ప్రజాసేవ చేయాలన్న ఆలోచన ఉంది.. అది ఏ ఫ్లాట్ ఫామ్ పై అనేది త్వరలో చెప్తా
మాజీ క్రికెటర్ అంబటి రాయుడు రాజకీయ అరంగ్రేటం ఖయమైనట్లు తెలుస్తుంది…. ఈ నేపథ్యంలో సొంత జిల్లాలో అంబటి రాయుడు సందడి చేస్తున్నారు… గుంటూరు జిల్లా లో గ్రామాల్లో పర్యటిస్తున్న అంబటి రాయుడు యువత తో సెల్ఫీలు, పెద్దలలో ఫోటో లు దిగితు హల్చల్ చేస్తున్నారు… తనకు మాత్రం ప్రజాసేవ చేయాలన్న ఆలోచన ఉందనీ అది ఏ ఫ్లాట్ ఫామ్ పై అనేది త్వరలో చెప్తానని అంటున్నారు అంబటి రాయుడు.. ప్రస్తుతం క్షేత్రస్థాయిలో ప్రజా సమస్యలు, రైతు సమస్యలు తెలుసుకుంటున్నానీ త్వరలో అన్ని విషయాలు చెప్తానని అంటున్నారు అంబటి రాయుడు.
చంద్రబాబును సీఎం చేయాలన్నదే పవన్ అజెండా
చంద్రబాబును సీఎం చేయాలనేది పవన్ అజెండా అని మంత్రి కారుమురి నాగేశ్వరరావు వ్యాఖ్యానించారు. తన్నేస్తాం, లాగేస్తాం, తాట తీస్తామంటూ పవన్ అంటున్నారని.. కాపు, బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీ ఎమ్మెల్యేలను తన్నేస్తారా? అని ప్రశ్నించారు. ముద్రగడను చంద్రబాబు ప్రభుత్వం చిత్రహింసలకు గురి చేసినప్పుడు.. పవన్ కళ్యాణ్ ఎందుకు స్పందించలేదని నిలదీశారు. చంద్రబాబు అవినీతిపై పవన్ కళ్యాణ్ ఎందుకు నోరు విప్పలేదు? కాల్ మనీ సెక్స్ రాకెట్‌పై ఎందుకు మాట్లాడలేదు? 40 దేవాలయాలను కూలదోస్తే ఎందుకు ఖండించలేదు? అని ప్రశ్నల వర్షం కురిపించారు. అన్నను గెలిపించుకోలేని వాడు.. ఇప్పుడు టీడీపీని ఏం గెలిపిస్తాడని చింతమనేని చేసిన వ్యాఖ్యాల్ని పవన్ ఎందుకు ఖండించలేదని అడిగారు. కేవలం రాజకీయ లబ్ధి కోసమే, తనను చంపేస్తారని ప్రజలను పవన్ మభ్యపెడుతున్నారని పేర్కొన్నారు.
వరల్డ్ కప్ సెమీ ఫైనలిస్ట్ జట్లు ఇవే.. జోస్యం చేప్పిన మాజీ ప్లేయర్స్
వన్డే వరల్డ్‌కప్-2023లో గెలిచే జట్లలో భారత జట్టు హాట్ ఫేవరేట్ అని శ్రీలంక మాజీ స్విన్నర్ ముత్తయ్య మురళీధరన్ జోస్యం చెప్పాడు. భారత్ లో వరల్డ్ కప్ ఆడుతున్నందున టీమిండియాకు అవకాశాలున్నాయన్నాడు. అయితే ఫైనల్ మ్యాచ్ భారత్, ఇంగ్లాండ్ జట్లు తలపడే ఛాన్స్ ఉందని మురళీధరన్ ఆశాభావం వ్యక్తం చేశాడు.
ఈ వరల్డ్‌కప్ ఫైనల్‌లో ఇంగ్లాండ్, భారత్‌లు తలపడితే చూడాలనుకుంటున్నాను అని ముత్తయ్య మురళీధరన్ అన్నాడు. భారత్ జట్టు స్వదేశంలో ఆడుతుంది.. కాబట్టి టైటిల్ ఫేవరెట్లలో ఒకటిగా నిలిస్తుంది. ఈ రెండు జట్ల మధ్య మ్యాచ్ ఆసక్తికరంగా ఉండబోతుందని పేర్కొన్నాడు.
