చంద్రబాబు పర్యటనలో టెన్షన్ టెన్షన్.. వైసీపీ, టీడీపీ శ్రేణుల రాళ్ల దాడులు
టీడీపీ అధినేత చంద్రబాబు పర్యటనలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి.. అన్నమయ్య జిల్లా కురబలకోట మండలం అంగళ్లు కూడలిలో చంద్రబాబును అడ్డుకునే ప్రయత్నం చేశారు వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు.. చంద్రబాబు ముందే వైసీపీ, టీడీపీ శ్రేణుల మధ్య ఘర్షణలు చోటు చేసుకున్నాయి.. చంద్రబాబు గో బ్యాక్ అంటూ వైసీపీ నినాదాలు చేయగా.. దీంతో, వైసీపీ, టీడీపీ నేతల మధ్య పరస్పరం దాడులకు దారితీసింది.. రాళ్లతో ఇరువర్గాలు దాడులు చేసుకున్నారు.. రంగ ప్రవేశం చేసిన పోలీసులు ఇరువర్గాలను చెదరగొట్టే ప్రయత్నం చేశారు.. ఈ దాడుల్లో టీడీపీతో పాటు, వైసీపీ శ్రేణులకు కూడా గాయాలయ్యాయని చెబుతున్నారు.. పోలీసులు లాఠీఛార్జ్ చేయాల్సిన పరిస్థితి వచ్చింది. ఇక, అంగళ్లు వద్ద కారు దిగిపోయారు చంద్రబాబు.. ఆయన సమక్షంలోనే టీడీపీ కార్యకర్తలపై వైసీపీ కేడర్ రాళ్లదాడి చేసినట్టు తెలుస్తోంది.. అయితే, వైసీపీ కార్యకర్తలను తరిమికొట్టాలంటూ చంద్రబాబు మైక్‌లో చెప్పారని.. దీంతో, వైసీపీ కేడర్‌ను టీడీపీ శ్రేణులు తరిమినట్టుగా చెబుతున్నారు.. ఈ ఘటనకు సంబంధించిన మరింత సమాచారం తెలియాల్సి ఉంది.
రాహుల్ గాంధీని చూసి వారికి భయం పట్టుకుంది.. అందుకే ఈ కుట్రలు
మోడీ ఇంటి పేరు పరువు నష్టం కేసులో కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీకి భారీ ఊరట లభించింది. పరువు నష్టం కేసులో రాహుల్ గాంధీకి రెండేళ్ల జైలు శిక్ష విధిస్తూ సూరత్ సెషన్స్ కోర్టు ఇచ్చిన తీర్పుపై ఇవాళ (శుక్రవారం) సుప్రీంకోర్టు స్టే విధించింది. కాగా, దీనిపై తెలంగాణ మాజీ పీసీసీ చీఫ్, నల్గొండ ఎంపీ ఉత్తమ్ కుమార్ రెడ్డి స్పందించారు. రాహుల్ గాంధీ పరువు నష్టం కేసులో సుప్రీంకోర్టు నిర్ణయాన్ని స్వాగతిస్తున్నానని ఆయన పేర్కొన్నారు. తుది తీర్పులో కూడా సరైన నిర్ణయం వస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు. మోడీ ఇంటి పేరు పరువు నష్టం దావా కేసులో సుప్రీంకోర్టు చారిత్రాత్మక నిర్ణయం తీసుకుందని ఉత్తమ్ కుమార్ రెడ్డి అన్నారు.
