గుడ్‌న్యూస్.. నేడే వారి ఖాతాల్లో రూ.10 వేలు
మత్స్యకారులకు మరోసారి శుభవార్త చెప్పారు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్‌రెడ్డి.. వరుసగా ఐదో ఏడాది…వైఎస్సార్ మత్స్యకార భరోసా నిధులను విడుదల చేయనున్నారు.. రాష్ట్రవ్యాప్తంగా సముద్రంపై వేటకు వెళ్లే 1,23,519 మత్స్యకార కుటుంబాలకు ఈ పథకం ద్వారా ఈ ఏడాది లబ్ధి పొందనున్నారు.. వేట నిషేధ సమయం అయిన ఏప్రిల్ 15– జూన్ 14 కాలంలో మత్స్యకార కుటుంబాలకు రూ.10 వేల చొప్పున ప్రభుత్వ ఆర్ధిక సహాయం చేస్తూ వస్తుంది.. మొత్తం 123.52 కోట్లను లబ్దిదారుల ఖాతాల్లో జమ చేయనున్నారు ముఖ్యమంత్రి జగన్.. దీంతో పాటు కోనసీమ, కాకినాడ జిల్లాలలోని 23,458 మత్స్యకార కుటుంబాలకు రూ. 108 కోట్లతో ఆర్ధిక సహాయం చేయనున్నారు.. ఓఎన్‌జీసీ సంస్థ పైప్ లైన్ పనుల కారణంగా జీవనోపాధి కోల్పోయిన కోనసీమ, కాకినాడ జిల్లాలలోని 23,458 మత్స్యకార కుటుంబాలకు కూడా సాయం చేయనున్నారు.. మొత్తం రూ. 231 కోట్లను లబ్ధిదారుల ఖాతాల్లో జమ చేయనున్నారు సీఎం వైఎస్ జగన్.. ఈ రోజు బాపట్ల జిల్లాలో పర్యటించిన ఏపీ సీఎం.. నిజాంపట్నంలో జరిగే కార్యక్రమంలో బటన్ నొక్కి ఆ నిధులను లబ్ధిదారుల ఖాతాల్లో జమ చేస్తారు.
మరోసారి సీబీఐ ముందుకు ఎంపీ అవినాష్‌రెడ్డి.. విచారణపై ఉత్కంఠ.. ఏం జరుగుతోంది..?
తెలుగు రాష్ట్రాల్లో సంచలనం సృష్టించిన మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసు ఉత్కంఠ రేపుతోంది.. ఈ రోజు మరోసారి సీబీఐ ముందు విచారణకు హాజరుకానున్నారు కడప ఎంపీ వైఎస్ అవినాష్‌రెడ్డి.. ఇప్పటికే ఆరు సార్లు ఆయనను ప్రశ్నించిన సీబీఐ అధికారులు.. స్టేట్‌మెంట్ రికార్డు చేశారు.. ఇక, మరోసారి విచారణకు హాజరుకావాలంటూ.. ఎంపీ అవినాష్ రెడ్డికి 160 సీఆర్పీసీ కింద నోటీసులు జారీ చేశారు సీబీఐ అధికారులు.. దీంతో.. ఈ రోజు ఉదయం 11 గంటలకు హైదరాబాద్‌లోని సీబీఐ కార్యాలయంలో విచారణకు హాజరు కాబోతున్నారు.. మరోవైపు వైఎస్ వివేకా హత్య కేసులో ముందస్తు బెయిల్ కోసం హైకోర్టులో పిటిషన్ వేశారు ఎంపీ అవినాష్‌రెడ్డి.. కానీ, ముందస్తు బెయిల్ ఇవ్వడానికి హైకోర్టు నిరాకరించింది.. వివేక హత్య కేసులో 20 రోజుల తర్వాత మరోసారి సీబీఐ నోటీసులు జారీ చేయడం.. ఈ రోజు ఆయన సీబీఐ ముందుకు రానుండడంతో.. ఇవాళ్టి విచారణపై ఉత్కంఠ రేగుతోంది.. సీబీఐ నోటీసులతో.. పులివెందల, లింగాలలో జరగబోయే కార్యక్రమాలను రద్దు చేసుకున్న ఎంపీ అవినాష్‌రెడ్డి.. సీబీఐ విచారణకు హాజరయ్యేందుకు సిద్ధం అయ్యారు.
