ఉపఎన్నికల్లో కేసీఆర్ నన్ను చేపను రాకినట్టు రాకిండు.. ఈటల కీలక వ్యాఖ్యలు
ఉపఎన్నికల్లో కేసీఆర్ చేపను రాకినట్టు రాకిండని బీజేపీ పార్టీ గజ్వేల్ నియోజకవర్గ అభ్యర్థి ఈటల రాజేందర్ కీలక వ్యాఖ్యలు చేశారు. కరీంనగర్ జిల్లా వీణవంక మండలం బ్రాహ్మణపల్లిలో ఎన్నికల ప్రచారంలో ఈటల మాట్లాడుతూ.. నేను ఈసారి డబ్బులు ఖర్చుపెట్టే స్థితిలో లేనని అన్నారు. ధైర్య లక్ష్మి మాత్రమే నా దగ్గర ఉందని తెలిపారు. బెల్ట్ షాపులు బంద్ చేస్తే జీతాలు ఇవ్వలేని దుస్థితికి రాష్ట్రాన్ని తీసుకొనివచ్చారని తెలిపారు. కేంద్రం నిధులు ఇవ్వకపోతే గ్రామపంచాయితీ సఫాయి కార్మికులకు కూడా జీతాలు కూడా ఇచ్చే పరిస్థితి లేదని అన్నారు. బలహీనవర్గాలకు రాజ్యాధికారం రాలేదు కాబట్టి మోదీ హామీ ఇచ్చారని తెలిపారు. మొత్తం తెలంగాణ ఓట్లు వేస్తేనే బీసీ సీఎం సాధ్యం అవుతుందన్నారు. బీజేపీ అధికారంలోకి వస్తే అర్హులందరికీ తెల్లరేషన్ కార్డులు ఇస్తామన్నారు. డబుల్ బెడ్ రూమ్ ఇళ్ళు కట్టుకోవడానికి డబ్బులు ఇస్తామన్నారు. సొంత ఇంటికల నిజం చేస్తామన్నారు. పిల్లలకి ఇంగ్లీష్ మీడియం విద్య ఉచితంగా అందిస్తామన్నారు. నాణ్యమైన వైద్యం ఉచితంగా అందిస్తామన్నారు. ముసలివాళ్లు ఇద్దరికీ పెన్షన్ ఇస్తామన్నారు. రైతు కూలీలులకు కూడా 5 లక్షల భీమా అందిస్తామని తెలిపారు. మహిళలకు ఇన్సూరెన్స్ డబ్బులు మేమే కడతామన్నారు.
మీతోనే పొత్తు.. మీరే నా ధైర్యం.. మంచి జరిగిందా? లేదా? అన్నదే కొలమానంగా చూడండి..
ఆంధ్రప్రదేశ్ ఎన్నికల్లో పొత్తులపై మరోసారి కీలక వ్యాఖ్యలు చేశారు సీఎం వైఎస్ జగన్మోహన్‌రెడ్డి.. మీతోనే పొత్తు.. మీరే నా ధైర్యం.. మంచి జరిగిందా? లేదా? అన్నదే కొలమానంగా చూడండి అంటూ పిలుపునిచ్చారు.. పొత్తులను నమ్ముకోలేదు.. నా ధైర్యం మీరే అన్నారు.. పల్నాడు జిల్లా మాచర్ల వద్ద వరికపుడిశెల ఎత్తిపోతల పథకం పనులకు శంకుస్థాపన చేసిన సీఎం జగన్.. అనంతరం నిర్వహించిన బహిరంగ సభలో మాట్లాడారు.. పల్నాడుకు కృష్ణమ్మ జలాలు అందించబోతున్నామని ప్రకటించారు.. ఎలాంటి అనుమతులు లేకుండా గత పాలకులు ప్రాజెక్టు చేపట్టారు.. ప్రస్తుతం అన్ని అనుమతులు వచ్చిన తర్వాతే ఈ ప్రాజెక్ట్‌కు శంకుస్థాపన చేశాం.. ఏదైనా పని చేయాలంటే పాలకులకు చిత్తశుద్ధి ఉండాలని పేర్కొన్నారు.
