పాలిటిక్స్ లోకి అభిషేక్ బచ్చన్..ఆ పార్టీ నుంచే ఎంపీగా పోటి..
బాలివుడ్ బాద్షా అమితాబ్ బచ్చన్ ఫ్యామిలి నుంచి మరొకరు రాజకీయాల్లోకీ ఎంట్రీ ఇవ్వనున్నారనే వార్తలు గత కొన్నేళ్లుగా వినిపిస్తున్నాయి. ఇప్పటికే అమితాబ్ తో పాటు.. ఆయన భార్య జయా బచ్చన్ కూడా పాలిటిక్స్ లో ఉండగా.. తాజాగా హీరో అభిషేక్ బచ్చన్ కూడా పాలిటిక్స్ లోకి ఎంట్రీ ఇవ్వడానికి రంగం సిద్ధం చేస్తున్నారు..నటుడు అభిషేక్ రాజకీయ ఆరంగేట్రానికి సిద్దం అవుతున్నారు. సీనీరాజకీయ వర్గాల నుంచి అందుతున్నసమాచారం ప్రకారం బచ్చన్ ఫ్యామిలీ వారసత్వం తీసుకున్న అభిశేక్ హీరోగా బాలీవుడ్ ఎంట్రీ ఇచ్చాడు. కాని ఫిల్మ్ ఇండస్ట్రీలో క్లిక్ అవ్వలేకపోయాడు. ఇక ఇప్పుడు వారి రాజకీయ వారసత్వాన్ని పుచ్చుకోబోతున్నట్టు తెలుస్తోంది.. ఇప్పుడు ఎంపీగా పోటి చేయబోతున్నట్లు సమాచారం.. అభిషేక్ బచ్చన్ సమాజ్ వాదీ పార్టీ తరపున ప్రయాగ్‌రాజ్ స్థానం నుంచి ఎంపీగా పోటీచేయనున్నారని సమాచారం. అభిషేక్ బచ్చన్ తండ్రి అమితాబ్ బచ్చన్ 1984లో కాంగ్రెస్ తరపున ఇదే స్థానం నుంచి భారీ మెజారిటీతో ఎంపీగా గెలుపొందారు. అప్పటి ప్రధాని రాజీవ్ గాంధీ కోరిక మేరకు బరిలోకి దిగిన ఆయన లోక్‌దళ్ అభ్యర్థి హెచ్ఎన్ బహుగుణపై లక్ష ఓట్ల మెజారిటీతో గెలుపొందారు… ఇక అభిషేక్ ను కూడా రాజకీయ వారసుడుగా ఎంట్రీ ఇప్పించాలని భావిస్తున్నారు..
ఆ కారణంగానే నేను సినిమాలకు దూరం అయ్యాను.
ప్రీతి జింగానియా ఈ భామ గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు.ఈ భామ తెలుగు లో పవన్ కళ్యాణ్ సరసన తమ్ముడు సినిమాలో హీరోయిన్ గా నటించింది. ఆ సినిమా మంచి విజయం సాధించింది. ఈ సినిమాలో ప్రీతీ అద్భుతంగా నటించి మెప్పించింది. ఆ తరువాత బాలకృష్ణ సరసన నరసింహనాయుడు సినిమాలో నటించింది. ఈ సినిమా ఏకంగా ఇండస్ట్రీ హిట్ గా నిలిచింది.కానీ ఆ తరువాత ప్రీతి జింగానియా నటించిన తెలుగు సినిమాలు అంతగా ఆకట్టుకోలేదు.దీనితో ఈ భామకు అవకాశాలు తగ్గాయి. ఆ తర్వాత టాలీవుడ్ లో సరిగా అవకాశాలు రాకపోవడంతో బాలీవుడ్ కి చెక్కేసింది. తర్వాత మళ్ళీ ఒకసారి తేజం అనే సినిమాలో ఒక ఐటమ్ సాంగ్ లో నటించింది.2007లో వచ్చిన విక్టోరియా నెం. 203 సినిమా తర్వాత మరే హిందీ సినిమాలోనూ ఈ భామ కనిపించలేదు.