సీఎం జగన్‌కు రాఖీ కట్టిన మహిళా మంత్రులు, ఎంపీలు, నేతలు
తెలుగు రాష్ట్రాల్లో రక్షా బంధన్ సంబరాలు మొదలయ్యాయి.. కొందరు ఈ రోజే రాఖీ పండుగు జరుపుకుంటున్నారు.. తమ తోబుట్టువులకు రాఖీలు కడుతున్నారు. శుభాకాంక్షలు చెబుతున్నారు.. దీంతో.. రాఖీ షాపులు, స్వీట్ షాపులు కలకలలాడుతున్నాయి.. మరోవైపు.. ఎక్కువ ప్రాంతాల్లో రేపు రాఖీ పండుగ జరుపుకుంటున్నారు. స్కూళ్లు కూడా రేపు సెలవు గా ప్రకటించాయి.. మొదట ఈ నెల 30న రక్షా బంధన్ సెలవుగా ప్రకటించిన ప్రభుత్వం.. ఆ తర్వాత రేపటికి ఈ నెల 31కి పోస్ట్‌ఫోన్ చేసింది.. ఇక, ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్‌రెడ్డికి రాఖీలు కట్టి అభినందనలు తెలిపారు మహిళా మంత్రులు తానేటి వనిత, విడదల రజని, పలువురు మహిళా ఎంపీలు, ఎమ్మెల్యేలు, ప్రజాప్రతినిధులు.. ఇక, రాఖీ పౌర్ణమి సందర్భంగా ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్ రెడ్డి మహిళా లోకానికి శుభాకాంక్షలు తెలిపారు. ప్రతి అక్కకు, ప్రతి చెల్లెమ్మకు రాఖీ పౌర్ణమి శుభాకాంక్షలు అంటూ సోషల్ మీడియా వేదికగా ఓ పోస్ట్ పెట్టారు.. వారు చూపుతున్న ప్రేమాభిమానాలకు సదా కృతజ్ఞతుడినని అన్నారు. మహిళల సంక్షేమమే లక్ష్యంగా.. వారి రక్షణే ధ్యేయంగా పాలన సాగిస్తున్నందుకు సంతోషిస్తున్నానని తెలిపారు సీఎం జగన్.. ఒక అన్నగా, ఒక తమ్ముడిగా ఎప్పుడూ అండగా ఉంటానని మాట ఇస్తున్నట్లు పేర్కొన్నారు ఏపీ సీఎం వైఎస్ జగన్మోహన్‌రెడ్డి.
అమరావతి భూములపై సీఐడీ కేసు.. తీర్పు రిజర్వ్ చేసిన హైకోర్టు
అమరావతి అసైన్డ్ భూముల వ్యవహారంలో సీఐడీ కేసులపై తీర్పు రిజర్వ్ చేసింది ఆంధ్రప్రదేశ్ హైకోర్టు.. అసైన్డ్ భూముల్లో అవకతవకలకు పాల్పడ్డారని చంద్రబాబు, మాజీ మంత్రి నారాయణపై సీఐడీ కేసులు నమోదు చేసిన విషయం విదితమే కాగా.. సీఐడీ కేసులపై గతంలోనే స్టే ఇచ్చింది ఏపీ హైకోర్టు.. తుది విచారణలో భాగంగా ఇరు వర్గాల వాదనలు విన్న ఏపీ హైకోర్టు.. ఈ రోజు తీర్పు రిజర్వ్ చేస్తూ ఆదేశాలు జారీ చేసింది..
జనసేనకు షాక్.. సీఎం జగన్ సమక్షంలో వైసీపీలో చేరిన కీలక నేత..!