కాంగ్రెస్, బీజేపీ వాళ్లకు టికెట్లు ఢిల్లీలో ఇస్తారు ఇక్కడ కాదు..
జగిత్యాల జిల్లాలో కథలాపూర్ లో బీఆర్ఎస్ ప్రజాఆశీర్వాద బహిరంగ సభలో మంత్రి కేటీఆర్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. గత ప్రభుత్వాలు బీడీ చుట్టే కార్మికులను పట్టించు కోలేదు.. కటాఫ్ తేదీ లేకుండా డిసెంబర్ 3 తర్వాత తప్పకుండా అర్హులైన అందరికీ పెన్షన్లు ఇస్తామన్నారు. మీకు రెండు ఛాన్స్ లు ఇచ్చాం కదా అని ఇంకో ఛాన్స్ ఇంకొకరికి ఇవ్వొదు..మీరు ఓడిపోతేనే తెలంగాణ గెలుస్తాంది.. మోడీ అల్లం, బెల్లం అన్నాడు మోచేతికి బెల్లం పెట్టాడు అంటూ మంత్రి కేటీఆర్ పేర్కొన్నారు.
18 ఏళ్లు నిండిన మహిళలకు కూడా పెన్షన్ ఇస్తామని మంత్రి కేటీఆర్ చెప్పారు. వరి ధాన్యం ఉత్పత్తిలో తెలంగాణ దేశంలో నెంబర్ వన్ గా ఉన్నాం.. సీఎం కేసీఆర్ ను ఓడించేందుకు యోగి, బోగి, షేర్లు వస్తున్నారు.. కాంగ్రెస్, బీజేపీ వాళ్లకు టికెట్లు, బీ- ఫాంలు ఢిల్లీలో ఇస్తారు ఇక్కడ కాదు అంటూ ఆయన మండిపడ్డారు. ఆడబిడ్డల ఉసురు పోసుకున్న ఏ పార్టీ బాగుపడదు.. బీఆర్ఎస్ ప్రభుత్వం వచ్చాక తుల ఉమకు మంచి పదవి ఇప్పిస్తానని కేటీఆర్ మాట ఇచ్చారు.
చెన్నూరులో వివేక్ డబ్బులు పంచుతున్నారు.. బాల్కసుమన్ సంచలన వ్యాఖ్యలు
చెన్నూరూ నియోజకవర్గంలో మాజీ ఎంపీ, కాంగ్రెస్ నేత వివేక్ వెంకట స్వామి డబ్బులు పంచుతున్నారని ఎమ్మెల్యే బాల్క సుమన్ సంచలన వ్యాఖ్యలు చేశారు. అనంతరం మంచిర్యాల జిల్లాలో ఎన్నికల ప్రధాన అధికారి వికాస్ రాజ్ ని కలిసి వివేక్ పై ఫిర్యాదు చేశారు. చెన్నూరూ నియోజకవర్గంలో కాంగ్రెస్ అభ్యర్థి వివేక్ విచ్చవిడిగా డబ్బులు పంచుతున్నారని అన్నారు. వివేక్ పక్కన ఉన్న వారి అకౌంట్స్ లోకి డబ్బులు జమ చేస్తున్నారని సంచలన వ్యాఖ్యలు చేశారు. ఎన్ఫోర్స్ మెంట్,ఇన్కమ్ టాక్స్ వాళ్లకు పిర్యాదు చేస్తామన్నారు. అకౌంట్స్ ని ఫ్రీజ్ చేయాలని సీఈఓని కోరామన్నారు. వివేక్ కుటుంబ సభ్యుల అకౌంట్స్ పై నిఘా పెట్టాలని సీఈఓని కోరామన్నారు. పెట్రోల్, బిల్డర్స్, రైస్ మిల్స్, సిమెంట్, స్టిల్ కంపెనీల వాళ్లకు డబ్బులు హైదరాబాద్ నుంచి పంపుతున్నారని కీలక వ్యాఖ్యలు చేశారు. వివేక్ కుటుంబం చేస్తున్న పాపంలో పాలు పంచుకోవద్దని వ్యాపారులను కోరుతున్నామన్నారు.
