ముఖ్యమంత్రికి సాక్ష్యాలు ఎవరు ఇచ్చారో చెప్పడంలో సిట్ విఫలమయింది : హైకోర్టు
ఎమ్మెల్యే కొనుగోలు కేసుల్లో జడ్జ్ మెంట్ లో కీలక విషయాలు ప్రస్తావించింది హైకోర్టు. ఎమ్మెల్యేల కొనుగోలు వ్యవహారం ముమ్మాటికి తప్పేనన్న హైకోర్టు.. ముఖ్యమంత్రికి సాక్ష్యాలు ఎవరు ఇచ్చారో చెప్పడంలో సిట్ విఫలమయిందని అసహనం వ్యక్తం చేసింది. దర్యాప్తు సమాచారం సీఎంకు చేరవేతపై తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసిన హైకోర్టు. ఇన్వెస్టిగేషన్ అధికారుల దగ్గర ఉండాల్సిన ఆధారాలన్నీ మీడియాకి ప్రజల వద్దకు వెళ్లిపోయాయన్నారు. దర్యాప్తు సమాచారాన్ని మీడియా తో సహా ఎవరికి చెప్పకూడదని, దర్యాప్తు ప్రారంభ దశలోనే కీలక ఆధారాలు బహిర్గతమయ్యాయని హైకోర్టు వ్యాఖ్యానించింది. అంతేకాకుండా.. సిట్ చేసిన ఇన్వెస్టిగేషన్ ఫెర్ ఇన్వెస్టిగేషన్ లాగా అనిపించలేదు. దర్యాప్తు ఆధారాలు బహిర్గతం చేయడం వల్ల విచారణ సక్రమంగా జరగదు. ఆర్టికల్ 20, 21 ప్రకారం న్యాయమైన విచారణతో పాటు దర్యాప్తు కూడా సరైన రీతిలో జరగాలని నిందితులు కోరవచ్చని, బీజేపీ పిటిషన్ మెయింటైనబుల్ కాకపోవటంతో పిటిషన్ డిస్మిస్ అయ్యిందని తెలిపింది. నిందితులు దాఖలు చేసిన రిట్ పిటిషన్లను పరిగణలోకి తీసుకున్న హైకోర్టు.. జీవో 63 ద్వారా ఏర్పాటు చేసిన సిట్ రద్దు చేస్తున్నట్లు వెల్లడించింది. ఎఫ్ ఐ ఆర్ 455/2022 సీబీఐకు బదిలీ చేస్తున్నట్లు వెల్లడించింది. సిట్ చేసిన దర్యాప్తు రద్దు చేస్తున్నట్లు, 26 కేసుల జడ్జిమెంట్లను కోడ్ చేస్తూ హైకోర్టు తీర్పునిచ్చింది. మాజీ ప్రధాని పీవీ నరసింహారావు కేసును కోర్టు ప్రస్తావించింది. సీబీఐకి ఇవ్వడానికి 45 అంశాలను చూపెడుతూ జడ్జిమెంట్ ఇచ్చింది హైకోర్టు. సీఎం ప్రెస్ మీట్ ను కూడా ఆర్డర్ లో మెన్షన్ చేసిన హై కోర్టు.. కోర్ట్ ఆర్డర్ లో సిట్ ఉనికిని ప్రశ్నించింది. ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ తన పరిధి దాటి వ్యవహరించిందని, కోర్టుకి ఇవ్వలసిన డాక్యుమెంట్స్ ని పబ్లిక్ చేసారని మండిపడింది.