సార్వత్రిక ఎన్నికలకు సమయం దగ్గర పడుతోన్న సమయంలో.. ఆంధ్రప్రదేశ్‌లో సత్తా చాటాలని ప్రయత్నిస్తున్న జనసేన పార్టీకి షాక్ తగిలింది.. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్‌రెడ్డి సమక్షంలో.. వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరారు జనసేన నేత రాయపురెడ్డి ప్రసాద్ అలియాస్ చిన్నా.. వైసీపీ కండువా కప్పి రాయపురెడ్డి ప్రసాద్‌ని పార్టీలోకి ఆహ్వానించారు సీఎం వైఎస్ జగన్.. 2019 సార్వత్రిక ఎన్నికల్లో రాజానగరం అసెంబ్లీ నియోజకవర్గ నుంచి జనసేన అభ్యర్ధిగా బరిలోకి దిగిన ప్రసాద్.. ఈ ఎన్నికల్లో ఓటమి పాలయ్యారు.. ఇక, ఈ రోజు సీఎం జగన్ సమక్షంలో వైసీపీ తీర్థం పుచ్చుకున్నారు రాయపురెడ్డి ప్రసాద్ అలియాస్ చిన్నా.. ఈ కార్యక్రమంలో మంత్రి చెల్లుబోయిన వేణు, ఎమ్మెల్యే జక్కంపూడి రాజా, వైసీపీ యువజన నేత జక్కంపూడి గణేష్ తదితరులు పాల్గొన్నారు.
ప్రభుత్వ వ్యతిరేకత కాంగ్రెస్ కి కలిసి వస్తుంది..
రెండు నెలలు తిరగక ముందే ఇచ్చిన ఐదు హామీల్లో నాల్గింటిని కర్ణాటక ప్రభుత్వం అమలు చేస్తుంది అని నల్గొండ ఎంపీ ఉత్తమ్ కుమార్ రెడ్డి అన్నారు. వచ్చే నెల నుండి యువనిది స్కీమ్ అమలు చేస్తాం.. హిమాచల్ ప్రదేశ్ లో గెలిచిన వెంటనే ఓల్డ్ పెన్షన్ స్కీమ్ అమలు చేసామని ఆయన పేర్కొన్నారు. తెలంగాణలో కూడా ఉద్యోగుల డిమాండ్ మేరకు ఓల్డ్ పెన్షన్ స్కీమ్ అమలు చేస్తామని చెప్పారు. తెలంగా ణలో ఇప్పుడు ఒక వ్యక్తికి ఒక కిలో బియ్యం బీఆర్ఎస్ ప్రభుత్వం ఇస్తుంటే మిగతా 5 కిలోలు కేంద్ర ప్రభుత్వం ఇస్తుంది అని ఉత్తమ్ కుమార్ రెడ్డి తెలిపారు. తెలంగాణలో దళిత ముఖ్యమంత్రి, డబుల్ బెడ్రూమ్, 3 లక్షల అన్నారని ఉత్తమ్ కుమార్ రెడ్డి అన్నారు. కేజీ టూ పీజీ అమలు చేయలేదు.. ముస్లింలకి 12 శాతం రిజర్వేషన్లు ఏమైంది.. దళిత గిరిజనలకు 3 ఎకరాలు అమలు చేయలేదు.. ఉచిత ఎరువులు అమలు చేయలేదు అని ఆయన ఆరోపించారు. రాహుల్ గాంధీ నేతృత్వంలో చెప్పిన మాట నిలబెట్టుకుంటున్నాం.. తెలంగాణలో మేము అధికారంలోకి వస్తామనే నమ్మకం ఉంది అని ఉత్తమ్ చెప్పుకొచ్చారు. ఇంత దిగజారుడు, దోపిడీ ప్రభుత్వాన్ని నేను 30 ఏళ్ళ ఎమ్మెల్యే గా ఎప్పుడు చూడలేదు అని తెలిపారు.
ఏంటి.. నేను వచ్చిన మీటింగ్ కు మీరు రారా..