ఇప్పట్లో క్యాసినో నిర్వహించే ఆలోచన లేదు..
ఇప్పట్లో క్యాసినో నిర్వహించే ఆలోచన లేదని, ఈడీ విచారణకు ఎప్పుడూ పిలిచినా వస్తానని వెళ్తానని చీకోటి ప్రవీణ్‌కుమార్ స్పష్టం చేశారు. నిన్న ఈడీ అధికారులు చీకోటి ప్రవీణ్ కుమార్ ను ఏడు గంటల పాటు విచారించారు. ఈడీ విచారణ అనంతరం చీకోటి ప్రవీణ్ కుమార్ మాట్లాడారు. థాయ్‌లాండ్‌కు ఆటగాడిగా వెళ్లానని చెప్పాడు. తాను ఆర్గనైజర్ గా థాయ్ లాండ్ వెళ్లలేదన్నారు. థాయ్‌లాండ్‌లో గ్యాంబ్లింగ్ నిర్వహించిన వారందరూ జైలులోనే ఉన్నారని తెలిపారు. తనపై అసత్య ఆరోపణలు చేస్తున్నారని అన్నారు. ప్రస్తుతం క్యాసినో నిర్వహించే ఆలోచన లేదన్నారు. ఎప్పుడు పిలిచినా ఈడీ విచారణకు వెళతానని స్పష్టం చేశారు. చికోటి ప్రవీణ్ కుమార్ సోమవారం ఈడీ విచారణకు హాజరయ్యారు. విచారణకు హాజరుకావాలని చికోటి ప్రవీణ్‌కుమార్‌కు ఈడీ అధికారులు గతవారం నోటీసు జారీ చేసిన సంగతి తెలిసిందే. ఈ నెల 1న ప్రవీణ్ కుమార్ అనే థాయ్ లాండ్ లో గ్యాంబ్లింగ్ నిర్వహిస్తుండగా పోలీసులకు పట్టుబడ్డాడు. ఈ నేపథ్యంలో ఈడీ అధికారులు చీకోటి ప్రవీణ్‌కుమార్‌కు నోటీసులు జారీ చేశారు. చికోటి ప్రవీణ్‌కుమార్‌తో పాటు మరో ఇద్దరికి ఈడీ అధికారులు నోటీసులు జారీ చేశారు. గతంలో కూడా చికోటి ప్రవీణ్‌కుమార్‌ను ఈడీ అధికారులు విచారించారు. ఈ ఏడాది ఏప్రిల్ 16 నుంచి 21 వరకు థాయ్‌లాండ్‌లో చీకోటి ప్రవీణ్ కుమార్ గ్యాంబ్లింగ్ నిర్వహించారు. ఏప్రిల్ 27 నుంచి మే 1 వరకు జరిగిన రెండో విడత జూదంలో చేకోటి ప్రవీణ్ కుమార్ సహా 83 మందిని థాయిలాండ్ పోలీసులు అరెస్టు చేశారు. ఈ కేసులో చికోటి ప్రవీణ్ కుమార్ సహా పలువురికి బెయిల్ మంజూరైంది. థాయ్‌లాండ్‌లో జూదానికి సంబంధించిన ఆర్థిక లావాదేవీలపై ఈడీ అధికారులు చేకోటి ప్రవీణ్‌కుమార్‌ను ప్రశ్నించినట్లు సమాచారం. థాయ్‌లాండ్‌లో గ్యాంబ్లింగ్‌పై నిషేధం విధించిన విషయం తనకు తెలియదని చేకోటి ప్రవీణ్ కుమార్ గతంలో మీడియాతో వ్యాఖ్యానించిన సంగతి తెలిసిందే. థాయ్‌లాండ్‌లో గ్యాంబ్లింగ్ విషయంతో తనకు ఎలాంటి సంబంధం లేదని వ్యాఖ్యానించారు.