అమ్మో ఆర్టీసి బస్సులో పాము.. ప్రయాణికులు షాక్
సాధారణంగా వర్షాకాలంలో పాములు తమ ఆవాసాలను వదిలి.. జనావాసాల్లోకి వెళ్తుంటాయి. ఇలాంటి ఘటనలు ఈ మధ్యకాలంలో ఎక్కువగానే జరుగుతున్నాయి. ఇళ్లల్లోకి, బైకుల్లో, కారు ఇంజిన్‌లలో, బస్సుల్లో ఎక్కడపడితే, అక్కడ పాములు కనిపిస్తుంటాయి. వీటి వల్ల జనాలు తీవ్రంగా భయబ్రాంతులకు గురి అవుతారు. అయితే, సేమ్ ఇలాంటి ఘటన ఒకటి నిర్మల్ జిల్లాలో జరిగింది. రోడ్డుపై ప్రయాణిస్తున్న ఓ బస్సులో నుండి వెరైటీ సౌండ్స్ రావడంతో.. అవి ఎక్కడ నుంచి వస్తున్నాయోనని చూడగా.. అక్కడ కనిపించిన విజువల్స్ ను చూసి ప్రయాణీకులు ఒక్కసారిగా జడుసుకున్నారు. అంతే!.. బస్సు ఆపి.. భయంతో పరుగులు తీశారు. ఈ ఘటన నిర్మల్ జిల్లా కుంటాల మండలం ఓల గ్రామం దగ్గర జరిగింది. బైంసా నుంచి నిర్మల్ వెళ్తున్న ఆర్టీసి బస్సులో ఈ నాగుపాము కనిపించింది. దీంతో ప్రయాణికులు ఆరవడంతో అప్రమత్తమైన డ్రైవర్.. నర్సాపూర్ గ్రామం దగ్గర బస్సును నిలిపివేసి పాము కోసం గాలింపు చర్యలు చేపట్టారు. కండక్టర్ వెనుక సీట్లో పాము నక్కి ఉండటంతో జావేద్ అనే ప్రయాణికుడు ధైర్యం చేసి ఆ పామును హతమార్చాడు. అంతా మంచికే జరిగిందని.. ఒకవేళ మార్గం మద్యలో ఎవరిపైనైనా పాము దాడి చేసి ఉంటే ఎంత ప్రమాదం జరిగేదో అంటూ నిర్మల్ చేరేంత వరకు ప్రయాణికులు మాట్లాడుకున్నారు. కాగా, ఆ బస్సులోని ఓ ప్రయాణీకుడు ఈ తతంగం మొత్తం వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేయగా.. ప్రస్తుతం అది వైరల్ అవుతుంది.
ట్రోలింగ్ కూడా మంచి చేసింది.. జాబ్ ఆఫర్ వచ్చింది..
భారత్‌కు చెందిన ఏక్తా అనే యువతి కెనడాలో బయోటెక్నాలజీ విభాగంలో విద్యాభ్యాసం చేస్తోంది.. అయితే, ఆ యువతి తన స్నేహితులతో సరదా గడిపేందుకు భయటకు వెళ్లింది.. అదే సమయంలో ఏక్తాకు ఓ యుట్యూబర్ ఎదురయ్యాడు.. సదరు విద్యార్థినిని ప్రశ్నించారు. మీ పేరు? ఎక్కడ నుంచి వచ్చారు? కెనడాకు ఎందుకు వచ్చారు? ఏం చదువుతున్నారు? అంటూ ఏక్తాపై ప్రశ్నల వర్షం కురిపించాడు.. అయితే, యూట్యూబర్ ఇక్కడికి ఎందుకు వచ్చారు? అనే ప్రశ్నకు స్పందించిన ఏక్తా.. భారత్‌ను వదిలి రావడం నా కల’ అంటూ సమాధానం ఇచ్చారు.. అంటే, బాగా చదువుకుని కెనడాలో వ్యాపార వేత్తగా స్థిరపడాలని అనుకుంటున్నాని చెప్పారు. కానీ, ఆమె సమాధానంపై నెటిజన్లు మండిపడ్డారు.. స్వదేశాన్ని వదిలేయడం నీ డ్రీమా అంటూ ట్రోలింగ్ చేశారు.. ఆమెపై