బ్లాక్ లెవెల్ హ్యాండ్లూమ్ క్లస్టర్‌ల ఏర్పాటుకు నిధులు ఇవ్వాలి
మరోసారి కేంద్ర ప్రభుత్వంపై డిమాండ్ల వర్షం కురిపించారు మంత్రి కేటీఆర్. తాజాగా ఆయన తెలంగాణ టెక్స్ టైల్ రంగానికి కేంద్ర బడ్జెట్ లో భారీగా నిధులు కేటాయించాలని డిమాండ్ చేశారు. అంతేకాకుండా.. ‘తెలంగాణ నేతన్నల సంక్షేమం, టెక్స్ టైల్ రంగ అభివృద్ధి కోసం రాష్ట్ర ప్రభుత్వం అనేక కార్యక్రమాలు చేపట్టింది. తెలంగాణ ప్రభుత్వ కార్యక్రమాలకు మద్దతు ఇవ్వాలని ఎన్నో ఏండ్లుగా కోరుతున్నా.. కేంద్ర సహకారం లభించడం లేదు. ఆర్థిక మంత్రులు మారుతున్నారు కానీ కేంద్ర బడ్జెట్ లో తెలంగాణకు అందుతున్నది శూన్యం.’ అని ఆవేదన వ్యక్తం చేశారు. తెలంగాణ ప్రభుత్వం చేపట్టిన చేనేత, టెక్స్ టైల్ రంగ అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలకి కేంద్ర బడ్జెట్ లో ఈ సారైనా నిధులు ఇవ్వాలని కేటీఆర్ విజ్ఞప్తి చేశారు. కాకతీయ మెగా టెక్స్ టైల్ పార్క్, సిరిసిల్ల మెగా పవర్ లూమ్ క్లస్టర్ కి నిధులు కేటాయించాలన్నారు మంత్రి కేటీఆర్. టెక్స్ టైల్, చేనేత రంగం భవిష్యత్తును దృష్టిలో పెట్టుకుని జీఎస్టీని పూర్తిగా రద్దు చేస్తన్నట్టు బడ్జెట్ లో ప్రకటించాలన్నారు. బ్లాక్ లెవెల్ హ్యాండ్లూమ్ క్లస్టర్ ల ఏర్పాటుకు నిధులు ఇవ్వాలన్నారు. తెలంగాణలో ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ హ్యాండ్లూమ్ టెక్నాలజీ, నేషనల్ టెక్స్ టైల్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్, హ్యాండ్లూమ్ ఎక్స్ పోర్ట్ ప్రమోషన్ కౌన్సిల్ ఏర్పాటు ప్రకటన చేయాలని, ఈసారైనా కేంద్ర ప్రభుత్వం తెలంగాణ టెక్స్ టైల్ రంగ పురోగతికి నిధులు ఇస్తుందని కేటీఆర్ ఆశాభావం వ్యక్తం చేవారు. కేంద్ర ప్రభుత్వ ప్రోత్సాహకాల లేమి, మౌలిక వసతుల కల్పన వైఫల్యంతో మేక్ ఇన్ ఇండియా కేవలం నినాదంగా మాత్రమే మిగిలిపోయిందని,
బంగ్లాదేశ్, శ్రీలంక వంటి చిన్న దేశాలతోనూ పోటీ పడలేని పరిస్థితిలో భారతదేశం ఉండడానికి ప్రధాన కారణం కేంద్ర ప్రభుత్వ విధానాలేనన్నారు. టెక్స్ టైల్, నేతన్నల పరిస్థితుల పై మోడీ సర్కార్ కు కనీస అవగాహన, చిత్తశుద్ది లేదని, తెలంగాణ లాంటి ప్రగతిశీల రాష్ట్రాల ప్రగతికి కేంద్రం సహకరించడం లేదన్నారు. నిధులు కేటాయించకుండా నేతన్నల సంక్షేమం అభివృద్ధినీ అడ్డుకోవద్దని కేటీఆర్ కోరారు. కేంద్రం ప్రవేశపెట్టే చివరి పూర్తిస్థాయి బడ్జెట్ ఇది, ఇందులోనైన నేతన్నల పట్ల తమ చిత్తశుద్ధిని మోడీ ప్రభుత్వం చాటుకోవాలన్నారు.
