అదే నా ఆశ.. ఆకాంక్ష!
నూతన మార్గదర్శకాలతో, ఇనుమడించిన ఉత్సాహంతో మనం ముందుకు సాగాలన్నదే తన ఆశ, ఆకాంక్ష అని సీఎం చంద్రబాబు అన్నారు. తెలుగుదేశం పార్టీ పరీక్షల్ని ఎదుర్కొన్న ప్రతిసారీ విజేతగానే నిలిచిందన్నారు. గడచిన ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ విశ్వరూప సందర్శనం చరిత్రలో నిలిచిపోతుందని పేర్కొన్నారు. మహానాడు సందర్భంగా పార్టీ కార్యకర్తలు, నాయకులు, అభిమానులకు టీడీపీ అధినేత, ముఖ్యమంత్రి చంద్రబాబు ఎక్స్ వేదికగా శుభాకాంక్షలు తెలిపారు. మరికాసేపట్లో మా తెలుగు తల్లికి గీతాలాపనతో మహానాడు లాంఛనంగా ప్రారంభమవుతుంది.
పాక్ ఆర్మీ చీఫ్ అసిమ్ మునీర్‌పై టర్కీ అధ్యక్షుడు ప్రశంసలు
పాకిస్థాన్ ప్రధాని షెహబాజ్ షరీఫ్, ఆర్మీ చీఫ్ అసిమ్ మునీర్ నాలుగు దేశాల పర్యటనలో ఉన్నారు. ఇక టర్కీ రాజధాని అంకారాలో ఆర్మీ చీఫ్ అసిమ్ మునీర్‌కు టర్కీ అధ్యక్షుడు ఎర్డోగన్ ప్రత్యేకంగా స్వాగతం పలికారు. ఈ సందర్భంగా ఆయన్ను అభినందించారు. ఈ సందర్భంగా రెండు దేశాల మధ్య సంబంధాలు పెంచుకోవాలని ఆకాంక్షించారు. పాక్ ఆర్మీ చీఫ్ అసిమ్ మునీర్ రెచ్చగొట్టే ప్రసంగం చేసిన తర్వాతే ఏప్రిల్ 22న పహల్గామ్ ఉగ్ర దాడి జరిగింది. మతం పేరుతో 26 మందిని ఉగ్రవాదులు చంపేశారు. అనంతరం భారత్.. పాకిస్థాన్‌పై కఠిన నిర్ణయాలు తీసుకుంది. సింధు జలాలు నిలిపేసింది. వీసాలను రద్దు చేసింది. అటారీ సరిహద్దు నిలిపేసింది. అనంతరం మే 7న ఆపరేషన్ సిందూర్ చేపట్టింది. ఈ ఘటనలో 100 మంది ఉగ్రవాదులు హతమయ్యారు. అనంతరం పాకిస్థాన్-భారత్ మధ్య ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ఈ నేపథ్యంలో పాకిస్థాన్‌కు టర్కీ ఆయుధాలు సరఫరా చేసింది. టర్కీ అందించిన ఆయుధాలనే పాకిస్థాన్.. భారత్‌పై ప్రయోగించింది.
‘కన్నప్ప’ కి కన్నం వేసిన ఆఫీస్ బాయ్..
ప్రజంట్ టాలీవుడ్ లో తెరకెక్కిన పాన్ ఇండియా చిత్రాల్లో ‘కన్నప్ప’ ఇకటి. హీరో మంచు విష్ణు డ్రీమ్ ప్రాజెక్ట్ అయిన ఈ మూవీ ఏప్రిల్ 25న ప్రపంచ వ్యాప్తంగా రిలీజ్ కాబోతుంది. కాగా ఈ సినిమాలో దిగ్గజ నటులు భాగస్వామ్యం అవుతున్న సంగతి తెలిసిందే. మోహన్ బాబు, మోహన్ లాల్, శరత్ కుమార్, ప్రభాస్, అక్షయ్ కుమార్, బ్రహ్మానందం, మధుబాల వంటి వారు నటిస్తున్నారు. ఈ సినిమా నుంచి బయటకు వస్తున్న ఒక్కో అప్ డేట్, ప్రేక్షకుల్లో క్యూరియాసిటీ పెంచుతోంది. ముఖేష్ కుమార్ సింగ్ దర్శకత్వం వహిస్తున్నా ఈ చిత్రాన్ని రూ.100 కోట్లకి పైగా బడ్డెట్‌తో తెరకెక్కించారు. ఇక ప్రమోషన్ పనులు కూడా మొదలెట్టిన మూవీ టీమ్ కు ఊహించని షాక్ తగిలింది..
హార్వర్డ్‌పై విజయం సాధిస్తా.. ట్రంప్ ప్రతిజ్ఞ
హార్వర్డ్ యూనివర్సిటీ మధ్య ట్రంప్ పరిపాలన మధ్య వివాదం నెలకొంది. ట్రంప్ రెండోసారి అధికారంలోకి వచ్చిన దగ్గర నుంచి హార్వర్డ్ విశ్వవిద్యాలయంపై కఠిన నిర్ణయాలు తీసుకుంటున్నారు. యూనివర్సిటీకి అందించే సాయాన్ని నిలిపివేయడంతో పాటు పాఠ్యాంశాలు మార్చాలంటూ ఆదేశాలు ఇచ్చారు. ఇటీవల విదేశీ విద్యార్థులను చేర్చుకునే సర్టిఫికేషన్ కూడా ట్రంప్ సర్కార్ రద్దు చేసింది. దీంతో ప్రపంచ దేశాల్లో ఉన్న ప్రముఖుల పిల్లల భవిష్యత్ అంధకారం అయింది.