సినిమాలకు దూరంగా వున్న ఈ భామ ఇటీవలే సెకండ్ ఇన్నింగ్స్ ని ప్రారంభించింది. ఇందులో భాగంగానే ఫాస్ వెబ్ సిరీస్‌తో ఈ భామ రీఎంట్రీ ఇచ్చింది.ఇటీవల ప్రీతీ తాను సినిమాలకు దూరం అవడానికి కారణం ఏంటో తెలిపింది. ఈ సందర్భంగా ప్రీతి మాట్లాడుతూ.. నేను కోరుకున్న పాత్రలు నాకు రాలేదు.. నాకు వచ్చిన పాత్రలతో నాకు అంతగా సంతోషంగా అనిపించలేదు. నాకు సినిమాలో ముఖ్యమైన పాత్ర చేయాలని ఉండేది. అలా అని సినిమా మొత్తం నేనే హైలైట్ అవ్వాలని అయితే చెప్పడం లేదు.కనీసం కథలో నా పాత్రకు ఇంపార్టెన్స్ ఉండాలని అంటున్నాను. అదే నేను కోరుకుంది. కానీ అటువంటి పాత్రలు నాకు రాలేదు. అలాంటప్పుడు నా అభిమానులను నిరుత్సాహపరచడం ఎందుకని సినిమాలకు దూరం అయ్యాను.
అమెరికాలో భారీ భూకంపం.. రిక్టర్ స్కేలుపై 7.4 తీవ్రతగా నమోదు
అమెరికాలో 7.4 తీవ్రతతో భారీ భూకంపం సంభవించింది. అలాస్కా ద్వీపకల్ప వచ్చిన ఈ భూప్రకంపనల వల్ల ఎలాంటి ప్రాణనష్టమూ జరగలేదని తెలుస్తోంది. ఈ భూకంపం వల్ల అలస్కా ద్వీపకల్పంలో సునామీ హెచ్చరికలు జారీ చేసినట్లు అధికారులు తెలిపారు. ఉత్తర అమెరికాలోని ఇతర US కెనడియన్ పసిఫిక్ తీరాలకు, సునామీ ప్రమాద స్థాయిని అంచన వేస్తున్నట్లు అధికారులు తెలిపారు. 9.3 కిలోమీటర్ల లోతులో భూకంపం సంభవించినట్లు యూఎస్జీఎస్ తెలిపింది. ‘‘ఆదివారం తెల్లవారుజామున 7.4 తీవ్రతతో భూకంపం సంభవించింది. సునామీ హెచ్చరిక వ్యవస్థ ద్వారా ముప్పు జారీ చేయబడింది. దీని కేంద్రం 5.78 మైళ్ల లోతులో ఉంది’’ అని యూఎస్జీఎస్ ట్వీట్ చేసింది. సునామీ హెచ్చరికలు జారీ చేయడంతో అలస్కా, ఇతర తీర ప్రాంత ప్రజలు హుటాహుటిన తమ ప్రాంతాలను ఖాళీ చేసి వెళ్లిపోతున్నారు.
అక్కడ వైసీపీలో అసమ్మతి లేదు.. మంత్రి వేణుగోపాల్ క్లారిటీ
రామచంద్రపురం వైసీపీలో గ్రూపు రాజకీయాలపై మంత్రి వేణుగోపాల కృష్ణ తాజాగా స్పందించారు. రామచంద్రపురం వైసీపీలో అసమ్మతి లేదని స్పష్టతనిచ్చారు. అక్కడ పరిణామాలకు కృష్ణార్పణం అనేదే తన సమాధానమని తెలిపారు. రామచంద్రపురం నుంచే తాను మళ్లీ పోటీ చేస్తానని క్లారిటీ ఇచ్చారు. ఆ విషయం స్వయంగా సీఎం జగనే చెప్పారని వెల్లడించారు. సుభాష్ చంద్రబోస్ తనకు గురువు అని పేర్కొన్నారు. తాను జగన్ ప్రతినిధినని, జగన్ గెలుపే తన గెలుపని, ఆ దిశగానే తాను అడుగులు వేస్తానని చెప్పుకొచ్చారు.