జనగామ జిల్లాలోని స్టేషన్ ఘనపూర్ ఎమ్మెల్యే రాజయ్య ప్రజా ప్రతినిధులపై తీవ్ర అసహనం వ్యక్తం చేశారు. ఇన్ని రోజులు తన వెంట ఉన్న వారు లింగాల గణపురం మండలం కేంద్రంలో జరిగిన షాదీ ముబారక్, కళ్యాణ లక్ష్మీ చెక్కుల పంపిణీ కార్యక్రమంలో హాజరు కాకపోవడం వారిపై ఆయన పరోక్షంగా చురకలాంటించారు. వివారాల్లోకి వెళ్తే.. లింగాల గణపురం మండలంలో షాది ముబారక్, కళ్యాణ లక్ష్మీ చెక్కుల పంపిణీ కార్యక్రమానికి స్థానిక ప్రజా ప్రతినిధులు హాజరు కాకపోవడంతో ఎమ్మెల్యే తాటికొండ రాజయ్య ఆగ్రహం వ్యక్తం చేశాడు. గత కొద్ది సంవత్సరాలుగా ప్రజా జీవితంలో అందరం కలిసి పని చేశామని ఎమ్మెల్యే తాటికొండ రాజయ్య అన్నారు. మళ్లీ మనం ప్రజా జీవితంలో ప్రజల్లోకి వెళ్లాలంటే కచ్చితంగా ప్రజాహిత కార్యక్రమాల్లో పాల్గొనాలి.. ఏదో జరగబోయేది ఊహించుకోకండి, అనేక మార్పులు చేర్పులు ఉంటాయని ఆయన చెప్పుకొచ్చారు. మీరందరూ ప్రజాక్షేత్రంలో ఉండాలి తప్పకుండా మిమ్మల్ని అందరిని కాపాడడానికి నేను ప్రజాక్షేత్రంలోనే ఉంటాను అని రాజయ్య పేర్కొన్నారు.
గంధపు చెక్కల స్మగ్లర్ ఎన్‌కౌంటర్..
కర్ణాటకలో గంధపు చెక్కల స్మగ్లర్లు, ఫారెస్ట్ గార్డులకు మధ్య ఎన్‌కౌంటర్ జరిగింది. ఈ ఎన్‌కౌంటర్ లో ఒక స్మగ్లర్ మృతిచెందాడు. బెంగళూర్ సమీపంలోని బన్నెరఘట్ట నేషనల్ పార్కులో ఎర్రచందనం స్మగ్లర్లు, ఫారెస్టు గార్డులకు బుధవారం తెల్లవారుజామున 1.30 గంటల ప్రాంతంలో ఎన్‌కౌంటర్ జరిగింది. తెల్లవారుజామున పెట్రోలింగ్ చేస్తున్న ఫారెస్ట్ గార్డులకు చెట్లను నరుకుతున్న శబ్ధం వినిపించింది. దీంతో అలర్ట్ అయిన అధికారులు స్మగ్లర్లను లొంగిపోవాల్సిందిగా కోరారు. కాగా స్మగ్లర్లు దాడికి తెగబడటంతో, అధికారులు కాల్పులు జరిపారు. ఈ ఎన్‌కౌంటర్ లో కోలార్ జిల్లా మలూరుకు చెందిన తిమ్మప్ప (40)అనే స్మగ్లర్ మరణించాడు. బెంగళూర్ రూరల్ ఎస్పీ మల్లికార్జున్ బాల్డండి మాట్లాడుతూ.. స్మగ్లర్లు, ఫారెస్ట్ గార్డులపై కొడవళ్లతో దాడికి ప్రయత్నించారని, దీంతో ఆత్మరక్షణకు జరిపిన కాల్పుల్లో ఒక స్మగ్లర్ మరణించాడని, రెండో స్మగ్లర్ తప్పించుకున్నట్లు వెల్లడించారు. ఈ ఎన్‌కౌంటర్ లో అటవీ సిబ్బందికి ఎలాంటి గాయాలు కాలేదని తెలిపారు.
యూపీ సీఎం కీలక ప్రకటన.. కన్యా సుమంగళ యోజన రూ.10 వేలు పెంపు!
