Pawan Kalyan: పవర్ స్టార్ పవన్ కళ్యాణ్.. ఇండియాలో ఆయనకున్న క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. పవన్ కి ఫాన్స్ కాదు భక్తులు మాత్రమే ఉంటారు అని అభిమానులు చెప్పుకొస్తూ ఉంటారు. ఈ విషయాన్ని చాలా సార్లు అభిమానులు నిరూపించారు కూడా. ఆయన సినిమా రిలీజ్ అవ్వడం ఆలస్యం.. రికార్డులు సృష్టించడానికి రెడీ అయిపోతారు. సినిమా హిట్, ప్లాప్ అనేది లెక్క ఉండదు వారికి.. పవన్ సినిమా అంతే. ఇక ఈ మధ్యనే పవన్ కళ్యాణ్ నటించిన బ్రో సినిమా ప్రేక్షకుల ముందుకు వచ్చిన విషయం తెలిసిందే. ఈ సినిమాలో సాయి ధరమ్ తేజ్ మరో హీరోగా నటించాడు. సముద్రఖని దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా జూలై 28న ప్రేక్షకుల ముందుకు వచ్చింది. అయితే మిక్స్డ్ టాక్ తెచ్చుకున్న ఈ చిత్రం కలక్షన్స్ రాబట్టలేకపోయింది అనేది ఇండస్ట్రీ టాక్.
Vijay Setupathi: ‘ఉప్పెన’ విలన్ అసలు కూతురును చూశారా.. ?
ఇక థియేటర్ లో హంగామా చేయని సినిమాలు ఓటిటీలో రచ్చ చేస్తాయి అన్న విషయం తెల్సిందే. తాజాగా బ్రో కూడా అదే కోవలోకి చేరింది. ఈ మధ్యనే ఈ సినిమా నెట్ ఫ్లిక్స్ లో స్ట్రీమింగ్ అయ్యింది. రిలీజ్ అయిన దగ్గరనుంచి బ్రో నెట్ ఫ్లిక్స్ టాప్ ట్రెండింగ్ లో ఒకటిగా కొనసాగుతోంది. ఇక తాజాగా ఇండియాలోనే కాకుండా పాకిస్థాన్, బంగ్లాదేశ్ దేశాల్లో కూడా దుమ్మురేపుతోంది. ఆగస్టు 21 నుంచి 27 మధ్య సేకరించిన డేటా ప్రకారం బ్రో సినిమా ఇండియాలో నెంబర్ వన్ స్థానంలో ఉండగా పాకిస్థాన్, బంగ్లాదేశ్ లో టాప్ 8 ప్లేసులో నిలిచింది.దీంతో పవన్ ఫాన్స్ అదిరా పవన్ రేంజ్ అంటూ కామెంట్స్ పెడుతున్నారు. మరి ముందు ముందు ఈ సినిమా ఇంకెన్ని రికార్డులు సృష్టిస్తుందో చూడాలి