ఏపీలో ఉధృతంగా పిడుగులు.. ఈ జిల్లాల ప్రజలు జాగ్రత్త..!
ఓవైపు వర్షాలు, మరోవైపు ఎండలు, వడగాల్పులతో ప్రజలు ఇబ్బంది పడుతున్నారు.. అయితే, ఈ రోజు ఆంధ్రప్రదేశ్‌లో ఉధృతంగా పిడుగులు పడే అవకాశం ఉందని ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ హెచ్చరించింది.. ముఖ్యంగా శ్రీకాకుళం, మన్యం, అల్లూరి జిల్లాల్లోని ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించింది. శ్రీకాకుళంలోని ఇచ్చాపురం, కవిటి, కంచిలి, సోంపేట, మందస మండలాల్లోని ప్రజలు.. మన్యం జిల్లాలోని గుమ్మలక్ష్మీపురం, పార్వతీపురం, సాలూరు, మక్కువ, పాచిపెంట ప్రాంతాల ప్రజలు.. అల్లూరి జిల్లాలోని అనంతగిరి, అరకులోయ, జీకే వీధి, కొయ్యూరు మండల్లాలో పిడుగులు పడే అవకాశం ఎక్కువగా ఉందని వార్నింగ్ ఇచ్చారు.. అయితే, పొలాల్లో పనిచేసే రైతులు, గొర్రెల కాపరులు చెట్ల కింద ఉండరాదని సూచించారు.. బహిరంగ ప్రదేశాల్లో ఉండకపోవడమే మంచిదని సూచించారు.. ఈ సమయంలో సురక్షితమైన భవనాల్లో ఆశ్రయం పొందండి అంటూ ఆయా జిల్లాల ప్రజలకు సూచించారు ఆంధ్రప్రదేశ్ విపత్తుల నిర్వహణ సంస్థ మేనేజింగ్ డైరెక్టర్ డాక్టర్ బీఆర్ అంబేద్కర్.
ఎల్లుండి ఢిల్లీలో తెలంగాణ కాంగ్రెస్ ముఖ్య నేతలతో సమావేశం..
తెలంగాణ కాంగ్రెస్‌లో ప్రస్తుతం కొత్త ఉత్సాహం కనిపిస్తోంది. కర్ణాటక ఎన్నికల్లో ఆ పార్టీకి వచ్చిన ఫలితాలే ఇందకు కారణమని చెప్పొచ్చు.. కర్ణాటక జోష్ ను తెలంగాణలోనూ కొనసాగించాలని ఏఐసీసీ భావిస్తుంది. ఇందుకోసం వ్యూహాలను సిద్ధం చేస్తుంది. ఇందుకోసం చర్చించేందుకు ఎల్లుండి ( ఈ నెల 26న ) ఢిల్లీ రావాలని తెలంగాణ కాంగ్రెస్ ముఖ్యనేతలకు ఆ పార్టీ హైకమాండ్ నుంచి పిలుపు వచ్చింది. టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డితో పాటు ఉత్తమ్ కుమార్ రెడ్డి, జానారెడ్డి, భట్టి విక్రమార్క సహా పలువురు సీనియర నేతలు ఈ భేటీకి హాజరుకాబోతున్నారు అని టాక్. అయితే ఈ భేటీలో కాంగ్రెస్ హైకమాండ్ నేతలకు ఏ రకమైన సలహాలు ఇస్తుందనే అంశం ఆసక్తికరంగా మారింది. తెలంగాణ తాజా రాజకీయాలు.. కాంగ్రెస్ పరిస్థితి ఏ విధంగా ఉందనే దానిపై ఇప్పటికే వివిధ వర్గాల నుంచి పార్టీ హైకమాండ్ రిపోర్టులు తెప్పించుకున్నట్లు టాక్. తెలంగాణలో పార్టీ విజయం సాధించాలంటే అనేక అంశాలపై ఫోకస్ చేయాలని.. అందులో ముఖ్యంగా నేతల మధ్య సఖ్యత ఉండాలని.. నేతలంతా ఐక్యంగా ముందుకు సాగితే గెలుపు సాధ్యమవుతుందని కాంగ్రెస్ హైకమాండ్ కు నివేదికలు అందినట్టు పక్కా సమాచారం. దీంతో ఈ నెల 26న జరగబోయే సమావేశంలో నేతల మధ్య సఖ్యత కుదిర్చే అంశంపైనే ఎక్కువగా చర్చ జరిగే అవకాశం ఉంది. ఈసారి తెలంగాణలో కచ్చితంగా అధికారంలోకి రావాలని కాంగ్రెస్ ప్లాన్ చేస్తుంది. కర్ణాటక ఫలితాలు తెలంగాణకు కలిసొచ్చే అంశమని పార్టీ హైకమాండ్ బలంగా నమ్ముతోంది.
