ఓట్లకు ఇంకా వారం టైం ఉంది.. కానీ ముందే ఓటేసిన తాత
కర్ణాటకలో అసెంబ్లీ ఎన్నికలు ఈ నెల 10న జరగనున్నాయి. అన్ని రాజకీయపార్టీలు ఎన్నికల ప్రచారంలో జోరుమీద ఉన్నాయి. ఎలగైనా అధికారం చేజిక్కించుకోవాలని రాజకీయ పార్టీలు వ్యూహాలు రచిస్తున్నాయి. ప్రజలకు వరాల జల్లులు కురిపిస్తున్నాయి. ఎన్నికల సందర్భంలో కర్ణాటకలో అనేక వింతలు చోటుచేసుకుంటున్నాయి. ఎన్నికలకు ఇంకా వారం రోజులు ఉండగానే ఓ శతాధిక వృద్ధుడు ఓటేశాడు. ఓవైపు ఎన్నికల ప్రచారం జోరుగా జరుగుతుండగానే తాత ఓటెయ్యడం అక్కడ చర్చనీయాంశమైంది. అతడికి ఆ అవకాశం ఎన్నికల సంఘం కల్పించింది. కరోనా మహమ్మారి దెబ్బతో ప్రపంచం మొత్తం తలకిందులైంది. అన్ని రంగాల్లోనూ మార్పులొచ్చాయి. ఈ క్రమంలోనే ఎన్నికల నిర్వహణ విధానాల్లోనూ మార్పులను తీసుకొచ్చింది ఎన్నికల కమిషన్. ఉద్యోగులకు వర్క్ ఫ్రమ్ హోం మాదిరిగా కరోనాతో బాధపడుతున్నవారితో పాటు వృద్దులకు ‘వోట్ ఫ్రం హోం’ సదుపాయం కల్పించింది. అంటే కురువృద్ధులై ఉండి వారి వయసు 80 ఏళ్లు పైబడి.. పోలింగ్ బూత్ వరకు నడిచే పరిస్థితి లేని వారు ఇంటివద్దే ఓటుహక్కును వినియోగించుకునే అవకాశం కల్పించింది.
గ్యాంగ్ స్టర్లకు గడ్డురోజులు.. మరో ఫేమస్ డాన్ ఎన్ కౌంటర్
ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో మరో సంచలన ఘటన చోటు చేసుకుంది. ఇటీవల ఆ రాష్ట్ర మాజీ ఎంపీ, మాఫియా డాన్ అతీక్ సోదరులు ఎన్‌కౌంటర్‌లో ప్రాణాలు కోల్పోయిన విషయం తెలిసిందే. తాజాగా మరో గరుడుగట్టిన మరో గ్యాంగ్‌స్టర్ మీద ఎన్కౌంటర్ జరిగింది. గ్యాంగ్‌స్టర్ అనిల్ దుజానాను ఆ రాష్ట్ర టాస్క్‌ఫోర్స్ పోలీసులు గురువారం మధ్యాహ్నం మట్టుబెట్టారు. గౌతమ్ బుద్ధ నగర్ జిల్లాలోని బదలాపూర్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఉన్న దుజానా గ్రామానికి చెందిన వ్యక్తి అనిల్ దుజానా. నిజానికి అతడి అసలు పేరు అనిల్ నగర్. పశ్చిమ యూపీకి చెందిన అనిల్ దుజానాపై హత్యలు, దోపిడీలు, భూదందా, కిడ్నాప్ వంటి అనేక తీవ్ర నేరాలు లాంటి అనేకం ఉన్నాయి.
కర్ణాటకలో బ్రహ్మానందం ప్రచారం.. ఏ పార్టీ తరుపున అంటే..?