ఈటలపై నేను ఎమ్యెల్యేగా గెలిచినప్పుడే నాకు తృప్తి
హజురాబాద్‌లో రాజీకీయం వేడెక్కింది. బీఆర్‌ఎస్ ఎమ్మెల్సీ పాడి కౌశిక్ రెడ్డి బీజేపీ ఎమ్మెల్యే ఈటల రాజేందర్ మధ్య మాటల యుద్ధ కొనసాగుతోంది. అయితే.. తాజాగా కౌశిక్ రెడ్డి మీడియాతో మాట్లాడుతూ.. కౌశిక్ రెడ్డి ఉంటే మళ్ళీ నేను హుజూరాబాద్ లో గెలవను అని ఈటల అనుకుంటున్నాడని, ఈటలను ఓడగొట్టడానికే రాజకీయాల్లోకి వచ్చానన్నారు. ఈటలపై నేను ఎమ్యెల్యే గా గెలిచినప్పుడే నాకు తృప్తి అని ఆయన కీలక వ్యాఖ్యలు చేశారు. ఆవిర్భావ వేడుకల్లో మేము విద్యా దినోత్సవం రోజు ర్యాలీ తీస్తుంటే ట్రాక్టర్ కింద పడి స్టూడెంట్ చనిపోయాడని ఈటల ఆరోపిస్తున్నారని, అసలు బాధిత అబ్బాయికి స్కూల్ లో అడ్మిషన్ లేదు.. ర్యాలీలో పాల్గొనలేదన్నారు. పక్క నుంచి నడుచుకుంటు వెళ్తుంటే కుక్కలు వెంటపడ్డాయి.. ప్రమాదవశాత్తు జరిగిందని ఆయన అన్నారు. ఈటల రాజేంద్ర గుర్తుంచుకో.. వంద కభేళాలను తిన్న రాబందు చిన్న గాలివానకు కొట్టుకుపోయినట్టు.. నీ దృష్టిలో నేను చిన్న గాలివాననే కావచ్చు.! కానీ నిన్ను రాజకీయంగా కూల్చేది నేనే అంటూ ఆయన సవాల్ విసిరారు.
రీ రిలీజ్ లో సరికొత్త ట్రెండ్ సెట్ చేస్తుంది గా..
మన టాలీవుడ్ లో రీ రిలీజ్ ట్రెండ్ ఏ స్థాయిలో కొనసాగుతుందో ప్రత్యేకించి చెప్పనవసరం లేదు.స్టార్ హీరోల అభిమానులు తమ అభిమాన హీరో కొత్త సినిమా విడుదలకు చేసేంత సందడి రీ రిలీజ్ సినిమాకు చేస్తున్నారు. ప్రస్తుతం ఇప్పటి వరకు రీ రిలీజ్ అయిన స్టార్ హీరోల సినిమాలలో పవన్ కళ్యాణ్ ‘ఖుషి’ చిత్రం అత్యధిక వసూళ్లను సాధించింది.ఆ తర్వాత జూనియర్ ఎన్టీఆర్ ‘సింహాద్రి’ చిత్రం అత్యధిక వసూళ్లను సాధించి టాప్ 2 లో నిలిచింది..స్టార్ హీరోల సినిమాలను రీ రిలీజ్ చేసారు కనుక ఈ స్థాయిలో కలెక్షన్స్ సాధించాయి..కానీ ఎలాంటి స్టార్ కాస్టింగ్ లేని సినిమా ‘ఈ నగరానికి ఏమైంది’. ఈ చిత్రాన్ని గ్రాండ్ గా మరోసారి రీ రిలీజ్ చెయ్యబోతున్నారనీ సమాచారం.ఈ సినిమాకి సంబంధించిన అడ్వాన్స్ బుకింగ్స్ రీసెంట్ గానే ప్రారంభినట్లు తెలుస్తుంది.
బీజేపీ అధికారంలో ఉండేది మరో 6 నెలలే.. ఫిబ్రవరి-మార్చిలో ఎన్నికలు..
వచ్చే ఏడాది ఫిబ్రవరి-మార్చిలో ఎన్నికలు జరుగుతాయని.. బీజేపీ ప్రభుత్వం మరో 6 నెలలు మాత్రమే అధికారంలో ఉంటుందని బెంగాల్ సీఎం మమతా బెనర్జీ అన్నారు. జూలై 8న పశ్చిమ బెంగాల్ లో జరగే పంచాయతీ ఎన్నికల ప్రచారంలో ఆమె పాల్గొన్నారు. జల్‌పైగురి జిల్లాలో జరిగిన ర్యాలీని ఉద్దేశించి బెనర్జీ మాట్లాడుతూ.. రేపు బీజేపీ అధికారంలో ఉండకపోవచ్చని.. కాబట్టి బీఎస్ఎఫ్ బలాలు నిష్ఫక్షపాతంగా పనిచేయాలని ఆమె అన్నారు. ఇప్పటికే బీజేపీ ఓటమిని పసిగట్టి వివిధ గ్రాపులు, వర్గాలతో లాబీయింగ్ చేయడానికి ప్రయత్నిస్తోందని ఆమె అన్నారు.