1 కిలో హాష్ ఆయిల్ పట్టివేత..
నూతన సంవత్సరం వేడుకలకు భాగ్యనగరం ముస్తాబవుతోంది. అయితే.. ఇదే అదునుగా భావిస్తున్న స్మగ్లర్లు మాదకద్రవ్యాలను సరఫరా చేసేందుకు పూనుకుంటున్నారు. దీంతో గత వారం రోజులుగా నగరంలో డ్రగ్స్ భారీగా పట్టుబడుతున్నాయి. అయితే.. తాజాగా చాదర్ ఘాట్ పోలీస్ స్టేషన్ పరిధిలోని మలక్ పేట యశోద హాస్పిటల్ సమీపంలో (గాంజా) హాష్ ఆయిల్ విక్రయాలు జరుగుతున్నయన్న నమ్మదగిన సమాచారంతో ఈస్ట్ జోన్ టాస్క్ ఫోర్స్ , చాదర్ ఘాట్ పోలీసులు కలసి ముగ్గురు డ్రగ్ సప్లైర్స్ ను అదుపులోకి తీసుకోవడం జరిగింది. వీరి వద్ద నుంచి 1కిలో హాష్ ఆయిల్ , 3 సెల్ఫోన్స్ స్వాధీనం చేసుకున్నారు. చాదర్ ఘాట్ పీ ఎస్ లో మీడియా సమావేశంలో మలక్ పేట ఏసీపీ వెంకటరమణ , సి ఐ ప్రకాష్ రెడ్డి వివరాలు వెల్లడించారు. విలాసవంతమైన జీవితం కు అలవాటు పడి సులువుగా డబ్బులు సంపాదించుకునేందుకు యువత తప్పడు మార్గాలు ఎంచుకుని గాంజా హాష్ ఆయిల్ ను విక్రయాలు చేస్తున్న జగద్గిరిగుట్ట కు చెందిన సందీప్ గౌడ్,వినయ్ కుమార్ రెడ్డి, మల్కాజిగిరి కి చెందిన జి పృథ్వీరాజ్‌లను మలక్ పేట యశోద హాస్పిటల్ వద్ద అరెస్ట్ చేసినట్లు తెలిపారు.
కమ్మ- కాపు వర్గ పోరుపై బండ్ల వివాదస్పద వ్యాఖ్యలు.. అదో పెద్ద రోత రాజకీయం : బండ్ల గణేష్
నటుడు, నిర్మాత బండ్ల గణేష్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. సినిమాలతో పాటు సమాజంలో జరిగే సమస్యలపై కూడా బండ్ల సోషల్ మీడియా ద్వారా అప్పుడప్పుడు స్పందిస్తూ ఉంటాడు. ఇక నిత్యం వివాదాస్పద ఇంటర్వ్యూలు చేస్తూ ఇండస్ట్రీలో హాట్ టాపిక్ గా మారే బండ్ల గణేష్ మరో సెన్సేషనల్ ఇంటర్వ్యూ ఇచ్చి షాక్ ఇచ్చాడు. బండ్ల గణేష్ లేటెస్ట్ ఇంటర్వ్యూ ప్రోమోను షేర్ చేశాడు. ఈ ఇంటర్వ్యూ లో బండ్లన్న తన మనోగతాన్ని చెప్పుకొచ్చాడు. అసలు తను ఇండస్ట్రీకి ఎలా వచ్చాడు అన్న దగ్గరనుంచి.. నిర్మాతగా ఎలా మారాడు.. తన జీవితంలో వివాదాలు, కేసులు, అవమానాలు, కష్టాలు అన్ని ఏకరువు పెట్టాడు. ఇక రాజకీయ పరంగాను బండ్లన్న హీట్ రాజేశాడు.