వీడిని ఏమనాలి..? లేగదూడలే టార్గెట్.. రాత్రివేళ లైంగిక దాడి..!
మహిళలపై నిత్యం ఏదో ఒక దగ్గర లైంగిక దాడులు కొనసాగుతూనే ఉన్నాయి.. పసికూనల నుంచి పండు ముసలి వరకు లైంగిక దాడులు జరుగుతోన్న ఘటనలు వెలుగు చూస్తూనే ఉన్నాయి.. పనికూనలు, చిన్నారులు, బాలికలు, యువతులు, మహిళలు, వృద్ధులు ఇలా తేడా లేకుండా మృగాళ్లు రెచ్చిపోతున్నారు.. నిందితులను అరెస్ట్ చేస్తున్నా.. కఠిన శిక్షలు పడుతున్నా.. ఈ దారుణాలు కొనసాగుతూనే ఉన్నాయి.. ఇక, మూగ జీవాలు, పశువులు, పెంపుడు జంతువులపై కూడా లైంగిక దాడులకు సంబంధించిన ఘటలు బయటకు వస్తున్నాయి. తాజాగా, ఆంధ్రప్రదేశ్‌లో మరో దారుణమైన వ్యహారం వెలుగు చూసింది.. శ్రీ సత్య సాయి జిల్లా పుట్టపర్తి మండల పరిధిలోని రాచువారిపల్లిలో పశువులపై లైంగిక దాడికి పాల్పడుతున్నాడో వ్యక్తి.. రాత్రి వేళల్లో లేగదూడలపై లైంగిక దాడికి పాల్పడుతున్నట్లు గ్రామస్తులు గుర్తించారు.. ఇదేం పనిరా? అంటూ మందలించినందుకు మాపై దాడికి కూడా పాల్పడ్డాడంటూ కొందరు స్థానికులు, రైతులు పుట్టపర్తి రూరల్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. వారి ఫిర్యాదుతో కేసు నమోదు చేసిన పుట్టపర్తి రూరల్ పోలీసులు.. దర్యాప్తు చేపట్టారు.
అత్యంత “దుర్భరమైన దేశం”గా జింబాబ్వే.. ఇండియా ర్యాంక్ ఎంతంటే..?