వైసీపీ, టీడీపీ పోటాపోటీ ఆందోళన.. పాలకొల్లులో టెన్షన్ టెన్షన్
ఆంధ్రప్రదేశ్‌లో మరోసారి అధికార వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ, ప్రతిపక్ష తెలుగుదేశం పార్టీ పోటీ పోటీ ఆందోళనలతో కాకరేపాయి.. వైసీపీ, టీడీపీ ఆందోళనలతో పశ్చిమగోదావరి జిల్లా పాలకొల్లు పూలపల్లి అంబేద్కర్ విగ్రహం వద్ద ఉద్రిక్తత చోటు చేసుకుంది. టిడ్కో ఇళ్ల విషయంలో వైసీపీ, టీడీపీ పోటాపోటీ నిరసన కార్యక్రమాలకు పిలుపునివ్వడంతో పాలకొల్లులో పోలీసులు భారీగా మోహరించారు. ఇరు పార్టీలకు అనుమతి ఇవ్వకుండా ఎమ్మెల్యే రామానాయుడును, వైసీపీ ఇంఛార్జ్ గుడాల గోపి లను హౌస్ అరెస్ట్ చేశారు. అయితే ఇంటి నుండి పోలీసుల కన్నుగప్పి.. ఇంటి నుంచి బయటకు వచ్చిన ఎమ్మెల్యే రామానాయుడు.. అంబేద్కర్ విగ్రహం దగ్గరికి చేరుకొడంతో ఉద్రిక్త పరిస్థితులు చోటుచేసుకున్నాయి. పోలీసుల కళ్ళు కప్పి ఎమ్మెల్యే గాంధీ బొమ్మ సెంటర్ వద్దకు చేరుకోవడంతో టీడీపీ శ్రేణులు అక్కడికి పెద్ద ఎత్తున చేరుకున్నాయి. ఇంటి వద్ద నుండి భారీ జన సందోహం జాతీయ జెండాలతో అంబేద్కర్ విగ్రహం దగ్గరికి చేరుకోవడంతో పోలీసులు పరిస్థితిని అదుపు చేయలేకపోయారు. ఉద్రిక్త పరిస్థితుల నడుమ ఎమ్మెల్యే రామానాయుడు ను అరెస్టు చేసి పోలీస్ స్టేషన్‌కు తరలించారు.
కేసీఆర్ ఉంటే 2వేలు పెన్షన్.. కాంగ్రెస్ వస్తే 4వేలు పెన్షన్
కేసీఆర్ ఉంటే 2వేలు పెన్షన్.. కాంగ్రెస్ వస్తే 4వేలు పెన్షన్ అని టీపీసీసీ రేవంత్ రెడ్డి అన్నారు. ఆదిలాబాద్ జిల్లా బోథ్ లో రేవంత్ రెడ్డి మాట్లాడుతూ.. బలరాం నాయక్ ఎమ్మెల్యే టికెట్ ను త్యాగం చేసారని అన్నారు. బోథ్ కాంగ్రెస్ టికెట్ రాని వన్నెల అశోక్ నామినేషన్ విత్ డ్రా చేసుకోవాలని రేవంత్ రెడ్డి సూచించారు. 10 ఏళ్లలో ఆదిలాబాద్, పాలమూరు ఏం మారలేదన్నారు. గూడెంలు, తండాల్లో స్కూల్ లు లేవన్నారు. తెలంగాణలో బీఆర్ఎస్ పాలనలో బోథ్ కు నీరు ఎందుకు రాలేదు? అని ప్రశ్నించారు. ప్రసవం కోసం నరకం చూడాల్సిన పరిస్తితి ఎందుకు వచ్చింది? అని మండిపడ్డారు. సర్పంచ్ లు ఆత్మహత్యలు చేసుకుంటున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. బిల్లులు చెల్లించడం లేదన్నారు. ప్రాణహిత చేవెళ్ల ప్రాజెక్టు నిర్మాణాన్ని చేపట్టినప్పటికి.. దద్దమ్మ దయాకర్ రావ్ ఖాళీ సీసాలు అమ్ముకుంటున్నారని అంటున్నారని తెలిపారు. అన్నారం అయిపోయింది.. మేడిగడ్డ కుంగిందన్నారు. ఇసుక మీద లక్ష కోట్ల పెట్టి ప్రాజెక్టు కట్టారని మండిపడ్డారు. ఇలా కడితే ఎలా? అని ప్రశ్నించారు. కేసీఅర్ అవినీతికి మెడిగడ్డ బలైందన్నారు. బోథ్ కు నీళ్ళు రాక పోవడంకు కారణం సీఎం కేసీఆర్ అన్నారు. కుప్టి ప్రాజెక్టు పూర్తి కావాలంటే డిగ్రీ కాలేజీ రావాలంటే కాంగ్రెస్ అభ్యర్థి గెలవాలన్నారు.