కర్ణాటక ఎన్నికల రణరంగం మొదలయ్యింది. ఎవరి పార్టీలు వారు తమ ప్రత్యర్థులపై గెలవడానికి ఎత్తులు.. పై ఎత్తులు వేస్తున్నారు. ఇక నాయకులుగా పోటీల్లో ఉన్నవారు క్యాంపైన్ లో చలాకీగా తిరుగుతున్నారు.. ఇంకొంతమంది తాము ప్రజలకు ఏం చేయబోతున్నాం అనేది చెప్తూ ఓట్లు అడుగుతున్నారు. ఇక ఎన్నికల క్యాంపైన్ లో సినీ తారలు మెరవడం సాధారణమే.. కన్నడలో ఇప్పటికే సినీ తారలు.. తాము సపోర్ట్ చేస్తున్న పార్టీలకు ప్రత్యేక్షంగానో, పరోక్షంగానో సహాయపడుతున్నారు. తాజాగా టాలీవుడ్ స్టార్ కమెడియన్, హాస్య బ్రహ్మ బ్రహ్మానందం కన్నడ రాజకీయాల్లోకి దిగారు. బీజేపీ కోసం ఆయన ఎన్నికల ప్రచారంలో పాల్గున్నారు. చిక్ బళ్లాపూర్ బీజేపి అభ్యర్థి సుధాకర్ కి మద్దతు పలుకుతూ ఆయన నేడు చిక్ బళ్లాపూర్ ప్రజలతో సందడి చేశారు. వైద్యశాఖా మంత్రి Dr K సుధాకర్ ను గెలిపించాలని ఆయన రోడ్డు మీద తిరుగుతూ ప్రచారం చేశారు.చిక్ బళ్లాపూర్ నియోజక వర్గంలో చాలామంది తెలుగు మాట్లాడేవారే ఉండడంతో బ్రహ్మీ సైతం తెలుగులో మాట్లాడి మెప్పించారు.
ఓఆర్‌ఆర్ తెలంగాణ ప్రజల ఆస్తి… ప్రైవేటుకు ఎందకు అప్పగిస్తున్నారు
ఓఆర్ఆర్ టెండర్లను వెంటనే రద్దు చేయాలని టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి డిమాండ్ చేశారు. ఇవాళ ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ఓఆర్ఆర్ వివాదంపై సంబంధిత మంత్రి సమాధానం ఇవ్వలేదని విమర్శించారు. సమాధానం ఇవ్వలేక మంత్రి కేటీఆర్ మొహం చాటేశారని విమర్శించారు. హెచ్‌జీసీఎల్ నిర్ణయాలకు వ్యతిరేకంగా నిర్ణయం తీసుకున్నారని, ఏ టెండర్ అయినా 15, 20 ఏండ్లకు మించి ఇవ్వలేదని, కానీ… ఓఆర్‌ఆర్‌ని ముప్పై ఏండ్లు ఇచ్చారన్నారు. కేంద్ర నిబంధనలు ఉల్లంఘించారని, ప్రీ బీడ్ మీటింగ్ లో…నేషనల్ హైవే అథారిటీ… అభ్యన్తరం చెప్పిందన్నారు. 15 నుండి 20 ఏండ్ల వరకే టెండర్ ఇవ్వండి అన్నారని, దాన్ని కూడా తుంగలో తొక్కారన్నారు. ఏ టెండర్ వేసినా మినిమం ధర నిర్ణయిస్తారని, ప్రభుత్వం పనులు ఇస్తే తక్కువ ధర కోడ్ చేస్తుందన్నారు. ప్రభుత్త్వం ఆస్తి అమ్మితే… ఎక్కువ ధర నిర్ణయం చేస్తుందని, కానీ ఓఆర్‌ఆర్‌కి ఏం ధర నిర్ణయించకుండా ఎలా టెండర్ వేస్తారని ఆయన ప్రశ్నించారు. 30 ఏండ్లకు 22 వేల కోట్లు ఆదాయం వస్తుందని, కానీ 7500 కోట్లకు ఇచ్చాం అని అరవింద్ చెప్తున్నారన్నారు.
రెజ్లర్లకు సుప్రీంకోర్టు షాక్ .. విచారణ ప్రొసీడింగ్స్ కి స్వస్తి
లైంగిక వేధింపులకు పాల్పడిన భారత రెజ్లింగ్ ఫెడరేషన్ చైర్మన్ బ్రిజ్ భూషణ్ పై చర్యలు తీసుకోవాలని టాప్ రెజ్లర్లు ఆందోళన చేస్తున్న విషయం తెలిసిందే. ఢిల్లీ లోని జంతర్ మంతర్ వద్ద గత కొన్ని రోజులుగా రెజ్లర్ల ధర్నా కొనసాగుతోంది. ఈ క్రమంలోనే ధర్నా చేస్తున్న రెజ్లర్లకు సుప్రీంకోర్టు షాక్ ఇచ్చింది. రెజ్లింగ్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా చీఫ్ బ్రిజ్ భూషణ్ శరణ్ సింగ్ కు వ్యతిరేకంగా వారు దాఖలు చేసిన పిటిషన్ కు సంబంధించిన విచారణ ప్రొసీడింగ్స్ కి కోర్టు స్వస్తి చెప్పింది. వీటిని నిలిపివేస్తున్నట్టు ప్రకటించింది. మీరు దిగువ కోర్టుకు వెళ్లాలని రెజ్లర్లకు సూచించింది.