రక్షాబంధన్ శుభ సందర్భంగా ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ ముఖ్యమంత్రి కన్యా సుమంగళ యోజన మొత్తాన్ని పెంచుతున్నట్లు ప్రకటించడం ద్వారా రాష్ట్రంలోని ఆడపిల్లలకు భారీ కానుకను అందించారు. బుధవారం లోక్‌భవన్‌లో ముఖ్యమంత్రి కన్యా సుమంగళ యోజన పథకం లబ్ధిదారులను ఉద్దేశించి ముఖ్యమంత్రి మాట్లాడుతూ.. 2024-25 ఏడాది నుంచి డబుల్ ఇంజన్ ప్రభుత్వం కన్యా సుమంగళ పథకాన్ని ఆర్థికంగా రూ.15,000 నుండి రూ.25,000కి పెంచబోతోందని చెప్పారు. దీనివల్ల రాష్ట్రంలోని ఆడబిడ్డలు తమ కలలను సాకారం చేసుకోవడంతోపాటు చదువుతో పాటు స్వావలంబన సాధించడం సులభతరం అవుతుందన్నారు. సీఎం యోగి మాట్లాడుతూ.. ఈ పథకం కింద తొలుత ఆరు దశల్లో రూ.15 వేల ప్యాకేజీ ఇచ్చామన్నారు. ‘‘వచ్చే ఏడాది నుంచి కూతురు పుట్టిన వెంటనే ఆమె తల్లిదండ్రుల ఖాతాకు రూ. 5వేలు.. అదే విధంగా కూతురికి ఏడాది నిండితే మొదటి తరగతిలో చేరగానే రూ.2 వేలు బదిలీ చేస్తారు. ఆరో తరగతిలో చేరినప్పుడు రూ.3000, తొమ్మిదో తరగతిలో చేరినప్పుడు రూ. 3,000, ఇంటర్ అయిపోయిన తర్వాత రూ. 5,000, గ్రాడ్యుయేట్, డిప్లొమా లేదా సర్టిఫికేట్ కోర్సును అభ్యసిస్తే రూ. 7,000 మొత్తం ఆమె ఖాతాకు బదిలీ చేయబడుతుందని సీఎం యోగి ఆదిత్యనాథ్ వెల్లడించారు. ఈ పథకం ద్వారా నేడు రాష్ట్రంలో 16.24 లక్షల మంది ఆడపిల్లలు లబ్ధి పొందుతున్నారని ముఖ్యమంత్రి తెలిపారు.
దగ్గు, గొంతునొప్పి ఇబ్బంది పెడుతున్నాయా?.. ఈ సింపుల్ టిప్స్ మీ కోసమే..
వర్షాకాలం, చలికాలం అంటే దగ్గు, జలుబు కామన్.. ఎంతగా జాగ్రత్తలు తీసుకున్నా కూడా అవి వస్తాయి.. ఒకసారి వస్తే తగ్గడం కూడా కష్టమే..మందులకు అస్సలు తగ్గవు.. ఇక దగ్గు జలుబు తగ్గాలంటే మన ఇంటి చిట్కాలు చాలా ఎఫెక్టివ్ గా పనిచేస్తాయి… ఇంటి చిట్కాలతో ఎలా జలుబు, దగ్గును తగ్గించుకోవాలో ఇప్పుడు తెలుసుకుందాం.. మారిన వాతావరణం వల్ల గానీ,సరైన పోషక విలువలు లేని ఆహారం తీసుకోవడం వల్ల గానీ, పని ఒత్తిడి వల్లగానీ ప్రతి ఒక్కరికి చిన్న చిన్న ఆరోగ్య సమస్యలు తలెత్తుతుంటాయి.ప్రతి ఆరోగ్య సమస్యకు మందులు వాడడం వలన ఎన్నో సమస్యలను ఎదుర్కోవాల్సి వస్తుంది. అలాకాకుండా మనకు ప్రకృతిలో దొరికే సహజసిద్దమైన మన ఇంట్లోనే లభించే కొన్ని పదార్దాలను ఉపయోగించి ఈ సమస్యలను తగ్గించుకోవచ్చు..దగ్గు, ఛాతీ నొప్పితో బాధపడుతున్నప్పుడు ప్రతిరోజు ఉదయం మూడు కప్పుల నీళ్లల్లో రెండు తమలపాకులు, నాలుగు మిరియాలు వేసి సగం అయ్యేవరకు నీటిని మరిగించి అందులో ఒక టీస్పూను తేనె కలుపుకుని తాగాలి.. దానిమ్మ తొక్కలను పొడి చేసి ఉదయాన్నే ఒక గ్లాసు నీటిలో ఒక టీస్పూను పొడి కలిపి తీసుకుంటే రక్త శుద్ది జరుగుతుంది.. తులసి ఆకులను తేనెను కలిపి తీసుకున్నా మంచి ఉపశమనం కలుగుతుంది.. ఉప్పు నీరు ఒక యాంటీ బాక్టీరియల్, యాంటీవైరల్ ద్రావణంగా పనిచేసి శ్లేష్మం క్లియర్ చేయటానికి సహాయపడి గొంతు అసౌకర్యాన్ని కూడా తగ్గిస్తుంది.. వెచ్చని నీళ్లను తీసుకోవడం వల్ల గొంతు సమస్యలు కూడా తగ్గిపోతాయి.. అలాగే జలుబు నుంచి ఉపశమనం కలుగుతుంది.. అల్లం టీ కూడా మంచిదే.. మీరు ఒక్కసారి ట్రై చెయ్యండి.. రిజల్ట్ మీకే తెలుస్తుంది..