పవన్ కళ్యాణ్ తో విభేదాలు, ఎన్టీఆర్ తో, పూరితో, కృష్ణవంశీ తో అందరితోను ఉన్న విభేదాల గురించి గణేష్ మొదటిసారి నోరువిప్పారు. ఇక రాజకీయంగా విజయసాయి రెడ్డి కి ట్వీట్ చేయడంపై నోరు విప్పాడు.. పెద్దాయన రామోజీరావు ను ఆయన తెలియక ఏవేవో అనేయడంతో మనసుకు కష్టంగా ఉందని ట్వీట్ చేసినట్లు చెప్పుకొచ్చాడు. ఇక ఏపీ లో ఆధిపత్య పోరు నడుస్తోంది.. కులాలను వేరుచేసి కొట్టుకుంటున్నారు.. వాటిపై మీ అభిప్రాయం ఏంటి అని అడుగగా.. ” ఎవరికి తెల్సు సార్ ఆంధ్రా సంగతి.. అదో పెద్ద రోత రాజకీయం.. మనకెందుకు” అని చెప్పుకొచ్చాడు.. మీరు స్పందిస్తున్నారు కాబట్టి అడిగాను యాంకర్ అనడంతో ” స్పందించాను అంటే నేను ఒక్క విజయసాయి రెడ్డి ట్వీట్ మీదనే స్పంస్పందించాను. దాని తరువాత బొత్స నారాయణ ఫోన్ చేసి కేకలు వేశాడు” అని చెప్పుకొచ్చాడు. ప్రస్తుతం ఈ ప్రోమో నెట్టింట వైరల్ గా మారింది. ప్రోమోలోనే ఈ రేంజ్ లో ఉంటే ఫుల్ ఇంటర్వ్యూలో బండ్లన్న ఏ రేంజ్ లో చెప్పి ఉంటాడో చూడాలి.
పవన్‌ని చూస్తే వొడాఫోన్ యాడ్ గుర్తుకొస్తుంది.. రోజా సెటైర్లు : మంత్రి రోజా
ఏపీ మంత్రి రోజా మరోసారి పవన్ కళ్యాణ్, నారా లోకేష్‌లపై సెటైర్లు వేశారు. తిరుపతిలో ఆమె మాట్లాడుతూ.. పవన్‌ని చూస్తే వొడాఫోన్ యాడ్ గుర్తుకు వస్తోందని, చంద్రబాబు ఎక్కడుంటే పవన్ అక్కడుంటాడని వ్యంగ్యాస్త్రాలు సంధించారు. ఎప్పుడూ ఏ షోకి వెళ్లని పవన్.. ఇప్పుడు బాలయ్య షో (అన్‌స్టాపబుల్)కి ఎందుకు వెళ్లాడని ప్రశ్నించాడు. గతంలో పవన్ అభిమానుల్ని బాలయ్య ఎంతో దారుణంగా తిట్టారని గుర్తు చేశారు. బాలయ్య షోకి వెళ్తే పవన్‌కి ప్యాకేజీ వస్తుందని, ఆయన అభిమానులకి తిట్లు వస్తాయని పేర్కొన్నారు. ఇక లోకేష్ చేపట్టిన యువగళం పాదయాత్ర గురించి మాట్లాడుతూ.. అది యువగళమా? నారాగళమా? అని అననుమానం వ్యక్తం చేశారు. ఈ యాత్రతో లోకేష్ ఏం సాధిస్తాడన్నారు. కరోనా సమయంలో తండ్రికొడుకులు దాక్కున్నారని, రాష్ట్రాన్ని అప్పలుపాలు చేసిచ్చారని ఆరోపించారు. బాదుడే బాదుడు, ఇదేం ఖర్మా కార్యక్రమాలు అట్టర్ ఫ్లాప్ అయ్యాయని.. అసలే ఏం చేశాడని లోకేష్ పాదయాత్రలో తిరుగుతాడని నిలదీశారు. డిక్కి బలిసిన కోడి చికిన్ షాపు ముందు తోడ కొట్టడం.. లోకేష్ పాదయాత్ర చేయడం రెండూ ఒకటేనని కౌంటర్లు వేశారు. పెన్షన్ రద్దు అంటూ ప్రతిపక్షాలు కోడి గుడ్డు మీద ఈకలు పీకుతున్నారని.. అర్హత ఉన్న ప్రతి ఒక్కరికీ పెన్షన్ వస్తుందని రోజా వెల్లడించారు.
