ఛత్తీస్‌గఢ్-మిజోరంలో నేడు ఓటింగ్.. గెలుపెవరిదో?
ప్రస్తుతం జరుగనున్న 5 రాష్ట్రాల ఎన్నికలను 2024 సెమీఫైనల్‌గా పేర్కొంటున్నారు. ఇది నేటి నుంచి ప్రారంభం కానుంది. మిజోరం, ఛత్తీస్‌గఢ్‌లలో అసెంబ్లీ ఎన్నికలకు ఈరోజు ఓటింగ్ జరగనుంది. మిజోరంలోని మొత్తం 40 స్థానాలు, ఛత్తీస్‌గఢ్‌లోని 20 స్థానాలకు నేడు పోలింగ్ జరగనుంది. ఛత్తీస్‌గఢ్‌లో తొలి దశ అసెంబ్లీ ఎన్నికల్లో 20 అసెంబ్లీ నియోజకవర్గాల్లో 16 అసెంబ్లీ స్థానాల్లో మహిళలే నిర్ణయాత్మక పాత్ర పోషిస్తున్నారు. ఈ స్థానాల్లో పురుషుల కంటే మహిళా ఓటర్లే ఎక్కువగా ఉన్నారు. ఈరోజు మొదటి దశలో ఓటింగ్ జరగనున్న 20 స్థానాల్లో 2018 ఛత్తీస్‌గఢ్ అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ 17 సీట్లు గెలుచుకోగా, ఈ 20 సీట్లలో బీజేపీ కేవలం 2 సీట్లు, జనతా పార్టీ ఒక సీటు మాత్రమే గెలుచుకున్నాయి.
నేడు తెలంగాణలో ప్రధాని మోడీ పర్యటన
తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో కమలం పార్టీ దూకుడు పెంచింది. ఇప్పటికే బీజేపీ తరపున స్టార్ క్యాంపెయినర్ లను రంగంలోకి దించి జోరుగా ఎన్నికల ప్రచారాన్ని స్టార్ట్ చేసేందుకు రెడీ అయింది. నేడు రాష్ట్రానికి ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ రానున్నారు. ఎన్నికల షెడ్యూల్ వచ్చాక మొదటిసారి మోడీ తెలంగాణకు వస్తున్నారు. రాష్ట్రంలో బీజేపీ అధికారంలోకి వస్తే బీసీని ముఖ్యమంత్రి చేస్తామని కేంద్ర హోంమంత్రి అమిత్ షా ప్రకటించారు.
పసిడి ప్రియులకు గుడ్ న్యూస్.. తగ్గిన బంగారం ధరలు!
గత కొన్నిరోజులుగా వరుసగా పెరుగుతూ వస్తోన్న బంగారం ధరలకు కాస్త బ్రేక్ పడింది. గత మూడు రోజులో రెండోసారి పసిడి ధరలు తగ్గాయి. బులియన్ మార్కెట్‌లో మంగళవారం (నవంబర్ 7) 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 56,350 ఉండగా.. 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 61,470గా ఉంది. నిన్నటితో పోల్చుకుంటే 22 క్యారెట్ల బంగారంపై రూ. 150.. 24 క్యారెట్ల బంగారంపై రూ. 170 తగ్గింది. ఈ పసిడి ధరలు దేశీయ మార్కెట్లో ఈరోజు ఉదయం నమోదైనవి. గుడ్‌రిటర్న్స్ వెబ్‌సైట్ ప్రకారం దేశంలోని ప్రధాన నగరాల్లో నేటి బంగారం ధరలు ఇలా ఉన్నాయి.
ఢిల్లీలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 56,500లుగా ఉండగా.. 24 క్యారెట్ల బంగారం ధర రూ. 61,620గా ఉంది. చెన్నైలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 57,000లు ఉండగా.. 24 క్యారెట్ల పసిడి ధర రూ. 62,180గా నమోదైంది. ముంబై, బెంగళూరు, కేరళ, హైదరాబాద్, వరంగల్, విజయవాడ, విశాఖపట్నంలో 22 క్యారెట్ల 10 గ్రాముల పసిడి ధర రూ. 56,350 ఉండగా.. 24 క్యారెట్ల ధర రూ. 61,470గా కొనసాగుతోంది.