ఎమ్మెల్యే రాజాసింగ్ సస్సెన్షన్ వేటు.. త్వరలో క్లారిటీ ఇవ్వనున్న బీజేపీ
గోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్‌కు త్వరలో ఉపశమనం లభించనుంది. త్వరలోనే తమ పార్టీ సస్పెన్షన్‌ను ఎత్తివేస్తుందని బీజేపీ నేత, కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి తెలిపారు. ఆయనపై సస్పెన్షన్ ఉపసంహరణ ప్రక్రియపై చర్చిస్తున్నట్లు తెలిపారు. అంతిమంగా పార్టీయే తుది నిర్ణయం తీసుకుంటుందని చెప్పారు. సస్పెన్షన్ ఉపసంహరణ సభలో తాను కూడా పాల్గొంటానని, ఈ విషయమై అన్ని విధాలుగా ఆలోచించి హైకమాండ్‌కు తమ నిర్ణయాన్ని వెల్లడిస్తానని చెప్పారు. గత ఏడాది ఆగస్టులో మహ్మద్ ప్రవక్తపై రాజాసింగ్ చేసిన వ్యాఖ్యలు దేశవ్యాప్తంగా దుమారం రేపాయి. రాజాసింగ్ అనుచిత వ్యాఖ్యలపై ఆగ్రహం వ్యక్తం చేసిన బీజేపీ ఆయనను సస్పెండ్ చేసింది. రాజా సింగ్‌ను ఎందుకు బహిష్కరించకూడదో వివరించాలని బీజేపీ కోరింది. నగరంలోని ప్రముఖ హాస్యనటుడు మునవర్ ఫరూఖీ షో సందర్భంగా ఎమ్మెల్యే రాజాసింగ్ యూట్యూబ్‌లో వీడియోను విడుదల చేశారు. ఈ వీడియోలో ప్రవక్త ముహమ్మద్ అనుచిత వ్యాఖ్యలు చేశారని ఓ వర్గం ఆరోపిస్తోంది. ఈ మేరకు నగర పరిధిలోని పలు స్టేషన్లలో ఎమ్మెల్యే రాజాసింగ్ పై పలువురు ఫిర్యాదు చేశారు. సోమవారం రాత్రి కూడా ఎమ్మెల్యేకు వ్యతిరేకంగా నగరంలో నిరసన కార్యక్రమం చేపట్టారు. రాజాసింగ్ తమ మనోభావాలను దెబ్బతీశారని ఆందోళనకారులు ఆరోపించారు. వారి ఫిర్యాదుతో పోలీసులు ఎమ్మెల్యే రాజాసింగ్‌ను అరెస్టు చేశారు.
