తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులు , పెన్షనర్లకు పండగ వేళ ప్రభుత్వం భారీ ఊరటనిస్తూ డియర్నెస్ అలవెన్స్ (DA) , డియర్నెస్ రిలీఫ్ (DR) పెంపుదలపై అధికారికంగా ఉత్తర్వులు జారీ చేసింది. ఆర్థిక శాఖ విడుదల చేసిన G.O.Ms.No. 2 (ఉద్యోగులకు) , G.O.Ms.No. 3 (పెన్షనర్లకు) ప్రకారం, జూలై 1, 2023 నుండి అమల్లోకి వచ్చేలా ఈ అలవెన్స్‌లను సవరించారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రకటించిన విధంగా, పెరిగిన ఈ డీఏ , డీఆర్ వల్ల…
తెలంగాణ రాష్ట్ర ప్రగతి చక్రం పదిన్నర లక్షల మంది ఉద్యోగుల చేతుల్లోనే ఉందని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కొనియాడారు. సచివాలయంలో జరిగిన ఉద్యోగ సంఘాల కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ, ప్రభుత్వం తీసుకునే నిర్ణయాలను ప్రజల వద్దకు తీసుకెళ్లి అమలు చేసే అసలైన సారథులు ఉద్యోగులేనని స్పష్టం చేశారు. కేవలం ముఖ్యమంత్రి, మంత్రులు మారినంత మాత్రాన వ్యవస్థ మారదని, గత ప్రభుత్వం ఒత్తిడి పెట్టి ఉద్యోగుల చేత తప్పుడు నిర్ణయాలు అమలు చేయించిందని ఆయన ఆరోపించారు. అయితే తమ…
Bhatti Vikramakra : తెలంగాణ రాష్ట్రంలోని విద్యుత్ రంగ ఉద్యోగులకు, ఆర్టిజన్లకు , పెన్షనర్లకు ప్రభుత్వం భారీ ఊరటనిస్తూ కీలక నిర్ణయం తీసుకుంది. బహిరంగ మార్కెట్లో పెరుగుతున్న ధరల సూచిని దృష్టిలో ఉంచుకుని, వీరికి రావాల్సిన డియర్ నెస్ అలవెన్స్ (DA) , డియర్ నెస్ రిలీఫ్ (DR) ను 17.651 శాతంగా ఖరారు చేస్తూ విద్యుత్ శాఖ అధికారులు రూపొందించిన ప్రతిపాదనలకు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క మల్లు అధికారికంగా ఆమోద ముద్ర వేశారు. ప్రతి…
DA Hike: కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు, పింఛనర్లు ఎదురుచూస్తున్న కరవు భత్యం (DA) పెంపుపై నేడు నిర్ణయం వెలువడే అవకాశం ఉంది. ప్రధాని నరేంద్ర మోదీ అధ్యక్షతన జరిగే కేంద్ర మంత్రివర్గ సమావేశంలో ఈ ప్రతిపాదనను చర్చించనున్నారు. ఒకవేళ ఈ పెంపునకు ఆమోదం లభిస్తే.. సుమారు కోటి మందికి పైగా ఉద్యోగులు, పింఛనర్లకు లబ్ధి చేకూరనుంది. ఈ సవరించిన డీఏ జూలై 1 నుంచి అమల్లోకి వస్తుందని తెలుస్తోంది. 7,000mAh బ్యాటరీ, 50MP సోనీ AI కెమెరా,…
భారత్‌లోనూ భూప్రకంపనలు.. హడలెత్తిపోయిన ప్రజలు భారత్‌లోనూ భూప్రకంపనలు చోటుచేసుకున్నాయి. రిక్టర్ స్కేల్‌పై 6.8గా నమోదైనట్లుగా తెలుస్తోంది. దేశ రాజధాని ఢిల్లీ సహా కోల్‌కతా, రాంచీ, త్రిపుర, అస్సాం, పాట్నాలో భూప్రకంపనలు సంభవించాయి. దీంతో భయంతో విద్యార్థులు, అధ్యాపకులు క్లాస్ రూమ్‌లోంచి బయటకు వచ్చేశారు. అలాగే అధికారులు కూడా కార్యాలయాల్లోంచి ఇళ్లకు వెళ్లిపోయారు. ఇందుకు సంబంధించిన దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. మయన్మార్, బ్యాంకాక్‌లో భారీ భూకంపం సంభవించింది. రిక్టర్ స్కేల్‌పై 7.7గా నమోదైంది. పెద్ద పెద్ద…
DA hike: కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు బీజేపీ సర్కార్ గుడ్ న్యూస్ చెప్పింది. 2 శాతం డీఏ పెంపుకు క్యాబినెట్ ఆమోదం తెలిపింది. ఈ విషయాన్ని కేంద్రమంత్రి అశ్విని వైష్ణవ్ వెల్లడించారు. ఈ పెంపుతో 53 శాతం నుంచి 55 శాతానికి డీఏ పెరగనుంది. ఈ పెంపు జనవరి1, 2025 నుంచి వర్తిస్తుంది. మొత్తంగా ఉద్యోగులు జీతాలు పెరకబోతున్నాయి. చివరిసారిగా కేంద్రం జూలై 2024లో డీఏని పెంచింది. ఆ సమయంలో 50 శాతం నుంచి 53 శాతానికి…
7th Pay Commission: కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పబోతున్నట్లు తెలుస్తోంది. మార్చిలో డీఏ 4 శాతం పెంచే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఈ పెంపుతో డియర్ నెస్ అలవెన్స్(డీఏ), డియర్‌నెస్ రిలీఫ్ 50 శాతానికి పెరుగుతాయి. ఇండస్ట్రియల్ లేబర్ వినియోగదారుల ధరల సూచి(CPI-IW) 12 నెలల సగటు 392.83గా ఉంది. దీని ప్రకారం చూస్తే డీఏ 50.2 శాతానికి పెరగడం ఖాయంగా కనిపిస్తోంది.
గత నెలలో కేంద్ర ప్రభుత్వం తన ఉద్యోగులకు డియర్‌నెస్ అలవెన్స్‌ని పెంచింది. ఆ తర్వాత.. దీపావళికి ముందు డీఏ పెంచే ప్రకటనలు రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలలో జరిగాయి. ఇప్పటి వరకు ఉత్తరప్రదేశ్, అస్సాం, రాజస్థాన్, ఛత్తీస్‌గఢ్, తమిళనాడు, చండీగఢ్‌లలో డీఏను పెంచి పండుగకు ముందు ఉద్యోగులకు సంతోషాన్ని ఇచ్చారు.
7th Pay Commission: ప్రభుత్వ ఉద్యోగులకు డియర్‌నెస్ అలవెన్స్‌కు సంబంధించి మరో అప్‌డేట్ వచ్చింది. కేంద్ర ప్రభుత్వం త్వరలో డియర్‌నెస్ అలవెన్స్ పెంపును ప్రకటించే అవకాశం ఉంది.