ఇదిలావుండగా.. కొంతకాలం నుంచి మంత్రి వేణుగోపాల్, రాజ్యసభ ఎంపీ పిల్లీ సుభాష్ వర్గాల మధ్య విభేదాలు కొనసాగుతున్నాయి. తన సొంత స్థానమైన రామచంద్రపురం సీటుని తన తనయుడికి ఇప్పించాలని బోస్ ప్రయత్నిస్తుండగా.. మంత్రి వేణు కూడా ఆ సీటు వదులుకోవడానికి సిద్ధంగా లేరు. ఈ నేపథ్యంలోనే మంత్రి వేణుకి వ్యతిరేకంగా ఆదివారం ఉదయం రామచంద్రపురంలో వైసీపీ కార్యకర్తలు విస్తృతస్థాయి సమావేశం నిర్వహించారు. అధికారాన్ని అడ్డం పెట్టుకొని, వైసీపీ కార్యకర్తలపై ఆయన అక్రమ కేసులు బనాయిస్తున్నరని ఆగ్రహం వ్యక్తం చేశారు. వచ్చే ఎన్నికల్లో వేణుకు టికెట్ ఇవ్వకుండా.. ఎంపీ పిల్లి సుభాష్ చంద్రబోస్ తనయుడు సూర్య ప్రకాష్‌కు టికెట్ ఇవ్వాలని అధిష్టానానికి డిమాండ్ చేశారు.
ఢిల్లీ ఆర్డినెన్స్ కు కాంగ్రెస్ వ్యతిరేకం.. రేపటి ప్రతిపక్షాల సమావేశంలో పాల్గొననున్న ఆప్
ఢిల్లీలో సేవల నియంత్రణపై కేంద్రం తీసుకొచ్చిన ఆర్డినెన్స్‌కు వ్యతిరేకంగా జరిగే పోరాటంలో ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్)కి మద్దతు ఇవ్వాలని కాంగ్రెస్ పార్టీ నిర్ణయించింది. దీంతో సోమవారం బెంగళూరులో జరిగే విపక్షాల సమావేశానికి ముందే కాంగ్రెస్, ఆప్ ల మధ్య ఉన్న ఆగాధాన్ని పూడ్చుకున్నట్టు అయింది. ఊహాగానాలకు ముగింపు పలుకుతూ, బెంగళూరులో కీలక ప్రతిపక్ష సమావేశానికి ముందు సేవల నియంత్రణపై కేంద్రం తీసుకొచ్చిన ఆర్డినెన్స్‌కు వ్యతిరేకంగా పోరాటంలో ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్)కి మద్దతు ఇవ్వాలని కాంగ్రెస్ ఎట్టకేలకు నిర్ణయించింది. కీలకమైన 2024 లోక్‌సభ ఎన్నికలకు ముందు అధికార బీజేపీతో పొత్తు పెట్టుకునే లక్ష్యంతో రేపు జరగనున్న కీలక ప్రతిపక్ష సమావేశాన్ని బహిష్కరిస్తామని చెప్పిన అరవింద్ కేజ్రీవాల్ పార్టీకి ఇది పెద్ద మద్దతుగా మారింది.
