధికారులతో సివిల్ సప్లయిస్ మంత్రి మనోహర్ నాదెండ్ల సమీక్షించారు.
మా ఊరి పొలిమేర 2 మూవీ నవంబర్ 3 న రిలీజైన సంగతి తెలిసిందే. ఈ చిన్న సినిమా ఎలాంటి అంచనాలు లేకుండా విడుదల అయి బాక్సాఫీస్ దగ్గర భారీ వసూళ్లు సాధిస్తోంది.మూవీకి తొలి రోజు నుంచే మంచి టాక్ రావడంతో శుక్ర మరియు శని వారాల్లో మంచి కలెక్షన్లు వచ్చాయి. మూడో రోజైన ఆదివారం ఈ సినిమా బ్రేక్ ఈవెన్ సాధించే అవకాశం ఉన్నట్లు తెలుస్తుంది..మా ఊరి పొలిమేర 2 మూవీ తొలి రెండు రోజుల్లోనే…
రేపటి నుంచి సీఎం జగన్ వరద ప్రభావిత, ముంపు మండలాల్లో పర్యటించనున్నారు. రేపు, ఎల్లుండి రెండు రోజులపాటు సీఎం పర్యటించనున్నారు. అల్లూరి సీతారామరాజు జిల్లా, ఏలూరు, అంబేద్కర్ కోనసీమ జిల్లాలో సీఎం పర్యటించనున్నారు.