మంగళయాన్-2కు సన్నాహాలు.. అంగారకుడి రహస్యాలను తేల్చనున్న ఇస్రో
చంద్రుడు, సూర్యుడి తర్వాత ఇస్రో అంగారకుడి రహస్యాలను అన్వేషించనుంది. ఇందుకోసం ఇస్రో సన్నాహాలు ప్రారంభించింది. ఇండియన్ స్పేస్ రీసెర్చ్ ఆర్గనైజేషన్ అంటే ఇస్రో 2024లో ఈ మిషన్‌ను ప్రయోగించనుంది. ఇది ఇప్పటివరకు మార్స్ రహస్యాలను ఛేదించడంలో NASA కూడా విజయవంతం అయింది. ఇస్రో శాస్త్రవేత్తల దృష్టి భారతదేశం మొట్టమొదటి మానవ సహిత మిషన్ అయిన గగన్‌యాన్‌పై ఉంది.
చంద్రునిపై చంద్రయాన్-3ని సాఫ్ట్ ల్యాండింగ్ చేయడం ద్వారా భారతదేశం చరిత్ర సృష్టించింది. భారతదేశ అంతరిక్ష సంస్థ మరో విజయాన్ని సాధించింది. సూర్యుని రహస్యాలను బహిర్గతం చేయడానికి ఇటీవల ఆదిత్య L1ని ప్రారంభించింది. ఇది ప్రస్తుతం సూర్యుని L1 పాయింట్‌కి ప్రయాణంలో ఉంది. గగన్‌యాన్ మిషన్ టెస్టింగ్ కూడా దాదాపు పూర్తయింది. ఇలాంటి పరిస్థితుల్లో ఇస్రో శాస్త్రవేత్తలు ఇప్పుడు మంగళయాన్-2పై దృష్టి సారించారు. ఈ మిషన్ 2024 చివరి నాటికి ప్రారంభించబడుతుందని నమ్ముతారు. తాజాగా ఈ విషయాన్ని ఇస్రో అధికారులు ధృవీకరించారు. ఇది మార్స్ ఆర్బిటర్ మిషన్-2 దీనికి ముందు 2014లో భారతదేశం ప్రయోగించిన మంగళయాన్-1 విజయవంతమైంది.
నేడు వైఎస్సార్ రైతు భరోసా నిధులు విడుదల చేయనున్న సీఎం జగన్
వరుసగా ఐదో సంవత్సరం రెండో విడత వైఎస్సార్ రైతు భరోసా- పీఎం కిసాన్ ఆర్ధిక సహాయం ఇవాళ అందించనున్నారు. వరుసగా ఐదో ఏడాది రెండో విడతగా ఒక్కొక్కరికి 4,000 వేల రూపాయల చొప్పున ఆర్ధిక సహాయం అందించనున్నారు. 53.53 లక్షల మంది రైతులకు లబ్ది చేకూరనుంది. 2,204.77 కోట్ల రూపాయలను రైతుల ఖాతాల్లో సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి జమ చేయనున్నారు. శ్రీ సత్యసాయి జిల్లా పుట్టపర్తి నుంచి వర్చువల్ గా రైతుల ఖాతాల్లో సీఎం జగన్ జమ చేయనున్నారు.