ముంబైలో విషాదం.. మార్వే క్రీక్ లో ఐదుగురు బాలురు గల్లంతు.. ఇద్దరు సేఫ్
ముంబైలోని మలాడ్ లో ఘోర విషాదం చోటు చేసుకుంది. మార్వే క్రీక్ లో ఐదుగురు బాలురు గల్లంతయ్యారు. అందులో ఇద్దరు బాలురులను స్థానికులు కాపాడారు. మిగితా ముగ్గురు గల్లంతయ్యారు. వారి కోసం రెస్క్యూ సిబ్బంది గాలింపు చర్యలు చేపట్టింది. ఈ ఘటన ఆదివారం ఉదయం జరిగింది. ‘ఇండియా టీవీ’ కథనం ప్రకారం.. మార్వే క్రీక్ వద్ద సరదాగా గడిపేందుకు ఐదుగురు బాలురు ఉదయం అక్కడికి వచ్చారు. వారి వయస్సు 12 నుంచి 16 ఏళ్ల వరకు ఉంటుంది. ఉదయం 9.38 గంటల ప్రాంతంలో వారందరూ నీటిలో గల్లంతయ్యారు. దీనిని గమనించిన స్థానికులు.. వెంటనే అగ్నిమాపక సిబ్బందికి సమాచారం అందించారు. అయితే అగ్నిమాపక సిబ్బంది అక్కడికి చేరుకునేలోపే కృష్ణ జితేంద్ర హరిజన్ (16), అంకుష్ భరత్ శివరే (13) అనే ఇద్దరు బాలురను స్థానికులు రక్షించారు. మిగితా ముగ్గురి కోసం అగ్నిమాపక సిబ్బంది బోట్ ల సాయంతో గాలింపు చర్యలు చేపట్టారు. నీటిలో మునిగి గల్లంతైన వారిలో శుభం రాజ్ కుమార్ జైస్వాల్ (12), నిఖిల్ సాజిద్ కయంకుర్ (13), అజయ్ జితేంద్ర హరిజన్ (12)గా గుర్తించారు.
ఏపీ ప్రజలు ప్రత్యామ్నాయ రాజకీయ శక్తి కోసం చూస్తున్నారు
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలు ప్రత్యామ్నాయ రాజకీయ శక్తి కోసం చూస్తున్నారని కేంద్రమంత్రి, ఏపీ బీజేపీ వ్యవహారాల ఇన్‌ఛార్జ్ మురళీధరన్ పేర్కొన్నారు. ఆదివారం మంగళగిరిలో కొనసాగించిన ఏపీ బీజేపీ పదాధికారుల సమావేశంలో ఆయన పాల్గొన్నారు. పార్టీ బలోపేతం కోసం రానున్న కాలంలో చేపట్టాల్సిన కార్యక్రమాలపై దిశానిర్దేశం చేశారు. అనంతరం మాట్లాడుతూ.. రానున్న సార్వత్రిక ఎన్నికల్లో రాష్ట్రంలో ముఖ్య భూమిక పోషించి.. బీజేపీని ప్రత్యామ్నాయ రాజకీయ శక్తిగా నిలపాలని పిలుపునిచ్చారు. ఇటీవల హైదరాబాద్‌లో జరిగిన దక్షిణాది రాష్ట్రాల పార్టీ ముఖ్య నేతల సమావేశంలో కూడా.. ఆంధ్రప్రదేశ్‌పై ప్రత్యేక దృష్టి సారించాలని నిర్ణయించామని తెలిపారు. రాష్ట్రంలో వైసీపీ ప్రభుత్వం అవినీతి అక్రమాలతో.. ప్రజా విశ్వాసం కోల్పోయిందని ఆరోపించారు. వైసీపీ ప్రభుత్వం అన్ని రంగాల్లోనూ వైఫల్యం చెందిందని పేర్కొన్నారు. బీజేపీకి ప్రత్యామ్నాయ రాజకీయ శక్తిగా నిలిపేందుకు.. ప్రతి అసెంబ్లీ సెగ్మెంట్‌కి ఒక రోడ్డు మ్యాప్ డిసైడ్ చేసుకోవాలని సూచించారు.