కబాబ్‌లు బాగో లేవని కుక్ ను కాల్చి చంపారు
ఉత్తర ప్రదేశ్ రాష్ట్రంలో దారుణం చోటుచేసుకుంది. కబాబ్ లు రుచిగా లేవన్న కారణంతో వాటిని చేసిన కుక్ ను కొందరు కాల్చిచంపారు. ఈ ఘటన ఆ రాష్ట్రంలోని బరేలీలో జరిగింది. బరేలీలోని ప్రేమ్ నగర్ ప్రాంతంలోని ప్రియదర్శిని నగర్‌లో ఉన్న ఓ పాత కబాబ్ దుకాణంలో బుధవారం రాత్రి ఈ ఘటన జరిగినట్లు సిటీ అదనపు పోలీసు సూపరింటెండెంట్ రాహుల్ భాటి తెలిపారు. పూర్తి వివరాల్లోకి వెళితే.. ఇద్దరు వ్యక్తులు బుధవారం రాత్రి దుకాణానికి విలాసవంతమైన కారులో వచ్చారు. అప్పటికే వారు ఫుల్ గా తాగి మత్తులో ఉన్నారు. కబాబులు రుచిగా లేవని.. తమకు నచ్చడం లేదని దుకాణ యజమాని అంకుర్ సబర్వాల్‌కు ఫిర్యాదు చేశారు.
‘నా రోజా.. నువ్వే’ అంటూ సామ్ వెనుక పడుతున్న విజయ్
లైగర్ తరువాత విజయ్ దేవరకొండ నటిస్తున్న చిత్రం ఖుషీ. శివ నిర్వాణ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రంలో విజయ్ సరసన సమంత నటిస్తోంది. ఇక ఈ సినిమానుమైత్రీ మూవీ మేకర్స్ నిర్మిస్తున్నారు. ఇప్పటికే ఈ సినిమా నుంచి రిలీజైన పోస్టర్స్, స్పెషల్ గ్లింప్స్ ఆకట్టుకున్నాయి. ఇక తాజాగా ఈ సినిమా నుంచి మొదటి సాంగ్ ను రిలీజ్ చేయడానికి మేకర్స్ ముహూర్తం ఖరారు చేశారు. నా రోజా.. నువ్వే అంటూ సాగె సాంగ్ ను మే 9 న రిలీజ్ చేస్తున్నట్లు మేకర్స్ ప్రకటించారు. అంతేకాకుండా దాంతో పాటు ఒక పోస్టర్ ను కూడా రిలీజ్ చేశారు. పోస్టర్ లో సమంతను హాగ్ చేసుకొని విజయ్ నవ్వులు చిందిస్తూ కనిపించాడు. ప్రస్తుతం ఈ పోస్టర్ నెట్టింట వైరల్ గా మారింది.
కనిపిస్తే కాల్చేయండి.. సైన్యాన్ని రంగంలోకి దింపిన ప్రభుత్వం
మణిపూర్‌లో ఆందోళన సందర్భంగా చెలరేగిన హింసాకాండ తర్వాత, పరిస్థితిని అదుపులోకి తెచ్చేందుకు రాష్ట్ర ప్రభుత్వం కఠినమైన చర్యలు తీసుకుంటోంది. హింసాత్మక ప్రాంతాలలో హింసకు పాల్పడేవారిని కనిపించగానే కాల్చివేయాలని ఆదేశాలు జారీ చేసింది. హింసకు పాల్పడే వ్యక్తులను కనపడగానే కాల్చిచంపాలన్న ఆదేశాన్ని గవర్నర్ ఆమోదించారు. హింసాత్మక ప్రాంతాల్లో ఆర్మీ, అస్సాం రైఫిల్స్ సిబ్బందిని మోహరించారు. హింసాత్మక ప్రాంతాల నుంచి భద్రతా బలగాలు ఇప్పటివరకు 4,000 మందిని సురక్షిత ప్రాంతాలకు తరలించాయి. ఎనిమిది జిల్లాల్లో కర్ఫ్యూ విధించగా, ఐదు రోజుల పాటు ఇంటర్నెట్ సేవలకు అంతరాయం ఏర్పడింది. ప్రజలందరూ శాంతిభద్రతలను కాపాడాలని ముఖ్యమంత్రి ఎన్ బీరెన్ సింగ్ విజ్ఞప్తి చేశారు. ఈ సమయంలో శాంతి, సామరస్యాలను కాపాడేందుకు ప్రభుత్వానికి సహకరించాలని రాష్ట్రంలోని ప్రతి ఒక్కరికీ నా వినయపూర్వకమైన విజ్ఞప్తి’ అని ట్వీట్ చేశారు.