అఫ్గానిస్థాన్‌తో మ్యాచ్.. ఆస్ట్రేలియాకు సెమీస్ బెర్తు దక్కుతుందా?! అఫ్గాన్‌కే అవకాశాలు ఎక్కువ
ఐసీసీ ప్రపంచకప్ 2023లో భాగంగా నేడు కీలక మ్యాచ్ జరగనుంది. సెమీ ఫైనల్ బెర్త్ దక్కించుకొవాలనుకుంటున్న ఆస్ట్రేలియా.. మెగా టోర్నీలో సంచలన విజయాలు సాధిస్తున్న అఫ్గానిస్థాన్‌తో తలపడనుంది. ముంబైలోని వాంఖడే స్టేడియంలో మధ్యాహ్నం 2 గంటలకు ఇరు జట్ల మధ్య మ్యాచ్ ఆరంభం కానుంది. ఆస్ట్రేలియాకే కాదు ఈ మ్యాచ్ అఫ్గానిస్థాన్‌కు చాలా కీలకం. ఆస్ట్రేలియాపై గెలిస్తే.. 10 పాయింట్స్ ఖాతాలో వేసుకుని అఫ్గాన్ సెమీస్ అవకాశాలు మరింత మెరుగవుతాయి. దాంతో మ్యాచ్ రసవత్తరంగా సాగే అవకాశం ఉంది.
ప్రపంచకప్ 2023లో తొలి రెండు మ్యాచ్‌ల్లో ఓడినప్పటికీ.. ఆ తర్వాత వరుసగా అయిదు మ్యాచ్‌ల్లో ఆస్ట్రేలియా నెగ్గింది. ఆసీస్ ప్రస్తుతం పాయింట్ల పట్టికలో మూడో స్థానంలో ఉంది. ఇంకా రెండు మ్యాచ్‌లు (అఫ్గానిస్థాన్, బంగ్లాదేశ్) ఆస్ట్రేలియా ఆడాల్సి ఉంది. ఈ రెండు మ్యాచ్‌లకి ఒక్కటి గెలిచినా ఆసీస్ మూడో సెమీఫైనలిస్ట్ అవుతుంది. అఫ్గాన్‌పైనే గెలిచి సెమీస్ బెర్త్ కైవసం చేసుకోవాలని చూస్తోంది. అయితే మెగా టోర్నీలో పెద్ద జట్లను ఓడించిన అఫ్గానిస్థాన్‌పై విజయం సాధించడం అంత సులువేం కాదు. ఆసీస్ మిడిల్ ఆర్డర్ ప్రదర్శన కూడా ఆందోలన కలిగిస్తోంది.
నేడు కరీంనగర్‌లో బండి సంజయ్ పాదయాత్ర
కరీంనగర్ ఎంపీ, బీజేపీ ప్రధాన కార్యదర్శి బండి సంజయ్ మంగళవారం నుంచి కరీంనగర్ నియోజకవర్గం నుంచి రాష్ట్రవ్యాప్తంగా యాత్ర చేపట్టనున్నారు. ప్రతిరోజు ఉదయం 7 గంటల నుంచి మధ్యాహ్నం వరకు, సాయంత్రం 6 గంటల నుంచి రాత్రి 10 గంటల వరకు యాత్ర జరగనుంది. సంజయ్‌కు హెలికాప్టర్ కేటాయించి, ప్రతిరోజూ రెండు అసెంబ్లీ నియోజకవర్గాల్లో ప్రచారం నిర్వహించే పనిలో పడ్డారు. ఇది ఉదయం 11 గంటల నుండి సాయంత్రం 5 గంటల మధ్య జరుగుతుంది. షెడ్యూల్ ప్రకారం నవంబర్ 8న సిరిసిల్ల, నారాయణపేట, 9న ఖానాపూర్, మహేశ్వరంలో పర్యటించనున్నారు. బుల్లెట్ ప్రూఫ్ వాహనాలను వినియోగించుకునేందుకు ఆయన అనుమతించారు.
నేడు 10వ రోజుకు చేరిన సామాజిక సాధికార బస్సు యాత్ర.. షెడ్యూల్ ఇదే..!