జగన్ బీసీల పక్షపాతి.. ఆ ఘనత ఒక్క ఏపీ ప్రభుత్వానిదే
ఏపీ సీఎం జగన్‌మోహన్ రెడ్డి బీసీల పక్షపాతి అని.. పదవులు, ప్రాతినిధ్యం ఇవ్వడంలో ఆయన చూపించే చొరవ అందుకు నిదర్శనమని వైసీపీ ఉత్తరాంధ్ర ఇన్‌ఛార్జ్ వైవీ సుబ్బారెడ్డి పేర్కొన్నారు. విశాఖలో ఆదివారం నిర్వహించిన బీసీ గర్జన సభలో ఆయన మాట్లాడుతూ.. బీసీల గొంతు చట్టసభల్లో వినిపించేందుకు ఆర్.కృష్ణయ్యను జగన్ రాజ్యసభకు పంపించారని చెప్పారు. పార్టీ ఆవిర్భావం మొదట్లోనే ఆర్.కృష్ణయ్యకు రాజకీయ అవకాశం కల్పించాలని జగన్ భావించారన్నారు. ఏపీలో బీసీలకు దక్కుతున్న ప్రాధాన్యతను ఇతర రాష్ట్రాలు గమనిస్తున్నాయన్నారు. బీసీ ముఖ్యమంత్రులు పాలిత రాష్ట్రాల్లో దక్కని అవకాశాలను ఇక్కడ జగన్ కల్పిస్తున్నారని తెలిపారు. ‘బీసీలు వెనుకబడిన వాళ్ళు కాదు, వెన్నెముక’ అన్న మాటకు కట్టుబడి.. వారి సంక్షేమం కోసం అనేక పథకాలు అమలు చేస్తున్న ఘనత ఏపీ ప్రభుత్వానిదేనని ఉద్ఘాటించారు.
వరంగల్ లో ఘోర రోడ్డు ప్రమాదం..లారీని ఢీ కొట్టిన కారు..
ఫ్రెండ్ ఉన్నత చదువుల కోసం విదేశాలకు వెళ్తున్నాడని అతనికి వీడ్కోలు చెప్పి తిరిగి వస్తుండగా మృత్యువు కబలించింది..ఈ విషాదకర ఘటనలో ఇద్దరు యువకులు అక్కడికక్కడే ప్రాణాలు వదిలారు. వరంగల్- హైదరాబాద్ జాతీయ రహదారిలోని కోమళ్ల టోల్‌గేట్ సమీపంలో ఈ ప్రమాదం జరిగింది. అయితే.. అమెరికాకు వెళ్తున్న తమ మిత్రుడికి సెండాఫ్ ఇచ్చేందుకు వరంగల్‌కు చెందిన రాకేశ్ చంద్ర గౌడ్, సందీప్ ఇద్దరూ కలిసి శుక్రవారం రాత్రి బొలెరోలో హైదరాబాద్‌కు వెళ్లారు. పెంబర్తి రిసార్ట్‌లో రాత్రంతా స్నేహితుడితోనే ఉండి.. శనివారం ఉదయం 5 గంటలకు తిరిగి హన్మకొండకు బొలెరోలో బయలు దేరారు..
అయితే తెల్లవారుజామున ట్రాఫిక్ లేకపోవడంతో కాస్త వేగంగానే వచ్చారు.. అదే వారిని డైరెక్టర్ గా మృత్యువు ఒడిలోకి తీసుకెళ్ళింది..కోమళ్ల టోల్‌గేట్ సమీపంలోని ఓ మలుపు వద్ద రోడ్డు మీదే లారీ పార్క్ చేసి ఉంది. దాన్ని గమనించకపోవటంతో.. వేగంగా వచ్చిన బొలేరో లారీని బలంగా ఢీకొట్టింది. దీంతో.. బొలేరో వాహనం.. లారీ కిందికి చొచ్చుకుపోయి.. ముందుబాగమంతా నుజ్జునుజ్జయింది. కాగా.. ముందు సీట్లలో ఉన్న రాకేశ్ చంద్ర గౌడ్, సందీప్ అక్కడికక్కడే దుర్మరణం చెందారు.. ఈ ప్రమాదం పై సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే సంఘటనా స్థలానికి చేరుకున్నారు..