ఇదే సమయంలో మంత్రి మేరుగ నాగార్జున కూడా నారాలోకేష్ పాదయాత్రపై స్పందించారు. నారా లోకేష్ యాత్రను తాము పల్లెపల్లెల్లో ఎక్కడికక్కడ అడ్డుకుంటామని ఛాలెంజ్ చేశారు. దళితుల్లో పుట్టాలని ఎవరైనా అనుకుంటారా అని చంద్రబాబు వ్యాఖ్యానించారని, అందుకు ఆయన క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. నారా లోకేష్ అంబేద్కర్ విగ్రహం వద్ద ముక్కును నేలకు తాకాలని, లేదంటే పాదయాత్రను అడ్డుకుని తీరుతామని అన్నారు. విశాఖలో త్వరలోనే రాజధాని ఏర్పాటవుతుందని.. వీలైనంత త్వరగా విశాఖలో రాజధాని కార్యాకలాపాలు ప్రారంభమవుతాయని తెలిపారు. సీఎం జగన్ ఇచ్చిన మాటకు కట్టుబడి ఉన్నారన్నారు. చంద్రబాబు రాయలసీమవాసీగా కర్నూలును రాజధానిగా అంగీకరించి, ఓట్లు అడగాలన్నారు.
అక్కినేని హీరోను ఆరోజే ‘కస్టడీ’ నుంచి విడిపిస్తారట
ఈ ఏడాది అక్కినేని హీరోలకు అసలు కలిసిరాలేదనే చెప్పాలి. ముఖ్యంగా అక్కినేని నాగ చైతన్యకు అస్సలు కలిసి రాలేదు. ఎంతో గొప్పగా బాలీవుడ్ ఎంట్రీ ఇచ్చాడు. అమీర్ ఖాన్ తో లాల్ సింగ్ చద్దా సినిమాత్ బాలీవుడ్ ఎంట్రీ ఇచ్చినా చైతూ కు ఒరిగిందేమి లేదు. ఇక ఈ యేడాదిని వదిలేసి వచ్చే ఏడాదిపై ఫోకస్ చేశాడు అక్కినేని హీరో. నిజం చెప్పాలంటే అసలు సిసలైన టాస్క్ లు అన్ని చై కు వచ్చే ఏడాది ఉండనున్నాయి. మొట్ట మొదటిసారి చైతూ హర్రర్ నేపథ్యంలో దూత అనే సిరీస్ చేస్తున్నాడు అది వచ్చే ఏడాది రిలీజ్ కానుంది. ఇక ఇది కాకుండా మొదటిసారి అక్కినేని హీరో బై లింగువల్ గా కోలీవుడ్ దర్శకుడు డైరెక్షన్ లో నటిస్తున్నాడు. అది కూడా వచ్చే ఏడాది రిలీజ్ కానుంది.
వెంకట్ ప్రభు దర్శకత్వంలో నాగ చైతన్య నటిస్తున్న చిత్రం కస్టడీ. ఈ చిత్రంలో చై.. పవర్ ఫుల్ పోలీసాఫీర్ పాత్రలో కనిపిస్తున్నాడు. ఇప్పటికే ఈ సినిమా నుంచి రిలీజైన చై లుక్ భారీ అంచనాలను పెంచేసింది. ఈ చిత్రంలో చై సరసన కృతి శెట్టి నటిస్తోంది. ప్రస్తుతం శరవేగంగా షూటింగ్ జరుపుకుంటున్న ఈ సినిమా రిలీజ్ డేట్ ను మేకర్స్ అధికారికంగా ప్రకటించారు. వచ్చే ఏడాది మే 12 న ఈ సినిమా రిలీజ్ కానున్నట్లు ప్రకటించారు. మండు ఎండల్లో అక్కినేని హీరో ప్రేక్షకులను ఎలా మెప్పిస్తాడో చూడాలి.