గతంలో ఏ ముఖ్యమంత్రి ఈ రకమైన సాహసం చేయలేదు..
రాష్ట్రం ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా కుల గణన ప్రక్రియ ప్రారంభించింది. అంబేడ్కర్ కోనసీమ జిల్లా రామచంద్రపురం నియోజకవర్గంలోని నేలపర్తిపాడు గ్రామంలో మంత్రి చెల్లుబోయిన వేణుగోపాలకృష్ణ కులగణన కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి వేణు మీడియాతో మాట్లాడుతూ.. గతంలో ఏ ముఖ్యమంత్రి ఈ రకమైన సాహసం చేయలేదన్నారు. బీహార్‌లో కులగణన జరిగినా ఒక సామాజిక వర్గానికి మాత్రమే పరిమితమైందని. వివరించారు.కులగణన ప్రక్రియను రికార్డు స్థాయిలో పూర్తి చేస్తామన్నారు. గతంలో ఎంతోమంది కుల సంఘాల ప్రతినిధులు గత పాలకులను అడిగిన కులగణన చేపట్టలేదని.తెలిపారు. రాష్ట్రంలో అన్ని కులాల అభివృద్ధి కోసమే సమగ్ర కుల గణన చేపట్టాలని సీఎం జగన్ నిర్ణయించారని అన్నారు.
కాంగ్రెస్, బీజేపీలు బీడీ కార్మికులను పట్టించుకోలేదు
నిజామాబాద్ బీఆర్ఎస్ ప్రజా ఆశీర్వాద సభలో బీఆర్‌ఎస్ అధినేత, సీఎం కేసీఆర్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. సింగూరు నీటిని నిజాం సాగర్ కు తరలించామన్నారు. నిజామాబాద్ కు ఐటి హబ్ తెచ్చామని, కాంగ్రెస్ వస్తే భయంకర పరిస్థితులు వస్తాయన్నారు. కాంగ్రెస్, బీజేపీ లు బీడీ కార్మికులను పట్టించుకోలేదన్నారు సీఎం కేసీఆర్. 2014 తర్వాత చేరిన కొత్త బీడీ కార్మికులందరికి పింఛన్ ఇస్తామని సీఎం కేసీఆర్ హామీ ఇచ్చారు. మళ్ళీ అధికారంలోకి వస్తే అన్ని రకాల పింఛన్ల ను 5016 కు పెంచుతామన్నారు సీఎం కేసీఆర్. ముస్లిం మైనార్టీలను కాంగ్రెస్ ఓటు బ్యాంకుగా వాడుకుందన్నారు కేసీఆర్. మత కలహాలు సృష్టించిందని, హిందూ, ముస్లింలు సోదరభావంతో ఉన్నారన్నారు సీఎం కేసీఆర్. బీజేపీ మత పిచ్చితో మంటలు పెడుతోందన్నారు. వంద ఉత్తరాలు రాసినా కేంద్రం ఒక్క మెడికల్ కాలేజీ గాని నవోదయ పాఠశాల గానీ ఇవ్వలేదన్నారు. ప్రధాని మోడీ తెలంగాణ వ్యతిరేకి అని, రెండు జాతీయ పార్టీ లు తెలంగాణ ను పట్టించుకోలేదన్నారు సీఎం కేసీఆర్. 2024లో దేశంలో సంకీర్ణ సర్కారు ఖాయమన్నారు. బీఆర్ఎస్ కీలక పాత్ర పోషిస్తుందన్నారు సీఎం కేసీఆర్.