మైనారిటీలను, దళితులను కొట్టిన ఆరోపణలు ఎదుర్కొంటున్నవారే ప్రస్తుతం వారితేనే ఫోటోలు దిగుతున్నారని విమర్శించారు. ముస్లిం కమ్యూనిటీ సభ్యులతో ఎంతో శ్రద్ధ చూపుతున్నామని చెప్పడానికి వారితో ఫోటోలు దిగుతున్నారని.. ఎక్కువ మంది వ్యాపారులు, పేదలు, అణగారిన వర్గాలను గురించి పట్టించుకోని ముస్లింలను బీజేపీ ఉపయోగించుకుంటోందని ఆగ్రహం వ్యక్తం చేశారు. దీదీ ఇక్కడ ఉన్నంత వరకు మైనారిటీలు ఇక్కడ సురక్షితంగా ఉంటారని ఆమె అన్నారు.
ఎలక్షన్ సీజన్ వస్తుంది కాబట్టే బీఆర్‌ఎస్ టీజర్ రిలీజ్ చేస్తుంది
ఖమ్మం జిల్లా కల్లూరు మండలం స్వగ్రామం నారాయణపురం గ్రామంలో పొంగులేటి సుధాకర్ రెడ్డి మీడియా సమావేశం నిర్వహించారు. మేరాబూత్ సబ్ సే మజ్ బూత్ కార్యక్రమంలో భాగంగా స్వగ్రామంలో ఓటర్లను కలిసిన పొంగులేటి సుధాకర్ రెడ్డి మాట్లాడుతూ.. పేదల సంక్షేమ పేరుతో 9 సంవత్సరాల సుపరిపాలన అందించింది బీజేపీ అని ఆయన అన్నారు. భారతతీయ జనతా పార్టీ దేశానికి సేవా చేయడమే లక్ష్యమన్నారు. దేశం, పార్టీనే భారతీయ జనతా పార్టీ నినాదమన్నారు. కొంత మందిలా కుటుంబ పార్టీ కాదు కుటుంబ పాలన కాదని, గతంలో తమిళనాడు మోడీ వెళ్తే గోబ్యాక్ అన్నారు ఇప్పుడు వాంగా మోడీ వాంగా మోడీ అంటున్నారన్నారు. అంతేకాకుండా.. ‘కేంద్ర ప్రభుత్వం అనేక సంక్షేమ పధకాలు చెపట్టారు కాబట్టే ఇంతలా అభిమానిస్తున్నారు. ఎలక్షన్ సీజన్ వస్తుంది కాబట్టే బీఆర్‌ఎస్ టీజర్ రిలీజ్ చేస్తుంది.
I AM SORRY సంజూ అంటూ ఏకంగా హోర్డింగ్ పెట్టిన ప్రియుడు
ప్రతి ఒక్క ప్రియుడు లేదా ప్రియురాలు తమ లవర్ కు ఎప్పుడో ఒకసారి క్షమాపణ తప్పకుండా చెప్పాల్సిన సమయం వస్తుంది. అలా వచ్చినప్పుడు వారు తమ మనస్సులోని పదాలను లెటర్, మెస్సేజ్ ల రూపంలో చెబుతుంటారు. కానీ ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని నోయిడాలో ఓ ప్రియుడు మాత్రం తన ప్రేయసికి వెరైటీగా సారీ చెప్పాడు. అతను క్షమాపణలు చెప్పిన విధానం ఇప్పుడు నెట్టింట తెగ వైరల్ అవుతుంది.
సుష్ అనే వ్యక్తి తన ప్రియురాలైన సంజూకి క్షమాపణ చెప్పడానికి ఏకంగా ఓ హోర్డింగ్‌ను ఏర్పాటు చేశాడు. ఇప్పుడు ఈ హోర్డింగ్ నెట్టింట వైరల్ అవుతుంది. నోయిడాలో వెలిసిన హోర్డింగ్ ను ఓ ట్విట్టర్ వినియోగదారుడు ఫోటో తీసి అతని అకౌంట్ లో పోస్ట్ చేయడంతో క్షణాల్లో ఈ ఫోటో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.
పెళ్లి వేడుకలో మైక్ లో పాట పాడుతూ మహిళ మృతి.. ఏమైందంటే?