ప్రపంచంలోనే అత్యంత దుర్భరమైన దేశంగా ఆఫ్రికా దేశం జింబాబ్వే తొలి స్థానంలో నిలిచింది. ప్రఖ్యాత ఆర్థికవేత్త స్టీవ్ హాంకే వార్షిక మిజరీ ఇండెక్స్ (HAMI) ప్రకారం జింబాబ్వే ఈ తొలిస్థానంలో నిలిచింది. యుద్ధంతో దెబ్బతిన్న ఉక్రెయిన్, సిరియా, సూడాన్ వంటి దేశాలను దాటుకుని జింబాబ్వే ఈ అగౌరవ స్థానంలో నిలిచింది. ద్రవ్యోల్భణం, పెరుగుతున్న నిత్యావసర రేట్లతో ఆ దేశ ప్రజలు తీవ్రంగా ఇబ్బందిపడుతున్నారు. ద్రవ్యోల్భణం 243.8 శాతానికి చేరుకుంది. మొత్తం ప్రపంచంలోని 157 దేశాలపై ఈ ర్యాకింగ్స్ వెల్లడించారు. అధికి నిరుద్యోగం, ద్రవ్యోల్భనం, అధిక రుణరేట్లు, ప్రజల్లో రక్త హీనత ఇలా జింబాబ్వేను కుదిపేస్తున్నాయి. జింబాబ్వే తర్వాత 15 స్థానాల్లో వరసగా వెనిజులా, సిరియా, లెబనాన్, సూడాన్, అర్జెంటీనా, యెమెన్, ఉక్రెయిన్, క్యూబా, టర్కీ, శ్రీలంక, హైతీ, అంగోలా, టోంగా, ఘనా దేశాలు ఉన్నాయి. ఈ ఇండెక్స్ ప్రకారం యూరప్ దేశం స్విట్జర్లాండ్ అత్యంత మెరుగైన స్థితిలో ఉంది. HAMI ఇండెక్స్ లో అతి తక్కువ స్కోర్ కలిగి ఉంది. రెండో సంతోషకరమైన దేశంగా కువైట్ నిలిచింది. ఆ తరువాత స్థానాల్లో ఐర్లాండ్, జపాన్, మలేషియా, తైవాన్, నైజర్, థాయిలాండ్, టోగో, మాల్టా దేశాలు ఉన్నాయి. ఈ జాబితాలో ఇండియా 103వ స్థానంలో ఉంది. ఇండియాలో నిరుద్యోగం ఈ ర్యాంకుకు కారణమవుతోంది. అమెరికా ఈ జాబితాలో 134వ స్థానంలో, వరల్డ్ హ్యపీనెస్ రిపోర్ట్ లో వరసగా ఆరేళ్లుగా ప్రపంచంలో తొలిస్థానంలో ఉన్న ఫిన్లాండ్ ఈ దేశంలో 109వ స్థానంలో ఉంది. నిరుద్యోగం, ద్రవ్యోల్భణం, బ్యాంకు వడ్డీరేట్లు, తలసరి వాస్తవ జీడీపీ అంశాల ఆధారంగా ఈ రిపోర్టును రూపొందించారు.
“రన్నింగ్ చేస్తే తీవ్రమైన అలర్జీ”.. అరుదైన జబ్బుతో బాధపడుతున్న మహిళ..
కెనడాకు చెందిన ఓ మహిళ అత్యంత అరుదైన జబ్బుతో బాధపడుతోంది. ఏదైనా వ్యాయామం చేస్తే ఒళ్లంతా తీవ్రమైన అలర్జీతో బాధపడుతుంది. ఇదిలా ఉంటే ఇటీవల ఫ్లైట్ ఎక్కేందుకు సమయం అయిపోతుండటంతో ఎయిర్ పోర్టులో పరిగెత్తి ప్రాణాలు మీదకు తెచ్చుకుంది. దాదాపుగా చనిపోయే స్థితికి చేరుకుంది. వివరాల్లోకి వెళితే కెనడాకు చెందిన 27 ఏళ్ల మహిళ డివ్ మంగత్ తన సోదరి, స్నేహితులతో కలిసి డొమెనికన్ రిపబ్లిక్ వెళ్లేందుకు ఫ్లైట్ బుక్ చేసుకుంది. అయితే ఫైట్ ఎక్కేందుకు టెర్మినల్ లో పరిగెత్తింది. దీంతో ఆమె సివియర్ రియాక్షన్ ఎదుర్కొంది. ఆమె గేట్ వరకు చేరుకున్న సమయంలో ఆమె ఒంటిపై దద్దుర్లు, ముఖం, పెదాలు వాచాయి. అలర్జీ కారణంగా శ్వాసతీసుకునేందుకు