101 సంవత్సరాల వయసులో 3 స్వర్ణ పథకాలను సాధించిన విశాఖ వాసి..
ఓడిపోతానేమో అని అసలు ప్రయత్నించకపోవడం కంటే.. ప్రయత్నించి ఓడిపోవడం మేలు. సంకల్పం ఉంటె సాధించలేనిది అంటూ ఏది లేదు ఈ లోకంలో.. కావాల్సిందల్లా పోటీలో పాల్గొనాలి అనే ఆసక్తి.. అలానే మన పైన మనకు ఏదైనా సాదించగలను అనే నమ్మకం.. ఇవి రెండూ ఉంటె చాలు వయసు తో సంబంధం లేదు అని నిరూపించారు ఓ వ్యక్తి.. 101 సంవత్సరాల వయసులో ఒకటి కాదు రెండు కాదు ఏకంగా 3 స్వర్ణ పతాకాలను సాధించారు. వివారాలోకి వెళ్తే.. ఈ నెల 8 వ తేదీ నుండి 12 వ తేదీ వరకు 95 -99 ఏళ్ళ వారికి జావెలిన్ త్రో, షార్ట్ పుట్, 5 వేల మీటర్ల నడక పోటీలు నిర్వహించారు. ఈ పోటీల్లో వి. శ్రీరాములు అనే వ్యక్తి విజేతగా నిలిచి మూడు స్వర్ణ పతకాలను కైవసం చేసుకున్నారు. కాగా వి. శ్రీరాములు అనే వ్యక్తి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం లోని విశాఖపట్నం జిల్లా కి చెందిన వారు. ప్రస్తుతం ఈయన వయసు 101 సంవత్సరాలు. ఈయన గతంలో నేవి లో విధులు నిర్వహించి రిటైరు అయ్యారు. అయితే 10 పదుల వయసు పైబడిన యువతకు ఏ మాత్రం తీసుపోను అంటూ ముందుకు వెళ్తున్నారు. 101 సంవత్సరాల వయసు లోనూ అథ్లెటిక్స్ లో పాల్గొని మన దేశానికి 3 స్వర్ణపతాకాలు తీసు వచ్చారు. వయసు పైబడిన ఏ మాత్రం లెక్క చేయకుండా అథ్లెటిక్స్ లో పాల్గొని 3 స్వర్ణ పతకాలను సాధించి భారత దేశ గౌరవాన్ని పెంచినవి. శ్రీరాములుని పలువురు ప్రసంసిస్తున్నారు.
కాబోయే భర్తను పరిచయం చేసిన హీరోయిన్
హీరోయిన్ కార్తీక నాయర్.. తెరపై కనిపించి చాలా కాలం అయ్యింది. సీనియర్ నటి రాధ నట వారసురాలిగా జోష్ మూవీతో టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చింది. ఆ తర్వాత రంగం సినిమాతో సౌత్‌లో స్టార్‌డమ్ అందుకుంది. ఆ తర్వాత దమ్ము, బ్రదర్ ఆఫ్ బొమ్మాళి వంటి చిత్రాలతో అలరించింది. అయితే కార్తీక నటించిన సినిమాలు సక్సెస్ అయినా టాలీవుడ్‌లో ఆమెకు ఆఫర్స్ మాత్రం కరువయ్యాయి. దీంతో కోలివుడ్‌కు వెళ్లి అక్కడ తన లక్‌ని పరీక్షించుకుంది. అక్కడ ఆడపదడపా సినిమాలు చేస్తూ వచ్చింది. పెద్దగా ఆఫర్స్, సక్సెస్ లేకపోవడంతో నటనకు గుడ్‌బై చెప్పి ఫారిన్‌కు చెక్కేసింది. ఓ ప్రముఖ కంపెనీలో జాబ్‌లో సెటిల్ అయ్యింది. ఇక వెండితెరకు దూరమైన ఆమె గత నెల సైలెంట్‌గా ఎంగేజ్‌మెంట్ చేసుకుని తెరపైకి వచ్చింది. నిశ్చితార్థం చేసుకున్నట్టు స్వయంగా ప్రకటించిన కార్తీక.. సోషల్ మీడియాలో పలు ఫొటోలు కూడా షేర్ చేసింది. అయితే అందులో కాబోయే వాడి ఫేస్ మాత్రం రివీల్ చేయలేదు. దాంతో కార్తీక వరుడు ఎవరా అని అంతా ఆరా తీయడం మొదలు పెట్టారు. ఇక అందరికి శ్రమ ఇవ్వకుడదని అనుకుందేమో.. తాజాగా తన కాబోయే భర్తను పరిచయం చేసింది. ఈ మేరకు ఫొటో షేర్ చేసి భర్త ఫేస్‌ని రివీల్ చేసింది. ప్రస్తుతం ఈ ఫొటో సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతోంది.