వైసీపీ చేపట్టిన సామాజిక సాధికారిత బస్సు యాత్రకు ప్రజల నుంచి అపూర్వ ఆదరణ దొరుకుతుంది. నేడు 10వ రోజు బస్సుయాత్రలో భాగంగా రాయలసీమలో ఆళ్లగడ్డ, కోస్తాంధ్రాలో వినుకొండ, ఉత్తరాంధ్రాలో ఆముదాలవలసలో ఈ బస్సు యాత్ర కొనసాగబోతుంది. నంద్యాల జిల్లా ఆళ్లగడ్డలో ఎమ్మెల్యే గంగుల బ్రిజేంద్రనాథ్‌రెడ్డి సారథ్యంలో బస్సు యాత్ర కొనసాగనుంది. మధ్యాహ్నం 12 గంటలకు మహాలక్ష్మి ఫంక్షన్ హాలులో ప్రెస్ మీట్.. అనంతరం నాలుగు రోడ్ల జంక్షన్ వరకూ బైక్ ర్యాలీ చేయనపున్నారు. ఇక, సాయంత్రం 4 గంటలకు వైసీపీ ఆధ్వర్యంలో బహిరంగ సభ ఏర్పాటు చేశారు.
40.78 లక్షల మంది ఓటర్లు, 20 స్థానాలు, 223 మంది అభ్యర్థులు.. ఛత్తీస్‌గఢ్‌లో తొలి దశ ఓటింగ్
ఛత్తీస్‌గఢ్‌లో నేడు అసెంబ్లీ ఎన్నికల తొలి దశ పోలింగ్ జరుగుతోంది. మొదటి దశలో 20 అసెంబ్లీ స్థానాలకు ఓటింగ్ జరుగనుంది. ఆ తర్వాత నవంబర్ 17న రెండో దశలో 70 స్థానాలకు పోలింగ్ జరగనుంది. నేడు 10 స్థానాలకు ఉదయం 7 గంటల నుంచి మధ్యాహ్నం 3 గంటల వరకు, 10 స్థానాల్లో ఉదయం 8 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు పోలింగ్ జరగనుంది. భద్రతా దృష్ట్యా, ఛత్తీస్‌గఢ్‌లో రెండు దశల్లో ఓటింగ్ నిర్వహించాలని ఎన్నికల సంఘం నిర్ణయించింది. ఈసారి అసెంబ్లీ ఎన్నికలు అనేక రకాలుగా ప్రత్యేకం. వరుసగా రెండోసారి అధికారంలోకి వస్తామని కాంగ్రెస్ చెబుతుండగా, కాంగ్రెస్‌ను ఓడించేందుకు బీజేపీ తన ఎంపీలను రంగంలోకి దించింది. మొదటి దశ ఓటింగ్ అనేక ఇతర విధాలుగా ప్రత్యేకమైనది, దానికి సంబంధించిన ప్రతి విషయాన్ని తెలుసుకుందాం.
తొలి దశలో ఛత్తీస్‌గఢ్‌లోని 9 జిల్లాల్లోని 20 అసెంబ్లీ స్థానాలకు ఈరోజు పోలింగ్ జరగనుంది. ఈ జిల్లాల్లో ఎక్కువ భాగం నక్సల్స్ ప్రభావిత ప్రాంతాలు, అన్నీ గిరిజన ప్రాబల్యం ఉన్న ప్రాంతాలే. ఈ 20 సీట్లలో 12 ఎస్టీలకు రిజర్వ్ చేయబడ్డాయి. 2018లో జరిగిన ఎన్నికల్లో ఈ 9 జిల్లాల్లో మొత్తం ఓటింగ్ శాతం 77.23%. ఇదొక్కటే కాదు, ప్రస్తుత సిఎం భూపేష్ బఘేల్, బిజెపి సీనియర్ నాయకుడు, మాజీ సిఎం రమణ్ సింగ్‌ల భవితవ్యం కూడా ఈరోజు మొదటి దశ ఓటింగ్‌లో ఈవీఎంలో నిర్ణయించబడుతుంది. మొదటి దశలో ఓటింగ్ జరుగుతున్న ప్రాంతాలు దాదాపు 5 రాష్ట్రాల సరిహద్దులుగా ఉన్నాయి.