వందే భారత్ ఓపెనింగ్‌కు ప్రధాని రాష్ట్రపతిని పిలిచారా ?
వందే భారత్ ఓపెనింగ్ కు ప్రధాని రాష్ట్రపతిని పిలిచారా ? ఎందుకు రాష్ట్రపతిని పిలవలేదని నేను అడుగను… అది నా రాజకీయ విజ్ఞత అంటూ వ్యా్‌ఖ్యానించారు మంత్రి హరీష్ రావు. ఇవాళ ఆయన మీడియాతో మాట్లాడుతూ.. గవర్నర్ కు కొన్ని అవకాశాలు రాజ్యాంగంలో ఇచ్చారని, 26 జనవరి గవర్నర్ జెండా ఎగుర వేయాలని ఉందన్నారు. గవర్నర్ ను పిలవాలని రాజ్యాంగంలో ఉందా ? అని ఆయన ప్రశ్నించారు. ప్రధాని నన్ను పిలవలేదని, రాష్ట్రపతి అంటున్నారా ? మహిళగా, గవర్నర్‌గా మేము గౌరవిస్తామన్నారు మంత్రి హరీష్ రావు. తెలంగాణ ప్రయోజనాలను గవర్నర్ దెబ్బతీస్తున్నారని, రాష్ట్ర సర్కార్ గవర్నర్ కు బిల్లుకు పంపితే ఏమి చేయాలి? రాజ్యాంగ పరిధిలో ఉందో లేదో చూడాలన్నారు. పొదెం వీరయ్య లెటర్ ఇచ్చారని గవర్నర్ బిల్లును వాపస్ పంపించారని, క్యాబినెట్, రాష్ట్ర ప్రభుత్వం ప్రమానీకమా ? అన్నారు. వైద్య శాఖలో ప్రొఫెసర్ ల వయో పరిమితిని పెంచుతూ రాష్ట్ర సర్కార్ నిర్ణయం తీసుకుందని, బిల్లును పంపితే గవర్నర్ నిర్ణయం తీసుకోలేదన్నారు.
బైక్ పై ముద్దులతో రెచ్చిపోయిన అమ్మాయిలు.. అబ్బాయిలకు మించి రొమాన్స్
ప్రస్తుత సమాజంలో మహిళలు పురుషులతో సమానం అన్ని రంగాల్లో దూసుకు పోతున్నారు. బైక్ రైడింగ్ అంటే ఇదివరకు మగాళ్లు మాత్రమే చేస్తుండేవారు. కానీ ఇప్పుడు ఆడవాళ్లలో చైతన్యం వచ్చింది. వారు కూడా బైకులపై రయ్యుమంటూ దూసుకెళ్తున్నారు. వారు బైక్ రైడింగ్ చేస్తూ, వాటిపై విన్యాసాలు కూడా చేసేస్తున్నారు. ప్రస్తుతం అలాంటి వీడియోనే సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఆ వీడియోలో ఇద్దరు అమ్మాయిలు బైక్‌లపై విన్యాసాలు చేస్తున్నారు. ఆ అమ్మాయిల వీడియో అందరి దృష్టిని ఆకర్షిస్తోంది. ఆసక్తికరమైన విషయం ఏంటంటే స్టంట్స్ చేసేటప్పుడు అమ్మాయిలు అస్సలు భయపడకుండా రొమాంటిక్ ప్రొజెక్షన్స్‌లో స్టంట్స్ చేశారు.