విశాఖ లో దారుణం.. ప్రియురాలు వేధిస్తుందని ప్రియుడు ఆత్మహత్య..
కాలం మారింది. అమ్మాయి అబ్బాయి అని తేడా లేదు. తప్పు చేస్తే ఎవరైనా ఒకటే. ప్రేమించడం తప్పు కాదు. కానీ ప్రేమ పేరుతో వాడుకోవాలని చూస్తేనే ముప్పు. అది అమ్మాయి అయినా అబ్బాయి అయినా. పెళ్లి చేసుకునే ఉద్దేశం ఉన్నప్పుడే ప్రేమించాలి. అలా కాకుండా కాలక్షేపానికి ప్రేమిస్తే ప్రాణాలకే ముప్పు వాటిల్లుతుంది. ఇలా ప్రేమ పేరుతో వేధింపులు తాళలేక ఆత్మ హత్యలు చేసుకున్న ఘటనలు గతంలో కోకొల్లలు. తాజాగా అలాంటి ఘటనే విశాఖపట్నం జిల్లాలో చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళ్తే.. విశాఖపట్నం జిల్లా లోని గాజువాక లోని చిన గంట్యాడ శ్రీనివాస నగర్ కు చెందిన కోసనం భాస్కర్ రావు బాబీ అనే యువకుడు AVK డిగ్రీ కాలేజ్ లో ఫైనల్ ఇయర్ చదువుతున్నారు. అలానే జెమీమా అనే యువతి విజయవాడ కాలేజ్ లో నీట్ కి ప్రిపేర్ అవుతుంది. అయితే గత కొంత కాలంగా బాబీ, జెమీమా ప్రేమలో ఉన్నారు.
చంద్రబాబుకు గుండె సమస్య !
తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడుకు గుండె సమస్య ఉన్నట్లు తేలింది. చంద్ర బాబు కంటి ఆపరేషన్, హెల్త్ కండిషన్ వివరాలను హైకోర్టుకు ఆయన లాయర్లు సమర్పించారు. ‘చంద్రబాబు కుడి కంటికి శస్త్ర చికిత్స జరిగింది. ఆయన గుండె సంబంధిత సమస్యతో బాధపడుతున్నారు. చంద్రబాబు నాయుడు గుండె పరిమాణం పెరిగింది. గుండెకు రక్తం సరఫరా చేసే రక్తనాళాల్లో సమస్యలు ఉన్నాయి. తగిన విశ్రాంతి తీసుకోవాలి. మధుమేహం అదుపులో ఉంచి జాగ్రత్తలు పాటించాలి’ అని వైద్యులు చెప్పారని చంద్రబాబు లాయర్లు కోర్టుకు వివరించారు. కాగా 15 రోజుల కిందట చంద్రబాబు నాయుడు రాజమండ్రి సెంట్రల్ జైలు నుంచి విడుదలైన విషయం తెలిసిందే. జైలు నుంచి విడుదలైన తర్వాత కంటి ఆపరేషన్ చేయించుకున్న చంద్రబాబు… ప్రస్తుతం ఇంటి దగ్గర విశ్రాంతి తీసుకుంటున్నారు.