విద్యుత్ షాక్ తో ఇద్దరు రైతులు మృతి
కృష్ణాజిల్లాలో తీవ్ర విషాదం చోటు చేసుకుంది. తోట్లవల్లూరు మండలంలోని పాములలంకలో విద్యుత్ షాక్ తో ఇద్దరు రైతులు మృతి చెందారు. పాములలంకకు చెందిన పాముల విజయాంభ, పాముల చిరింజీవిగా గుర్తించారు. దీంతో పాములులంక గ్రామంలో తీవ్ర విషాదఛాయలు అలుముకున్నాయి. నిన్న మధ్యాహ్నం పసుపు తోటలో పిండి వేయటానికి వెళ్లిన విజయాంభ, చిరింజీవి.. పొలానికి వేసిన కంచెకు విద్యుత్ ప్రసరించటంతో కంచికి తగిలి ఇద్దరు మృతి చెందారని గ్రామస్తులు భావిస్తున్నారు. ఇద్దరు ఎంత సేపటికీ తిరిగి రాకపోవటంతో గ్రామస్థులు గాలింపు చేపట్టారు. రాత్రి ఒకటిన్నర గంటలకు పొలంలో పడి ఉన్న మృతదేహాలను స్థానికులు కనుగొన్నారు.
దీంతో పొలానికి వేసిన కంచెకు కరెంట్ ను తొలగించి ఆ తర్వాత ఇరువురు మృతదేహాలను బయటకు తీసుకొచ్చారు. ఈ విషయాన్ని పోలీసులకు తెలపడంతో సంఘటన స్థాలానికి చేరుకుని ఘటనపై ఆరా తీశారు. ఇక, ఈ సంఘటనపై కేసు నమోదు చేసుకుని విచారణ చేస్తున్నారు. మృతదేహాలను స్థానిక ప్రభుత్వ ఆస్పత్రికి పోస్ట్ మార్టం కోసం పంపించారు. విభయాంభ, చిరింజీవి మరణాలతో పాములలంకలో తీవ్ర విషాదఛాయలు
రోడ్డు ప్రమాదాల నుంచి త్రుటిలో బయటపడ్డ ఇద్దరు మాజీ సీఎంలు!
గుజరాత్ మాజీ ముఖ్యమంత్రులు విజయ్ రూపానీ, సురేశ్ మెహతా రోడ్డు ప్రమాదాల నుంచి త్రుటిలో బయటపడ్డారు. సోమవారం వేర్వేరు చోట్ల ఈ ఘటనలు చోటుచేసుకున్నాయి. వేర్వేరు ప్రమాదాల్లో గుజరాత్ మాజీ సీఎంకు ఎలాంటి గాయాలు కాకుండా బయటపడ్డారు. ఈ విషయాన్ని డిప్యూటీ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ సీపీ ముంధ్వా తెలిపారు.
సోమవారం ఉదయం 10.30 గంటల సమయంలో విజయ్ రూపానీ కాన్వాయ్ అహ్మదాబాద్, రాజ్‌కోట్ జాతీయ రహదారిపై ప్రయాణిస్తుండగా ప్రమాదం చోటుచేసుకుంది. సురేంద్రనగర్ జిల్లా లింబ్డి పట్టణం సమీపంలో 50 ఏళ్ల ప్రభు థాకర్షి అనే వ్యక్తి తన ద్విచక్ర వాహనంపై రోడ్డు దాటుతుండగా.. మాజీ సీఎం కాన్వాయ్‌లోని ఓ కారు అతడి బైక్‌ను ఢీకొట్టింది. ఆ సమయంలో మాజీ సీఎం రూపానీ వేరే కారులో ఉన్నారు. గాయపడిన వ్యక్తి ఆరోగ్య పరిస్థితిని వెంటనే ఆసుపత్రికి తరలించారు.