కూడా ఇబ్బందులు ఎదుర్కొంది. వెంటనే స్పందించిన ఎయిర్ పోర్ట్ సిబ్బంది యాంటి హిస్టామైన్ ట్యాబ్లెట్లు అందించారు. అవి కూడా పనిచేయలేదు. చివరకు ఎపిపెన్ ను తీసుకోవడంతో లక్షణాలు తగ్గాయి. కొన్ని నెలలుగా పరిగెత్తిన ప్రతీసారి, ఒత్తడికి గురైనప్పుడల్లా తన శరీరంపై విపరీతంగా దద్దర్లు వస్తున్నట్లు సదరు మహిళ వెల్లడించింది. ఇప్పటికే దీని చికిత్స కోసం చాలా ఆస్పత్రులకు వెళ్లానని ఆమె చెప్పింది. వైద్యులు చెబుతున్న దాని ప్రకారం.. మంగత్ తీవ్రమైన అనాఫిలాక్సిస్ తో బాధపడుతున్నట్లు తెలిపారు. దీనికి చికిత్సగా ఎపినెఫ్రన్ అనే ఇంజెక్షన్ ను ఉపయోగిస్తుంటారు. వ్యాయామం వల్ల కలిగిగే అనాఫిలాక్సిస్, శారీరక శ్రమ ఎక్కువ అయినప్పుడు కనిపించే ఓ అరుదైన జబ్బుగా తెలిపారు. ఈ అలర్జీ వల్ల చర్మంపై దద్దుర్ల, పెదవులు వాపు, వికారం, వాంతులు, తీవ్రమైన సందర్భాల్లో రక్తపోటు, అనాఫిలాక్టిక్ షాక్ కు కారణం అవుతుంది.
పాస్‌వర్డ్ షేర్ చేస్తున్నారా? ఇక అంతే..!
ఓటీటీ సర్వీసు అందుబాటులోకి వచ్చిన తర్వాత.. కొందరు పాస్‌వర్డ్ షేరింగ్ చేసుకుంటున్నారు.. కొత్త సినిమాలు వచ్చినప్పుడు కానీ, ఇతర కార్యక్రమాలు చూసేందుకు గానీ, ఫ్రెండ్స్‌కు, బంధువులకు, తెలిసినవారికి షేర్ చేయడం చేస్తున్నారు.. అయితే, అలాంటి వారికి బ్యాడ్ న్యూస్ చెప్పింది నెట్‌ఫ్లిక్స్.. ప్రముఖ స్ట్రీమింగ్ టెలివిజన్ సర్వీస్ పాస్‌వర్డ్ షేరింగ్‌పై తన అణిచివేతను విస్తరిస్తున్నందున మీరు త్వరలో మీ బెస్ట్ ఫ్రెండ్ నెట్‌ఫ్లిక్స్ ఖాతా నుండి తొలగించబడతారు. స్ట్రీమింగ్ టెలివిజన్ సేవలో ఆదాయాన్ని పెంచుకోవడానికి, వినియోగదారులు మరొకరితో పాస్‌వర్డ్‌లను పంచుకుంటే.. అదనండగా చెల్లించాల్సి ఉంటుందని నెట్‌ఫ్లిక్స్ తెలిపింది. “నెట్‌ఫ్లిక్స్ ఖాతా అనేది ఒక కుటుంబానికి ఉపయోగపడుతుంది” అని కంపెనీ ఒక ప్రకటనలో తెలిపింది. నెట్‌ఫ్లిక్స్ పాస్‌వర్డ్‌ను భాగస్వామ్యం చేయడానికి ఎల్లప్పుడూ వ్యతిరేకం కాదు మరియు వాస్తవానికి చాలా అనుకూల పాస్‌వర్డ్ షేరింగ్‌గా ఉపయోగించబడింది. మార్చి 2017లో, “ప్రేమ పాస్‌వర్డ్‌ను పంచుకోవడం” అని ప్రముఖంగా ట్వీట్ చేసింది. అయితే, ఇప్పుడు పాస్‌వర్డ్ అరువుపై పరిమితులు మరియు కొత్త యాడ్-సపోర్టెడ్ ఆప్షన్‌తో సహా డబ్బు సంపాదించడానికి కొత్త మార్గాలను వెతుకుతోంది ఆ సంస్థ.. 100 మిలియన్లకు పైగా కుటుంబాలు ఖాతాలను పంచుకుంటున్నాయని నెట్‌ఫ్లిక్స్ గత సంవత్సరం తెలిపింది. ఇది కొత్త టీవీ మరియు చిత్రాలలో పెట్టుబడి పెట్టగల మా