పెళ్లి వేడుకల్లో విషాదం నెలకొంది. బీహార్‌లోని సమస్తిపూర్‌లో ఓ వివాహ కార్యక్రమంలో పాట పాడుతూ ఓ మహిళ విద్యుదాఘాతానికి గురై మృతి చెందింది. మహిళ పాడుతున్న మైక్‌లో కరెంట్ ప్రవాహం పెరగడంతో ఆమె మరణానికి దారితీసింది. రోసాడ పోలీస్ స్టేషన్ పరిధిలోని మబ్బి గ్రామంలో వివాహానికి హాజరయ్యేందుకు పలువురు మహిళలు తరలివచ్చారు. వేడుకల మధ్య మీనా దేవి మైక్రోఫోన్‌లో పాడటం ప్రారంభించింది. అకస్మాత్తుగా, మైక్రోఫోన్ పనిచేయలేదు. దాని ద్వారా కరెంట్ పెరిగింది. ఈ నేపథ్యంలో ఆమె విద్యుదాఘాతానికి గురైంది. మీనా దేవి మైక్ పట్టుకుని అలాగే కుప్పకూలింది. ఆమె అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. దీంతో పెళ్లింట్లో విషాద ఛాయలు అలుముకున్నాయి.
దళితుల్ని అన్ని విధాలుగా ఆదుకుంది వైసీపీ ప్రభుత్వమే
దళితులపై అత్యాచారాలు, హత్యలు అంటూ ఓ వార్తా పత్రిక ప్రచురించిన కథనంపై హోంమంత్రి తానేటి వనిత స్పందించారు. దళితులకు ఏ కష్టం వచ్చినా, వెంటనే ఆదుకుంది తమ వైసీపీ ప్రభుత్వమేనని అన్నారు. దళితులకు అత్యధిక భద్రత కల్పిస్తోంది కూడా సీఎం వైఎస్ జగన్‌మోహన్ రెడ్డి మాత్రమేనని చెప్పారు. దళితులపై దాడులు జరిగిన ఘటనలకు సంబంధించి తాము వెనువెంటనే చర్యలు తీసుకున్నామని, బాధితులకు న్యాయం జరిగేలా చేశామని గుర్తు చేశారు. ఇటువంటి వాటిని పచ్చ మీడియా ఎందుకు ప్రచురించడం లేదని మండిపడ్డారు. చంద్రబాబు హయాంలో దళితులపై ఎన్నో దారుణాలు జరిగాయని, మరి ఆ దాడుల గురించి పచ్చ మీడియా ఎందుకు ప్రశ్నించలేదని నిలదీశారు. టీడీపీ హయాంలో దళితులపై దాడులకు సంబంధించి.. ఆంధ్ర రాష్ట్రం దేశంలోనే 4వ స్థానంలో నిలిచిందని పేర్కొన్నారు.
175కి 175 స్థానాలు గెలిచే దిశగా పని చేయాలి.. టెలి కాన్ఫరెన్స్‌లో సజ్జల
ర్గాల పార్టీ పరిశీలకులతో టెలి కాన్ఫరెన్స్‌లో మాట్లాడారు. ఈ సందర్భంగా ఆయన కొన్ని సూచనలు సూచించారు. ఎన్నికల ఏడాదిలో పార్టీ పరిశీలకులు కీలకంగా వ్యవహరించాలని.. వారంలో కనీసం రెండు రోజులు నియోజకవర్గాల్లో ఉండి పని చేయాలని అన్నారు. పార్టీ పరిశీలకులపై సీఎం వైఎస్ జగన్ ఎంతో నమ్మకం, విశ్వాసంతో ఉన్నారన్నారు. నియోజకవర్గ సమన్వయకర్తలు, ఎమ్మెల్యేలకు సంధానకర్తలుగా పని చేయాలని చెప్పారు. జగనన్న సురక్ష, ఓటర్ల జాబితా సవరణ, దొంగ ఓట్లు తొలగింపు, అర్హులైన వారిని ఓటర్లుగా చేర్పించే అంశాలపై ప్రత్యేక దృష్టి సారించాలని పేర్కొన్నారు. నియోజకవర్గాలలో నెలకొనే సమస్యలు, పార్టీ అంతర్గత వ్యవహారాల విషయాలలో అధిష్టానం తరపున సమన్వయం చేయాలన్నారు. 175 నియోజకర్గాలకు 175 స్థానాలు గెలిచే దిశగా పని చేయాలన్నారు. దాదాపు 68 లక్షల దొంగ ఓట్లు ఉన్నాయని తేలిందని.. వాటిని వెంటనే గుర్తించి తొలగించాలని దిశానిర్దేశం చేశారు.