నేను పార్టీ మారడం లేదు.. మునుగోడు నుండే బరిలో దిగుతా
బీజేపీతోనే నా ప్రయాణమని, వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో మునుగోడు నుండే బీజేపీ అభ్యర్థిగా బరిలో దిగుతానని బీజేపీ సీనియర్ నేత కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి స్పష్టం చేశారు. సోషల్ మీడియాలో పార్టీ మారుతున్నానంటూ వస్తున్న ప్రచారంపై ఆయన ఖండించారు. కొంతమంది ఇలాంటి పోస్టులతో క్యాడర్ ను అయోమయానికి గురిచేయాలని కుట్రలు చేస్తున్నారని మండిపడ్డారు. బీజేపీతోనే తన ప్రయాణం చేస్తాఅని పార్టీ మారే సమస్యలేదని అన్నారు. వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో మునుగోడు నుండే బీజేపీ అభ్యర్థిగా బరిలో దిగుతా అని స్పష్టం చేశారు. కర్ణాటక ఎన్నికల ఫలితాలతో తెలంగాణ రాజకీయాలు ఆసక్తికరంగా మారాయి. కర్ణాటకలో కాంగ్రెస్ కైవసం చేసుకుంది. క్లియర్ మెజార్టీతో అధికారం హస్తగతం చేసుకుంది. మెుత్తం 224 అసెంబ్లీ స్థానాలుండగా.. 136 సీట్లను కైవసం చేసుకుంది. మెున్నటి వరకు అధికారంలో ఉన్న బీజేపీ 65 సీట్లతోనే సరిపెట్టుకోవాల్సి వచ్చింది. ఇక కింగ్ మేకర్ రోల్ పోషించాలనుకున్న జేడీఎస్ గత ఎన్నికలతో పోలిస్తే.. తక్కువ సీట్లకు పరిమితమైంది. ఈసారి ఆ పార్టీ 19 స్థానాల్లో మాత్రమే విజయం సాధించింది. కర్ణాటకలో అనూహ్యమైన విజయం సాధించడంతో తెలంగాణ కాంగ్రెస్ నేతలు, క్యాడర్‌లో కొత్త ఉత్సాహం నెలకొంది. అయితే కర్ణాటక ఫలితాలే తెలంగాణలో రిపీట్ అవుతాయని తెలంగాణ కాంగ్రెస్ నేతలు ధీమా వ్యక్తం చేస్తున్నారు.
వాట్సాప్‌లో సరికొత్త ఫీచర్.. ఇక మరింత భద్రత..
వాట్సాప్‌లో మరో సరికొత్త ఫీచర్ అందుబాటులోకి వచ్చింది.. తన యూజర్ల కోసం ఎప్పటికప్పుడు కొత్త ఫీచర్లను పరిచయం చేస్తూనే ఉంది వాట్సాప్.. ఎన్నో మార్పులు తీసుకొస్తూనే ఉంది.. తాజాగా.. ‘చాట్ లాక్’ పేరుతో మరో సరికొత్త ఫీచర్‌ను తీసుకొచ్చింది.. ఈ ఫీచర్‌తో వినియోగదారుల చాట్‌కు అదనపు భద్రత లభిస్తుందని మెటా సీఈవో మార్క్ జుకర్‌బర్గ్ పేర్కొన్నారు.. చాట్ లాక్ మీ ముందుకు తీసుకురావడం చాలా ఎగ్జైటింగ్‌గా ఉంది. మీ కీలకమైన చాట్‌కు ఇది అదనపు భద్రత కల్పిస్తుంది.. అని వాట్సాప్ ఓ ప్రకటనలో తెలిపింది. మొత్తంగా వాట్సాప్ మీ సన్నిహిత సంభాషణలను రక్షించడానికి ‘చాట్ లాక్’ ఫీచర్‌ను పరిచయం చేసింది.. చాట్‌ను లాక్ చేయడం వలన ఇన్‌బాక్స్ నుండి ఆ థ్రెడ్ తీసివేయబడుతుంది మరియు వేలిముద్ర వంటి మీ పరికర పాస్‌వర్డ్ లేదా బయోమెట్రిక్‌తో మాత్రమే యాక్సెస్ చేయగల దాని స్వంత ఫోల్డర్ వెనుక ఉంచబడుతుంది. యాప్ యొక్క గోప్యత మరియు భద్రతను పెంచడానికి వాట్సాప్ ఎట్టకేలకు దీర్ఘకాలంగా ఎదురుచూస్తున్న ‘చాట్ లాక్’ ఫీచర్‌ను విడుదల చేసింది. ఇది మీ అత్యంత సన్నిహిత సంభాషణలను మరొక భద్రతా పొరతో రక్షించుకోవడానికి మిమ్మల్ని అనుమతిస్తుంది. కొత్త యాప్ అప్‌డేట్‌తో ఈ ఫీచర్ వినియోగదారులకు అందుబాటులోకి వస్తుంది.