సామర్థ్యాన్ని ప్రభావితం చేస్తుంది అని పేర్కొంది. ఇది ఖాతా భాగస్వామ్యాన్ని పరిమితం చేయబోతోందని మరియు కొన్ని మార్కెట్లలో వివిధ విధానాలను పరీక్షిస్తున్నట్లు పేర్కొంది. దీంతో.. అదనపు నెట్‌ఫ్లిక్స్ స్లాట్ కోసం చెల్లింపులు చేయాల్సి ఉంటుంది.. యునైటెడ్ స్టేట్స్, బ్రిటన్, ఫ్రాన్స్, జర్మనీ, ఆస్ట్రేలియా, సింగపూర్, మెక్సికో మరియు బ్రెజిల్‌తో సహా 103 దేశాలు మరియు భూభాగాల్లోని వినియోగదారులకు ఖాతా భాగస్వామ్యం గురించి ఈ-మెయిల్‌లను పంపుతున్నట్లు నెట్‌ఫ్లిక్స్ తెలిపింది. ఈ-మెయిల్ ప్రకారం, నెట్‌ఫ్లిక్స్ ఖాతాను ఒక ఇంటిలో మాత్రమే ఉపయోగించాలి. చెల్లించే కస్టమర్ వారి ఇంటి వెలుపల సభ్యుడిని జోడించాలనుకుంటే, వారు అదనపు రుసుము చెల్లించాలి.
‘బ్రో’.. నీ స్పీడుకు బ్రేకుల్లేవ్ ఇక
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ప్రస్తుతం వరుస సినిమాలతో బిజీగా మారిన సంగతి తెల్సిందే. ఒక సినిమా తరువాత ఒక సినిమా చేస్తూ.. త్వరత్వరగా సినిమాలను ఫినిష్ చేస్తున్నాడు. ఇప్పటికే ఉస్తాద్, బ్రో షూటింగ్స్ లో బిజీగా ఉన్న పవన్ తాజాగా హరిహర వీరమల్లు షూటింగ్ ను కూడా మొదలుపెట్టనున్నట్టు వార్తలు వినిపిస్తున్నాయి. డైరెక్టర్ క్రిష్ దర్శకత్వంలో పీరియాడికల్ డ్రామాగా తెరకెక్కుతున్న చిత్రం హరిహర వీరమల్లు. ఏఎం రత్నం ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్న ఈ చిత్రంలో నిధి అగర్వాల్ హీరోయిన్ గా నటిస్తోంది. ఇప్పటికే ఈ సినిమా నుంచి రిలీజ్ అయిన పోస్టర్స్, ఫస్ట్ గ్లింప్స్ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకున్నాయి. దాదాపు 80 శాతం షూటింగ్ ను పవన్ పూర్తి చేశాడు. క్లైమాక్స్ మాత్రమే బాకీ ఉన్నట్లు తెలుస్తుంది. ఇక ఆ క్లైమాక్స్ ను పూర్తిచేయడానికి పవన్ రెడీ అయ్యాడట. కొన్ని నెలలు వీరమల్లు కు గ్యాప్ ఇచ్చి.. ఉస్తాద్, బ్రో ను పట్టాలెక్కించిన పవన్.. జూన్ లో వీరమల్లు క్లైమాక్స్ లో అడుగుపెట్టనున్నాడట. జూన్ మొదటి వారంలో హైదరాబాద్లోని ఓ ఫేమస్ స్టూడియోలో వేసిన సెట్లో హరిహర వీరమల్లు కొత్త షెడ్యూల్ మొదలుకానున్నదట. క్లైమాక్స్ కాబట్టి యాక్షన్ సన్నివేశాలు మెండుగా ఉండనున్నాయని టాక్. దాదాపు పది రోజులు ఈ షూటింగ్ జరగనున్నదట. ఇక ఈ వార్త తెలియడంతో పవన్ అభిమానులు పవన్ స్పీడ్ కు ముగ్దులైపోతున్నారు. ‘బ్రో’.. నీ స్పీడుకు బ్రేకుల్లేవ్ ఇక అంటూ కామెంట్స్ పెడుతున్నారు. మరి హరిహర వీరమల్లుతో డైరెక్టర్ క్రిష్ మళ్లీ హిట్ ట్రాక్ ఎక్కుతాడో లేదో చూడాలి.