జులై 18న ఎన్డీయే సమావేశం.. దర్శనమివ్వనున్న బీజేపీతో కలిసి పనిచేసే పార్టీలు
వచ్చే ఏడాది జరగనున్న లోక్‌సభ ఎన్నికలకు ముందు భారతీయ జనతా పార్టీ కసరత్తులు ప్రారంభించింది. అందుకోసం ఎన్‌డిఎ కుటుంబాన్ని పెంచుకునేందుకు ప్లాన్ చేస్తుంది. రాష్ట్రాలలోని చిన్న పార్టీలను ఏకతాటిపైకి తీసుకువస్తే.. ఎన్డీయేకు ఎక్కువ సీట్లు వస్తాయి. దీంతో కేంద్రంలో వరుసగా మూడోసారి బీజేపీ ప్రభుత్వం అధికారంలో ఉంటుంది. అందుకు అనుగుణంగా బీజేపీ ప్లాన్ సిద్ధం చేసుకుంటుంది. ఇప్పటికే ఎన్డీయేతో 24 పార్టీలు కలిసి ఉన్నాయి. మరో 5 పార్టీలు కూడా త్వరలో చేరనున్నట్లు తెలుస్తోంది. ఈనెల 18న జరుగనున్న ఎన్డీయే సమావేశంలో మొత్తం 29 పార్టీల నేతలు దర్శనమివ్వనున్నారు.
బీజేపీ-జనసేన కలిసి.. 2024 ఎన్నికలను ఎదుర్కొంటాయి
బీజేపీ, జనసేన కలిసే ఉన్నాయని.. ఈ రెండు పార్టీలు కలిసి 2024 ఎన్నికలను ఎదుర్కుంటాయని బీజీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి విష్ణువర్ధన్ రెడ్డి స్పష్టం చేశారు. మంగళగిరిలో బీజేపీ రాష్ట్ర పదాధికారుల సమావేశం ముగిసిన అనంతరం ఆయన మాట్లాడుతూ.. 2024 ఎన్నికలకు ఎలా వెళ్లాలనే దానిపై ఈ సమావేశంలో చర్చించామని తెలిపారు. ప్రజా ఉద్యమాలు, పార్టీ కార్యక్రమాలపై కూడా చర్చ జరిగిందన్నారు. రాష్ట్రానికి కేంద్రం చేసిన సహాయాన్ని విస్తృతంగా ప్రజల్లోకి తీసుకెళ్తామని చెప్పారు. వైసీపీ పాలన వైఫల్యాలపై ప్రజా ఛార్జిషీట్ కార్యక్రమాన్ని ముందుకు తీసుకెళ్తామని తెలియజేశారు.
తాము ఇచ్చిన హామీలపై వైసీపీ 90 శాతం వైఫల్యం చెందిందని విష్ణువర్ధన్ ఆరోపించారు. NGT, కోర్టులు ఎన్ని మొట్టికాయలు వేస్తున్నా.. ప్రభుత్వం మాత్రం పట్టించుకోవడం లేదని విమర్శించారు. పేదల ఇళ్ల విషయంలో ప్రభుత్వం మోసం చేస్తోందన్నారు. బీజేపీపై జరిగే దుష్ప్రచారం ఎండగట్టాలని ఈ సమావేశంలో నిర్ణయం తీసుకోవడం జరిగిందని స్పష్టం చేశారు. పవన్ బీజేపీతో లేరని దుష్ప్రచారం చేశారని.. రెండు పార్టీల పొత్తుపై ఇష్టానుసారంగా మాట్లాడేవారని.. అయితే అందులో వాస్తవం లేదని.. జనసేనతో బీజేపీ పొత్తు ఉందని మరోసారి క్లారిటీ ఇచ్చారు.