రకరకాలుగా కామెంట్లు పెట్టారు.. కానీ, ఆ ట్రోలింగే ఆ విద్యార్థినికి జాబ్ ఆఫర్ తెచ్చిపెట్టింది.. అదేలా అంటే.. సోషల్ మీడియాలో ట్రోలింగ్‌పై ట్రూల్ కాలర్ సీఈవో అలాన్ మామెడి రియాక్ట్ అయ్యారు.. బయటి ప్రపంచం ఏమంటుందో వాటిని నువ్వు వినొద్దు అని ట్వీట్ చేశారు.. అంతేకాదు.. చదువు పూర్తి చేసిన తర్వాత ప్రపంచంలో ఎక్కడి నుంచైనా ట్రూ కాలర్ కార్యాలయంలో పనిచేసేందుకు స్వాగతం అంటూ జాబ్ ఆఫర్ ఇచ్చేశారు. మామెడి ట్వీట్‌ను పరిశీలిస్తే.. మీరు ఆమె మాటల్ని అపార్ధం చేసుకున్నారు.. ట్రోలింగ్ చేయడం సరికాదు.. అని హితవుపలికారు.. నిన్ను ఎగతాళి చేస్తున్న వారిని గురించి అస్సలు పట్టించుకోవద్దు అంటూ ఏక్తాకు ధైర్యాన్ని చెప్పిన ఆయన.. నువ్వు కూల్‌గా ఉండు. నీ కలల్ని నెరవేర్చుకునే దిశగా.. వాటితోనే కలిసి జీవిస్తున్నావు అని పేర్కొన్నాడు. అంతేకాదు.. మొదట చదువు పూర్తి చేయండి.. ట్రూ కాలర్‌లో పనిచేసేందుకు మిమ్మల్ని స్వాగతిస్తున్నా అంఊ తన ట్వీట్టర్‌లో రాసుకొచ్చారు ట్రూల్ కాలర్ సీఈవో అలాన్ మామెడి.. మొత్తంగా ఓకే మాటతో ట్రోలింగ్ కావడమే కాకుండా.. జాబ్ ఆఫర్ కూడా తెచ్చిపెట్టిందన్నమాట..
జూనియర్స్ మాటవినలేదని విచక్షణ కోల్పోయిన సీనియర్
ముంబై సమీపంలోని థానే బందోర్కర్ కళాశాలలో తను చెప్పిన పని చేయలేదన్న నెపంతో ఎనిమిది మంది జూనియర్ విద్యార్థులని జోరువానలో బురద నీటిలో.. తల నీటిలో పెట్టించి.. చేతులు వెన్నకి కట్టి.. విద్యార్థుల బ్యాక్‌పై విచక్షణ రహితంగ కర్రతో చితకబాదాడు.. వరుసగా విద్యార్థులను వంగోబెట్టి ఇష్టం వచ్చినట్టుగా కొట్టాడు.. అయితే, ఈ దృశ్యాలను మరో విద్యార్థి.. కిటికీలో నుంచి వీడియో చిత్రీకరించాడు.. ఆ తర్వాత సోషల్ మీడియాలో పోస్ట్ చేయడంతో.. ఈ ఘటన వెలుగు చూసింది.. అంతేకాదు.. క్షణాల్లో వైరల్‌గా మారిపోయింది ఆ వీడియో.. ఇక, ఈ విషయం పైన స్పందించిన కళాశాల ప్రిన్సిపాల్ సుచిత్ర నాయక్, ఆ వీడియోలో కొడుతున్నట్టు కనిపిస్తున్న వ్యక్తి సీనియర్ విద్యార్థే.. కానీ, NCC హెడ్ లేదా ఉపాధ్యాయులు కారని స్పష్టం చేశారు.. అంతేకాదు.. ఆ విద్యార్థి మానసిక పరిస్థితి బాగాలేక అల ప్రవర్తించాడని అతని మీద చర్యలు తీసుకుంటామని ఇంతకముందు ఇలాంటివి ఎన్నడూ జరగలేదని.. ఇకపై ఎప్పుడు జరగవని హామీ ఇచ్చారు. ఎవరూ భయాందోళనకు గురికావొద్దని సూచించారు.
బీర్ తాగుతూ.. బికినీలో తడి అందాలతో రెచ్చగొడుతున్న హాట్ బ్యూటీ..