మరోసారి వాయిదా పడిన భైరవ ద్వీపం మూవీ రీ రిలీజ్..
నటసింహం నందమూరి బాలకృష్ణ నటించిన ఆల్ టైం క్లాసిక్ మూవీ భైరవ ద్వీపం రీ రిలీజ్ కోసం ఎంతగానో ఎదురు చూసిన అభిమానులకు మరోసారి బిగ్ షాక్ తగిలింది.. ఆగస్ట్ 30 న అనగా నేడు ప్రేక్షకుల ముందుకు రావాల్సి అయితే ఉంది.కానీ ఇప్పుడీ మూవీ రీ రిలీజ్ ను ఏకంగా నవంబర్ కు వాయిదా వేశారని సమాచారం.అడ్వాన్స్ బుకింగ్స్ చాలా దారుణంగా ఉండటంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తుంది.దాదాపు 29 ఏళ్ల క్రితం విడుదల అయి సంచలన విజయం సాధించిన భైరవ ద్వీపం సినిమా మళ్లీ 4కే క్వాలిటీతో ప్రేక్షకుల ముందుకు తీసుకురావాలని అయితే భావించారు. మొదట ఈ సినిమాను ఆగస్టు 5 న విడుదల చేయాలనీ భావించారు. కానీ కొన్ని కారణాల వల్ల ఆగస్ట్ 30న రీ రిలీజ్ చేస్తున్నట్లు అనౌన్స్ చేశారు. కానీ ఆశించిన మేర అడ్వాన్స్ బుకింగ్స్ రాకపోవడంతో ఈసారి కూడా రీరిలీజ్ ను వాయిదా వేయాల్సి వచ్చింది.
త్రిషకు కులపిచ్చి.. ఒక హీరో ఆమెను తాకరాని చోట తాకినా.. నటి సంచలన వ్యాఖ్యలు
స్టార్ హీరోయిన్ త్రిష కృష్ణన్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. తెలుగు, తమిళ్ భాషల్లో ఆమె గురించి తెలియని సినీ ప్రేక్షకుడు ఉండడు అంటే అతిశయోక్తి కాదు. 4 పదుల వయస్సులో కూడా ఆమె తన అందంతో కుర్ర హీరోయిన్లకు చెమటలు పట్టిస్తుంది అని చెప్పాలి. ఇక ప్రస్తుతం వరుస సినిమాలతో బిజీగా ఉన్న త్రిష గురించి మరో కోలీవుడ్ నటి మీరా మిథున్ సంచలన కామెంట్స్ చేసింది. మీరా గురించి చాలామందికి తెలుసు. కోలీవుడ్ లో చిన్న చిన్న పాత్రలు చేస్తూ.. బిగ్ బాస్ కు వెళ్లి అక్కడ వివాదాలు పెట్టుకొని బయటకు వచ్చింది. ఇక గతంలో కూడా త్రిషపై సంచలన వ్యాఖ్యలు చేసింది. త్రిషకు కులపిచ్చి అని, ఆమె వలన తాను చాలా సినిమాలను పోగొట్టుకున్నాను అని విమర్శించి టాక్ ఆఫ్ ది టౌన్ గా మారింది. ఇక అదే మీరా.. ఇప్పుడు త్రిషపై పాజిటివ్ గా మాట్లాడం చూసి అభిమానులు షాక్ అవుతున్నారు. తాజాగా ఆమె ఒక ఇంటర్వ్యూలో త్రిష ఎదుర్కున్న ఒక చేదు అనుభవాన్ని తెలిపింది. ” ఒక సినిమాలో నేను.. త్రిష కలిసి పనిచేశాం. ఒక సీన్ షూట్ చేసేటప్పుడు ఆ సినిమాలో నటిస్తున్న ఒక నటుడు త్రిషను తాకకూడని చోట.. పదేపదే తాకుతున్నాడు. అది చూసి నాకు ఒళ్లు మండింది. త్రిష కూడా చాలా ఇబ్బందిగా ఫీల్ అయ్యింది. అయినా కూడా ఆమె సైలెంట్ గా నిలబడింది. ఎక్కడ అరిస్తే సినిమాలో ఛాన్స్ పోతుందో అని.. స్టార్ హీరోయిన్లకే ఇలాంటి బాధలు తప్పలేదు. మాలాంటి వారు ఎంత” అని చెప్పుకొచ్చింది. అయితే ఒకప్పుడు నెగెటివ్ గా మాట్లాడిన ఆమె గురించి ఇలా పాజిటివ్ గా మాట్లాడం వెనుక కారణం ఏంటి.. ? అని కొందరు అంటుండగా.. ఇంకొందరు మాత్రం .. ఏ విషయంలో వారికి బేధాభిప్రాయాలు ఉన్నా.. అమ్మాయిలు ఈ విషయంలో కలిసి ఉంటారు అని చెప్పుకొస్తున్నారు. ప్రస్తుతం మీరా మిథున్ వ్యాఖ్యలు నెట్టింట వైరల్ గా మారాయి.
బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ సిరీస్ ను వదులుకున్న చిరు.. అది కనుక చేసి ఉంటేనా
సాధారణంగా ప్రతి సినిమాను ఒకే హీరో చేయడం సాధ్యంకాదు. ఇక హీరోలు సైతం తమకు సెట్ అయ్యేవి.. మాత్రమే తీసుకుంటూ ఉంటారు. ఇండస్ట్రీలో ఇలా చాలామంది హీరోలు.. ఎన్నో మంచి కథలను వదులుకున్నారు. ఇప్పటికే నేషనల్ అవార్డును సొంతం చేసుకున్న పుష్ప సినిమాను మొదట మహేష్ బాబు చెయ్యాల్సి ఉండగా.. తనకు సెట్ కాదని మహేష్ చెప్పడంతో సుకుమార్ .. ఆ కథను అల్లు అర్జున్ వద్దకు తీసుకెళ్లాడని తెలిసిందే. ఇక ఇప్పుడు మెగాస్టార్ చిరంజీవి.. ఒక బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ సిరీస్ ను చేజేతులారా వదిలేసుకున్నాడని తెలుస్తోంది. చిరు రీ ఎంట్రీ ఖైదీ నెం 150 తరువాత ఆయనను బాలీవుడ్ స్టార్ డైరెక్టర్స్ రాజ్ అండ్ డీకే కలిసి.. ది ఫ్యామిలీ మ్యాన్ కథను వినిపించారట. అప్పుడు చిరు నో చెప్పడంతో ఆ కథ మనోజ్ భాజ్ పాయ్ వద్దకు వెళ్ళింది. ఈ సిరీస్ రిలీజ్ అయ్యి ఎంతటి బ్లాక్ బస్టర్ హిట్ ను అందుకుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. నేషనల్ మాత్రమే కాకుండా ఇంటర్నేషనల్ లెవల్లో మంచి హిట్ ను సొంతం చేసుకుంది. ఈ విషయం ఇప్పటివరకు ఎవరికి తెలియదు. తాజాగా నిర్మాత అశ్వినీదత్ ఒక ఇంటర్వ్యూలో ఈ విషయాన్ని బయటపెట్టాడు. “నేను చేసిన మంచి ప్రయత్నం.. గొప్ప ప్రయత్నం.. కానీ, వర్క్ అవుట్ అవ్వలేదు. అదేంటంటే.. రాజ్ అండ్ డీకే, ది ఫ్యామిలీ మ్యాన్ చిరు కోసం చేసింది. ఖైదీ నెం 150 హిట్ అయ్యాక ఈ కథను నేను చిరు దగ్గరకు తీసుకెళ్ళాను. ఆయన ఫ్యామిలీ మ్యాన్ లో కూతురు, కొడుకు అంటున్నారు కదా అని ఆలోచినారు. దానికి కావాలంటే పిల్లలను తీసేద్దాం అని కూడా వారు చెప్పారు కానీ, చిరుయూ ఎందుకనో అంత ఎక్కలేదు.. పక్కన పెట్టేశారు. అప్పుడు అది ఓటిటీ లో రిలీజ్ అయ్యి ఇంటర్నేషనల్ లెవెల్లో హిట్ అయ్యింది. అది కనుక మెగాస్టార్ చేసి ఉంటే ఇంకెక్కడో ఉండేది” అని చెప్పుకొచ్చాడు.