మరోసారి తండ్రైన తేజస్వి యాదవ్.. మగ బిడ్డ జననం
బీహార్ మాజీ డిప్యూటీ సీఎం, ఆర్జేడీ నాయకుడు తేజస్వి యాదవ్ మరోసారి తండ్రయ్యారు. తన భార్య రెండో బిడ్డకు జన్మనిచ్చిందని తేజస్వి యాదవ్ సోషల్ మీడియాలో పోస్టు చేశారు. శిశువు ఫొటోను కూడా పంచుకున్నారు. చిన్నారి రాకను ప్రకటించినందుకు చాలా సంతోషంగా ఉందని ట్వీట్ చేశారు. తేజస్వి యాదవ్ మొదటి సంతానం 2023లో నవరాత్రి సమయంలో జన్మించింది. ఆ చిన్నారికి కాత్యాయని అని పేరు పెట్టారు. తేజస్వి యాదవ్‌కు 2021లో పెళ్లైంది. చిరకాల స్నేహితురాలు రాచెల్ గోడిన్హోను వివాహం చేసుకున్నారు. 2021, డిసెంబర్‌లో హిందూ ఆచారాల ప్రకారం వివాహం చేసుకున్నారు. తేజస్వి-రాచెల్ గోడిన్హో న్యూఢిల్లీలోని ఆర్కేపురంలో డీపీఎస్ పాఠశాలలో కలిసి చదువుకున్నారు. అలా చిన్ననాటి స్నేహితురాలిని మనువాడారు.
పటాన్ చెరులో విషాదం.. భవనం నుంచి పడి మూడేళ్ల బాలుడు మృతి
సంగారెడ్డి జిల్లా పటాన్ చెరు సమీపంలోని తెల్లాపూర్ మున్సిపాలిటీలో విషాద ఘటన చోటుచేసుకుంది. నిర్మాణంలో ఉన్న ఓ మూడు అంతస్తుల భవనం పై నుండి ప్రమాదవశాత్తు కిందపడిన మూడేళ్ల చిన్నారి అక్కడికక్కడే మృతిచెందాడు. ఈ సంఘటన స్థానికంగా తీవ్ర విషాదాన్ని మిగిల్చింది. తెల్లాపూర్ మున్సిపాలిటీ పరిధిలోని విలిమల ప్రాంతంలో ఓ నిర్మాణ కార్యక్రమం కొనసాగుతోంది. మధ్యప్రదేశ్‌కు చెందిన రూప్ సింగ్ అనే మేస్త్రీ, అతని భార్య కార్మికురాలిగా అక్కడే పని చేస్తున్నారు. వారి మూడేళ్ల కొడుకు అక్కడే ఆడుకుంటుండగా, అప్రమత్తత లేకపోవడంతో మూడు అంతస్తుల భవనం పై నుండి కిందపడిపోయాడు.
వైఎస్ జగన్ పొదిలి పర్యటన వాయిదా!
వైసీపీ అధినేత, మాజీ సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ప్రకాశం జిల్లా పర్యటన వాయిదా పడింది. బుధవారం (మే 28) పొదిలిలో జగన్ పర్యటించాల్సి ఉండగా.. వాయిదా పడిందని వైసీపీ ఓ ప్రకటనలో తెలిపింది. భారీ వర్షాల హెచ్చరికల నేపథ్యంలో పొదిలి పర్యటన వాయిదా పడినట్లు పేర్కొంది. వాతావరణం అనుకూలించిన తర్వాత వైఎస్ జగన్ ప్రకాశం జిల్లా పర్యటన తేదీలను వైసీపీ ఖరారు చేయనుంది.
కడపలో ప్రారంభమైన టీడీపీ మహానాడు.. రిజిస్ట్రేషన్ చేయించుకున్న సీఎం చంద్రబాబు!
కడపలో టీడీపీ మహానాడు అంగరంగ వైభవంగా ప్రారంభమైంది. టీడీపీ అధినేత, సీఎం చంద్రబాబు నాయుడు మహానాడు ప్రాంగణంలో తన పేరును రిజిస్ట్రేషన్ చేయించుకున్నారు. ప్రాంగణంలో మహానాడు కిట్టును సీఎం కొనుగోలు చేశారు. ఆపై ఫొటో ప్రదర్శనను తిలకించారు. మహానాడు ప్రాంగణంలో ఎన్టీఆర్ విగ్రహానికి పూలమాల వేసి నివాళి అర్పించారు. రక్తదాన శిబిరాన్ని సీఎం చంద్రబాబు ప్రారంభించారు.
అందుకే పాకిస్తాన్‌కు భారత్ తిరిగి సమాధానం చెప్పాల్సి వచ్చింది!
పహల్గాం దాడిలో ఉగ్రవాదులు ఏ మతం వారో అడిగి మరీ చంపడంతో సహనం పూర్తిగా పోయిందని, అందువల్లే పాకిస్తాన్‌కు భారత్ తిరిగి సమాధానం చెప్పాల్సి వచ్చిందని ఏపీ బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు దగ్గుబాటి పురంధేశ్వరి తెలిపారు. భారతదేశం 1947 నుండి సరిహద్దు ఉగ్రవాదంతో బాధపడిందన్నారు. భారతదేశాన్ని మరింతగా బాధపెట్టకుండా పాకిస్తాన్ వెనక్కి తగ్గడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. భారత్ పాక్ పౌరులను లక్ష్యంగా చేసుకోలేదని, ఉగ్రవాద శిబిరాలను మాత్రమే లక్ష్యంగా చేసుకుంది అని పురంధేశ్వరి చెప్పారు. పారిస్‌లోని భారతీయ ప్రవాసులను ఉద్దేశించి భారతదేశ అఖిలపక్ష ప్రతినిధి బృందం సభ్యురాలు పురందేశ్వరి ప్రసంగించారు.