అమీ జాక్సన్ పేరు అందరికి తెలిసే ఉంటుంది.. విక్రమ్ ఐ సినిమా నుంచి రోబో సినిమా వరకు నటించిన సినిమాలు మంచి టాక్ ను అందుకున్నాయి.. బ్రిటిష్ పిల్ల అయిన తెలుగు అభిమానులు ఎక్కువే.. ఆమె అందం నటనతో ఎంతో మంది యువకుల హృదయాలను కొల్లగొట్టింది.. తక్కువ కాలంలోనే స్టార్ హీరోలతో నటించింది..మతిపోగోట్టే సోయగాలు, క్యూట్ నటనతో ఆకట్టుకుంది.. అయితే సోషల్ మీడియాలో ఎంత యాక్టివ్ గా ఉంటుందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు.. రోజుకో యాంగిల్ చూపిస్తూ కుర్రకారకు మతి పోగొడుతుంది.. తాజాగా షేర్ చేసిన ఫోటోలు నెట్టింట తెగ వైరల్ అవుతున్నాయి.. అమీ జాక్సన్ ఎవడు, 2.0, ఐ చిత్రాలలో నటించిన సంగతి తెలిసిందే. రజనీకాంత్ సరసన శంకర్ దర్శకత్వంలో నటించిన 2.0 చిత్రమే అమీ జాక్సన్ చివరి చిత్రం.. ఆ తర్వాత వేరే సినిమాలో కనిపించలేదు.. పెళ్లికి ముందే తల్లి అవ్వడం, పెళ్లి జరగడంతో సినిమాలకు దూరంగా ఉంది… ఇటీవల అమీ జాక్సన్ కేన్స్ ఫిలిం ఫెస్టివల్ లో మెరుపులు మెరిపిస్తూ బ్లాక్ డ్రెస్ లో దర్శనం ఇచ్చిన సంగతి తెలిసిందే. తాజాగా అమీ జాక్సన్ బికినీలో మెరుపులు మెరిపించింది.. ఇప్పుడు గ్లామర్ డోస్ తో పాటు ఈసారి ఇంకాస్త ఘాటుగా బోల్డ్ గా ఇచ్చిన ఫోజులు నెట్టింట వైరల్ అవుతున్నాయి. కొంతమంది నెటిజన్లు అమీ జాక్సన్ ఫోజులపై మండిపడుతున్నారు.. కామెంట్స్ తో నెటిజన్లు రచ్చ చేస్తున్నారు..
భోలా శంకర్ ప్రీ రిలీజ్ ఈవెంట్ అక్కడే
మెగాస్టార్ చిరంజీవి హీరోగా నటిస్తున్న భోళా శంకర్ సినిమా రిలీజ్ డేట్ దగ్గరకు వచ్చేసింది. మరో వారంలో ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు వచ్చేస్తోంది. మెహర్ రమేష్ దర్శకత్వం వహించిన ఈ భోళా శంకర్ సినిమా నుంచి రిలీజ్ అయిన ప్రమోషనల్ స్టఫ్ అంతా అంచనాలను మరింత పెంచింది. ఇక ఈ క్రమంలో ‘భోళా శంకర్’ సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్ డేట్, టైమ్, ఎక్కడ జరగనుంది అనే వివరాలను సినిమా యూనిట్ వెల్లడించింది. భోళా శంకర్ ప్రీ రిలీజ్ ఈవెంట్ ఆగస్టు 6వ తేదీన సాయంత్రం 6 గంటలకు ఈ ఈవెంట్ మొదలవుతుందని చెబుతున్నారు. హైదరాబాద్‍లోని శిల్పకళావేదికలో జరగనున్న ఈ ఈవెంట్ కి సినిమా టీమ్ అంతా హాజరు కానుంది. ఈ ఈవెంట్ ను ఎక్స్ క్లూజివ్ గా ఎన్టీవీ లైవ్ టెలీ కాస్ట్ చేయనుంది. ఈ వివరాలను ఈ సినిమాను నిర్మిస్తున్న ఏకే ఎంటర్‌టైన్‍మెంట్స్ వెల్లడిస్తూ “మెగా సెలెబ్రేషన్లకు టైమ్ వచ్చేసింది, ఆగస్టు 6వ తేదీన సాయంత్రం 7 గంటల నుంచి హైదరాబాద్‍లోని శిల్పకళావేదికలో గ్రాండ్ భోళాశంకర్ ప్రీ రిలీజ్ సెలెబ్రేషన్స్ జరగనున్నాయి” అని ఏకే ఎంటర్‌టైన్‍మెంట్స్ అయితే తాజాగా ట్వీట్ చేసింది. తమిళ మూవీ వేదాళంకు