ఒంటరిగా ఉన్న మగాడ్ని రెచ్చగొట్టిన దెయ్యం.. తరువాత ఏమైంది?
వర్సటైల్ యాక్టర్ వేణు తొట్టెంపూడి డిజిటల్ ఎంట్రీ ఇస్తున్న వెబ్ సిరీస్ “అతిథి” స్ట్రీమింగ్ డేట్ ఫిక్స్ అయింది. ప్రముఖ ఓటీటీ కంపెనీ డిస్నీ ప్లస్ హాట్ స్టార్ స్పెషల్స్ గా ఈ వెబ్ సిరీస్ ను రూపొందించారు. ఇటీవల డిస్నీ ప్లస్ హాట్ స్టార్ నుంచి వచ్చిన సేవ్ ది టైగర్స్, సైతాన్, దయ వంటి సిరీస్ లు సూపర్ హిట్స్ అయిన నేపథ్యంలో “అతిథి”పై ప్రేక్షకుల్లో మంచి ఎక్స్ పెక్టేషన్స్ ఏర్పడుతున్నాయి. ఈ వెబ్ సిరీస్ ను రాండమ్ ఫ్రేమ్స్ ఎంటర్ టైన్ మెంట్ బ్యానర్ పై దర్శకుడు భరత్ వైజీ డైరెక్ట్ చేయగా ప్రముఖ దర్శకుడు ప్రవీణ్ సత్తారు షో రన్నర్ గా వ్యవహరిస్తున్నారు. తాజాగా “అతిథి” వెబ్ సిరీస్ స్ట్రీమింగ్ డేట్ ను డిస్నీ ప్లస్ హాట్ స్టార్ ప్రకటించింది. సెప్టెంబర్ 19 నుంచి “అతిథి” వెబ్ సిరీస్ స్ట్రీమింగ్ కానున్నట్టు వెల్లడించారు. నిజానికి ఇటీవల రిలీజ్ చేసిన “అతిథి” వెబ్ సిరీస్ ఫస్ట్ లుక్ ఇంట్రెస్ట్ క్రియేట్ చేయగా తాజాగా డేట్ అనౌన్స్ మెంట్ సందర్భంగా టీజర్ రిలీజ్ చేయగా అది కూడా జనాల్లో ఇంట్రెస్ట్ పెంచేలా ఉంది. ఈ టీజర్ లో భారీ వర్షంలో తడిసి పోయి ఓ అర్ధరాత్రి ఇంటికి వచ్చిన మహిళకు ఆతిథ్యం ఇస్తాడు హీరో వేణు. ఆ తర్వాత వారి మధ్య సాన్నిహిత్యం పెరుగడం ఇంతలో ఆమె భయంకరంగా బిహేవ్ చేయడంతో టీజర్ ఆసక్తికరంగా ముగుస్తుంది. ఒక్క మాటలో చెప్పాలంటే టీజర్ “అతిథి” వెబ్ సిరీస్ పై మరింత ఇంట్రెస్ట్ క్రియేట్ చేస్తోందని చెప్పక తప్పదు.