ఆస్పత్రిలో చేరిన తల్లిని చూసేందుకు వెళ్లిన ప్రధాని మోదీ
అనారోగ్యంతో ఆస్పత్రిలో చేరిన తల్లి హీరాబెన్ ను చూసేందుకు ప్రధానమంత్రి నరేంద్రమోదీ అహ్మదాబాద్‌లోని యూఎన్ మెహతా ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ కార్డియాలజీ అండ్ రీసెర్చ్ సెంటర్‌కు చేరుకున్నారు. ఈ క్రమంలో ఆయన తన తల్లికి చికిత్స అందిస్తున్న వైద్యులతో మాట్లాడారు. ఆమె ఆరోగ్య పరిస్థితి గురించి, ఆమెకు అందుతున్న చికిత్స గురించి అడిగి తెలుసుకున్నారు. ఇటీవలే 100వ పడిలోకి అడుగుపెట్టిన హీరాబెన్ శ్వాసపరమైన ఇబ్బందులు ఎదుర్కోవడంతో కుటుంబ సభ్యులు ఆమెను ఆసుపత్రిలో చేర్పించారు. ఆమె ఆరోగ్యం నిలకడగా ఉన్నట్టు ఆసుపత్రి వర్గాలు తెలిపాయి. 80 నిమిషాలకు పైగా ఆసుపత్రిలో ఉన్న ప్రధాని రాత్రిపూట నగరంలోనే ఉండే అవకాశం ఉంది. ఈరోజు తెల్లవారుజామున అహ్మదాబాద్‌లోని ఆసుపత్రిలో చేరిన హీరాబెన్ మోడీ ఆరోగ్యం నిలకడగా ఉందని ఆసుపత్రి ఒక ప్రకటనలో తెలిపింది.
మరికొద్ది రోజుల్లో ఆమె డిశ్చార్జ్ అయ్యే అవకాశం ఉందని సంబంధిత వర్గాలు పేర్కొన్నాయి. ప్రధాని పర్యటన సందర్భంగా ముఖ్యమంత్రి భూపేంద్ర పటేల్ ఆసుపత్రిలో స్థానిక ఎమ్మెల్యేలతో కలిసి ఆసుపత్రిలో ఉన్నారు. ఈ రాత్రికి ప్రధాని అహ్మదాబాద్‌లో బస చేయనున్నారు. ఇవాళ ప్రధాని పర్యటన నేపథ్యంలో ఆస్పత్రి చుట్టూ భద్రతను కట్టుదిట్టం చేశారు. మైసూరు-నంజన్‌గూడు హైవేపై ప్రధాని సోదరుడు ప్రహ్లాద్ మోడీ ప్రమాదానికి గురయ్యారు. ప్రహ్లాద్, అతని కుటుంబ సభ్యులు ప్రయాణిస్తున్న కారు ప్రమాదానికి గురై ఆసుపత్రిలో చేరిన ఒక రోజు తర్వాత హీరాబెన్ అనారోగ్యంతో ఆస్పత్రిలో చేరారు. ప్రహ్లాద్ మోదీ తన భార్య, కొడుకు, కోడలు, మనవడితో కలిసి మెర్సిడెస్ బెంజ్ కారులో ప్రయాణిస్తుండగా అదుపుతప్పి డివైడర్‌ను ఢీకొట్టింది. ప్రమాదంలో పెద్దగా గాయాలు కాలేదు.