14 ఏళ్ల బాలుడిపై టీచర్ లైంగిక దాడి.. అరెస్ట్ చేసిన పోలీసులు..
అమెరికాలో విద్యార్థి-ఉపాధ్యాయుడి బంధానికి విలువ లేకుండా పోయింది. విద్యాబుద్ధులు నేర్పించాల్సిన టీచర్లే తప్పు దారి పడుతున్నారు. తమ విద్యార్థులతో అనైతిక బంధాన్ని పెట్టుకుంటున్నారు. శారీరక సుఖం కోసం విద్యార్థులను తప్పుదోవపట్టిస్తున్నారు. ఇటీవల కాలంలో ఇలాంటి సంఘటనలు చాలా వెలుగులోకి వచ్చాయి. తాజాగా మరోసారి ఇటాంటి సంఘటనే వెలుగులోకి వచ్చింది. ఓ మహిళా టీచర్, 14 ఏళ్ల విద్యార్థిపై లైంగిక వేధింపులకు పాల్పడింది. చివరకు విషయం వెలుగులోకి రావడంతో పోలీసులు ఆమెను అరెస్ట్ చేశారు.
వివరాల్లోకి వెళితే.. అమెరికాలో ఒక గైడెన్స్ కౌన్సిలర్ 2022లో 14 ఏళ్ల విద్యార్థిపై లైంగికంగా వేధించినట్లు తేలింది. న్యూయార్క్ పోస్ట్ కథనం ప్రకారం.. పెన్సిల్వేనియా మిడిల్ స్కూల్ టీచర్‌గా ఉన్న 35 ఏళ్ల కెల్లీ అన్ షుట్టే అనే మహిళ, 2022 వేసవి ప్రారంభంలో అదే స్కూల్‌లో చదువుతున్న 14 ఏళ్ల బాలుడితో అనైతిక సంబంధాన్ని పెట్టుకుంది. బాలుడిపై లైంగిక వేధింపులు, ఇతర నేరాలకు పాల్పడింది. బక్స్ కౌంటీలోని పెన్‌రిడ్జ్ సౌత్ మిడిల్ స్కూల్ లో గైడెన్స్ కౌన్సిలర్‌గా పనిచేస్తున్న సమయంలో కెల్లి, 14 ఏళ్ల వయసులో బాలుడిపై అఘాయిత్యానికి పాల్పడింది.
సూపర్ స్టార్ కృష్ణ ప్రథమ వర్థంతి.. సుధీర్ బాబు ఎమోషనల్ పోస్ట్
2022 ఘట్టమనేని కుటుంబంలో తీవ్ర విషాదాన్ని నింపింది. సూపర్ స్టార్ మహేష్ బాబు అన్నయ్య.. రమేష్ బాబు, తల్లి ఇందిరా దేవి, తండ్రి సూపర్ స్టార్ కృష్ణ నెలల వ్యవధిలోనే కన్నుమూశారు. సూపర్ స్టార్ కృష్ణ మరణం సినీ ఇండస్ట్రీనే కాదు తెలుగు రాష్ట్రాల అభిమానులను సైతం శోకసంద్రంలో ముంచింది. గతేడాది నవంబర్ 15న కృష్ణ గుండెపోటుతో మరణించిన సంగతి తెలిసిందే. నేడు ఆయన ప్రథమ వర్థంతి. ఈ సందర్భంగా టాలీవుడ్ సినీ పరిశ్రమ ఆయనను గుర్తు చేస్తుకుంటూ సోషల్ మీడియాలో పోస్టులు పెడుతున్నారు. అలాగే ఆయన అల్లుడు, హీరో సుధీర్ బాబు కృష్ణ వర్థంతి సందర్భంగా ఎమోషనల్ అయ్యాడు. ఆయనను గుర్తు చేసుకుంటూ ట్విటర్(X)లో పోస్ట్ షేర్ చేశాడు.