తెలుగు రీమేక్‍గా భోళా శంకర్ సినిమా రూపొందిందగా చిరంజీవి సరసన తమన్నా హీరోయిన్‍గా నటించింది. చిరంజీవి చెల్లెలి పాత్రను కీర్తి సురేశ్ పోషించగా, సుశాంత్ అతిథి పాత్రలో నటించారు. భోళా శంకర్ సినిమాలో రఘుబాబు, మురళీ శర్మ, రవిశంకర్, వెన్నెల కిశోర్, తులసి కీలక పాత్రలలో నటించారు. ఏకే ఎంటర్‌టైన్‍మెంట్స్ బ్యానర్ పై రాంబ్రహ్మం సుంకర, అనిల్ సుంకర నిర్మించిన ఈ సినిమాకి మహతీ స్వరసాగర్ సంగీతాన్ని అందించారు. మార్తాండ్ కె వెంకటేష్ ఎడిటింగ్ బాధ్యతలు నిర్వర్తించగా డడ్లీ సినిమాటోగ్రాఫర్‌గా వ్యవహరించారు.
వీజే సన్నీ ‘సౌండ్ పార్టీ’కి ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత
వీడియో జాకీ అంటే అదేనండీ యాంకర్ గా కెరీర్ మొదలు పెట్టిన సన్నీ సీరియల్స్ లో అనేక పాత్రలు పోషించి బిగ్ బాస్ ద్వారా మంచి క్రేజ్ సంపాదించాడు. ఇక ఈ మధ్య అన్ స్టాపబుల్ మూవీతో అలరించిన ఆయన ఇప్పుడు ‘సౌండ్ పార్టీ’ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వస్తున్నాడు. ఫుల్ మూన్ మీడియా ప్రొడక్షన్స్ బ్యానర్ పై, ప్రొడక్షన్ నెం. 1గా తెరకెక్కుతున్న ఈ సినిమాలో వి.జె సన్నీ హీరోగా, హ్రితిక శ్రీనివాస్ హీరోయిన్ గా నటిస్తున్నారు. రవి పోలిశెట్టి, మహేంద్ర గజేంద్ర, శ్రీ శ్యామ్ గజేంద్ర నిర్మాతలుగా పేపర్ బాయ్ డైరెక్టర్ జయ శంకర్ సమర్పణలో ఈ సినిమా రిలీజ్ అవుతోంది. సంజయ్ శేరి దర్శకుడుగా తెరకెక్కుతున్న ఈ సినిమా షూటింగ్ కార్యక్రమాలు పూర్తి చేసుకుని ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనులు శరవేగంగా జరుపుకుంటోంది. ఈ సినిమాకి సంబంధించిన పోస్టర్ ను తాజాగా ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత ఆవిష్కరించారు. ఈ సందర్భంగా కల్వకుంట్ల కవిత మాట్లాడుతూ సౌండ్ పార్టీ టైటిల్, పోస్టర్ ఎంతో ఇంట్రస్టింగ్ గా ఉన్నాయని, కాన్సెప్ట్ కూడా ఎంతో ఎంటర్టైనింగ్ గా ఉండబోతున్నట్లు టైటిల్ చూస్తే అర్థమవుతోందని అన్నారు. ఈ సినిమా ఘన విజయం సాధించి దర్శక నిర్మాతలకు , నటీనటులకు, సాంకేతిక నిపుణులకు మంచి పేరు రావాలని కోరుకుంటున్నా అని ఆమె అన్నారు. ఇక హీరో వీజే సన్ని మాట్లాడుతూ మా సౌండ్ పార్టీ సినిమా పోస్టర్ ఎమ్మెల్సీ కవిత లాంచ్ చేయడం ఎంతో ఆనందంగా ఉందని అన్నారు. ఇప్పటికే విడుదల చేసిన టైటిల్ కు మంచి రెస్పాన్స్ వచ్చిందని, షూటింగ్ అంతా పూర్తయిందని అన్నారు. సినిమా అనుకున్న దానికన్నా చాలా బాగా వచ్చిందని ఆయన అన్నారు. శివన్నారాయణ, అలీ, సప్తగిరి, థర్టీ ఇయర్స్ పృథ్వి, ‘మిర్చి’ ప్రియ, మాణిక్ రెడ్డి, అశోక్ కుమార్, కాదంబరి కిరణ్, ‘జెమిని’ సురేష్, ఇంటూరి వాసు, చలాకి చంటి, వంటి వారు ఈ సినిమాలో నటిస్తున్నారు.