నా అండర్ వేర్ చూడాలని, వారికి చూపించమని డైరెక్టర్ వేధించాడు..
అమెరికా కోడలు, గ్లోబల్ బ్యూటీ ప్రియాంక చోప్రా గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. నిక్ జోనాస్ ను వివాహమాడిన ఈ బ్యూటీ ప్రస్తుతం హాలీవుడ్ లో సెటిల్ అయ్యింది. ఈ మధ్యనే సిటాడెల్ సిరీస్ తో ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఈ సిరీస్ అంతాగా విజయాన్ని అందుకోలేకపోయినా అమ్మడికి మాత్రం బాగానే పేరు వచ్చింది. ముఖ్యంగా పెళ్లి తరువాత కూడా బోల్డ్ సీన్స్ లో నటించి మెప్పించి ఔరా అనిపించింది. ఇక ఏ హీరోయిన్ అయినా కెరీర్ మొదట్లో కొన్ని చేదు అనుభవాలను ఎదుర్కోక తప్పదు. వాటిని ఆ హీరోయిన్ స్టార్ అయ్యాకా.. మీడియా ముందు చెప్పడం సాధారణమే. తాజాగా ప్రియాంక కూడా ఓకే ఇంటర్వ్యూలో తాను కూడా క్యాస్టింగ్ కౌచ్ బాధితురాలినే అని చెప్పుకొచ్చింది. తనను కూడా డైరెక్టర్లు వేధించారని, ఆ అవమానాన్ని తట్టుకోలేక సినిమాను వదిలేసినట్లు తెలిపింది. తాజాగా ఒక ఇంటర్వ్యూలో ప్రియాంక తన గతం తాలూకు జ్ఞాపకాలను నెమరువేసుకుంది. ” 2002 లో నేను ఒక సినిమా ఒప్పుకున్నాను. అది ఒక యాక్షన్ ఫిల్మ్. దానికోసం చాలా కష్టపడ్డాను. అయితే ఆ సినిమాలో బోల్డ్ సీన్స్ ఉంటాయని డైరెక్టర్ చెప్పాడు. ఒక అండర్ కవర్ పురుషుడును తాను టెంప్ట్ చేయాలనీ, అందుకోసం లో దుస్తులు వేసుకోవాలని చెప్పుకొచ్చాడు. ఆ సన్నివేశం ముందు తాను చూడాలని కోరాడు. మొదట ఆ సన్నివేశం కోసం లేయర్ దుస్తులు ధరించాలని అనుకున్నాను. కానీ ఆ లేయర్ ఉండకుండా అండర్ వేర్ మాత్రమే ఉండాలని, అలానే ప్రేక్షకులకు చూపించాలని.. లేకపోతే ఏ ప్రేక్షకుడు సినిమా చూస్తాడు అని నా స్టైలిస్ట్ ముందు చెప్పాడట. ముందు ఆ అండర్ వేర్ సీన్ ను తన ముందు చేయాలనీ కోరాడట. అది విన్న నాకు చాలా అవమానకరంగా అనిపించింది. ఇతరుల తృప్తికోసం నన్ను సాధనంలా వాడుకోవడం ఏంటి అని వాపోయాను. అందుకే ఆ సినిమాను మధ్యలోనే ఆపేశాను. అప్పటివరకు నా షూటింగ్ కు అయిన ఖర్చు మొత్తం వెనక్కి ఇచ్చేశాను” అని చెప్పుకొచ్చింది. ప్రస్తుతం ఈ వ్యాఖ్యలు నెట్టింట వైరల్ గా మారాయి. ఇక పీసీని ఇబ్బంది పెట్టిన ఆ డైరెక్టర్ ఎవరు అని నెటిజన్లు ఆరాలు తీయడం మొదలుపెట్టారు.