లిఫ్ట్ అడిగి బైక్‌పై షూటింగ్‌కి బిగ్ బీ.. హెల్మెట్ ఎక్కడ..?
బాలీవుడ్ లెజెండ్ అమితాబ్ బచ్చన్ సమయపాలన పాటిస్తాడనే సంగతి తెలిసిందే. ఎప్పటికప్పుడు తన హుందాతనంతో, నిడారంబరతతో అభిమానులను మురిపిస్తూనే ఉంటారు బిగ్‌బీ. తాజాగా ఇదే విధంగా నెటిజెన్ల మనసు కొల్లగొట్టేశారు.. ఇటీవల ట్రాఫిక్ జామ్‌లో చిక్కుకున్నారు అమితాబ్.. అయితే, షూటింగ్‌కు సమయం మించిపోతుండటంతో.. అసాధారణ పనికి పూనుకున్నారు.. ట్రాఫిక్ ఇప్పట్లో క్లియర్ కాదనే విషయాన్ని గ్రహించిన ఆయన.. తన కారు దిగిపోయారు.. అటుగా వెళ్తున్న ఓ బైకర్‌ని లిఫ్ట్ అడిగారు. ఇంకేముందు.. అసలే బిగ్‌బీ ఫ్యాన్ అయిన ఆ బైకర్ ఆనందంగా సూపర్ స్టార్‌కు లిఫ్ట్ ఇచ్చాడు. షూటింగ్ స్పాట్‌కు చేర్చాడు.. అయితే, తనకు ఎదురైన ఈ అనుభవాన్ని సోషల్ మీడియాలో షేర్ చేశారు బిగ్‌బీ.. తాను బైక్ ఎక్కిన ఫొటోను షేర్ చేస్తూ.. పసుపు పచ్చ దుస్తులు ధరించిన వ్యక్తి(బైకర్)కు ధన్యవాదాలు అంటూ కామెంట్ పెట్టారు. ఇక, బిగ్ బీ మనవరాలు నవ్య నవేలి నందా హృదయం మరియు గుండె-కంటి ఎమోజీలను వదిలివేసింది. రోహిత్ బోస్ రాయ్ ఇలా వ్రాశాడు: “మీరు భూమిపై అత్యంత చక్కని వ్యక్తి అమిత్ జీ! ప్రేమిస్తున్నాను. ఎల్లప్పుడూ స్ఫూర్తిదాయకంగా ఉంటుందని పేర్కొన్నారు.. ఓవైపు.. 80 ఏళ్ల సూపర్‌స్టార్ తన పని పట్ల అంకితభావంతో ఉన్నారని ప్రశంసిస్తూ వ్యాఖ్యల విభాగం పొగడ్తలతో నిండి ఉండగా.. మరోవైపు అమితాబ్ బచ్చన్ మరియు బైక్ నడుపుతున్న వ్యక్తి హెల్మెట్ ధరించలేదని మరికొందరు కూడా ఎత్తి చూపారు. “హెల్మెట్ ఎక్కడ ఉంది సార్” అని ఒక అభిమాని అడిగాడు. “సర్ హెల్మెట్ జరూరీ హై పెహెన్నా.. టోపీ సే కామ్ నహీ చలేగా ” అని మరొక వినియోగదారు చెప్పారు. “కంప్యూటర్ జీ చలాన్ ఆన్‌లైన్ చలాన్ కర్ దో జల్దీ సా లేకుండా హెల్మెట్ కా” అని ఒక అభిమాని కౌన్ బనేగా కరోడ్‌పతి నుండి బిగ్ బి యొక్క ట్రేడ్‌మార్క్ లైన్‌పై పిన్ చేశాడు. మొత్తంగా సోషల్ మీడియాలో, మీడియాలో మరోసారి బిగ్‌బీ గురించే చర్చ.