ఎన్టీఆర్ తో నటించడం కోసం ఏడాది పాటు సినిమాలకు దూరంగా ఉన్న హాట్ బ్యూటీ..
జాన్వీ కపూర్ ఈ భామ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు.ఈ భామ శ్రీదేవి వారసురాలు గా ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చింది.ఈమె ఇప్పటి వరకు బాలీవుడ్ సినిమాలలో నటించి తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపు సంపాదించింది.తెలుగు లో ఎన్టీఆర్ హీరో గా నటిస్తున్న దేవర సినిమా తో హీరోయిన్ గా పరిచయం కాబోతుంది. ఈ సినిమా పై ఇప్పటికే భారీ అంచనాలు వున్నాయి.. కొరటాల శివ ఈ సినిమాను పక్కా యాక్షన్ ఎంటర్టైనర్ గా తెరకెక్కించబోతున్నారు. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ శరవేగంగా జరుగుతుంది.తాజాగా ఇంటర్వ్యూలో పాల్గొన్న జాన్వీ కపూర్ దేవర సినిమా గురించి పలు ఆసక్తికరమైన విషయాలను తెలియజేశారు. ఎన్టీఆర్ సినిమా కోసం తాను ఏడాది పాటు సినిమాల కు దూరంగా ఉండాలని నిర్ణయించు కున్నట్లు జాన్వీ తెలియజేశారు. ఎన్టీఆర్ తో సినిమా చేయాలని జాన్వీ కపూర్ ఎప్పటి నుంచో ఎదురు చూస్తున్నారట.అయితే దేవర సినిమా ప్రకటించిన సమయంలో ఈ సినిమా లో అవకాశం పొందాలని జాన్వీ కపూర్ ఎంతగానో కోరుకున్నారట. ఈ క్రమంలోనే తాను ఏడాది పాటు సినిమాలకు దూరంగా ఉంటే ఈ సినిమా లో చేసే ఛాన్స్ తనకే వస్తుందని భావించి ఏడాది పాటు సినిమాలకు దూరంగా ఉండాలని నిర్ణయం తీసుకున్నట్టు ఆమె తాజాగా వెల్లడించారు. అయితే ఈమె కోరుకున్నట్టుగానే దేవర సినిమాలో అవకాశం రావడంతో ఎంతో సంతోషం గా ఉంది అని ఆమె తెలియజేశారు. ఇక ప్రస్తుతం ఈమె బాలీవుడ్ లో కూడా పలు సినిమాల లో నటిస్తూ బిజీ గా ఉన్నారు. ఎన్టీఆర్ దేవర సినిమా షూటింగ్ లో కూడా ఈ భామ ఎంతో బిజీ గా ఉంది.. ఇలా కెరియర్ పరంగా ఎంతో బిజీగా ఉన్న జాన్వీ కపూర్ సోషల్ మీడియాలో కూడా ఎంతో యాక్టీవ్ గా ఉంటూ ఎప్పటికప్పుడు తన హాట్ గ్లామరస్ ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేస్తూ తన అభిమానులను ఎంతగానో ఆకట్టుకుంటుంది.