Pakistan Spy: హర్యానా యూట్యూబర్, పాకిస్తాన్ తరుపున గూఢచర్యం చేస్తూ దొరికిన జ్యోతి మల్హోత్రా పట్టుబడటం సంచలనంగా మారింది. ఆమె అరెస్ట్ తర్వాత దేశవ్యాప్తంగా పాకిస్తాన్ గూఢచారులు పట్టుబడుతున్నారు. రాజస్థాన్‌కి చెందిన కాసిం, అతడి సోదరుడు అసిం పాకిస్తాన్ తరపున గూఢచర్యానికి పాల్పడనున్నట్లు ఆరోపిస్తూ ఢిల్లీ పోలీసులు అరెస్ట్ చేశారు. కాసిం పాకిస్తాన్ ఐఎస్ఐ నుంచి శిక్షణ పొందడానికి రెండుసార్లు పాకిస్తాన్ వెళ్లినట్లు అధికారులు తెలిపారు.
Pak spy: పాకిస్తాన్‌కి గూఢచారులుగా పనిచేస్తున్న వ్యక్తులు ఒక్కొక్కరుగా పట్టుబడుతున్నారు. ఇప్పటికే హర్యానాకు చెందిన యూట్యూబర్ జ్యోతి మల్హోత్రా వ్యవహారం సంచలనంగా మారిన సంగతి తెలిసింది. పహల్గామ్ ఉగ్రదాడి తర్వాత హర్యానా, పంజాబ్, ఉత్తర్ ప్రదేశ్‌కి చెందిన 11 మందిని అరెస్ట్ చేశారు.
Pakistan Spies: యూట్యూబర్ జ్యోతి మల్హోత్రా తర్వాత ఒక్కొక్కరుగా పాకిస్తాన్ గూఢచారులు బయటపడుతున్నారు. ఇటీవల కాలంలో జ్యోతి మల్హోత్రా కేసు దేశంలో సంచలనంగా మారిన సంగతి తెలిసిందే. పాకిస్తాన్ అధికారులు, ఐఎస్ఐతో సంబంధాలు ఉన్నట్లు తేలింది. ఇదిలా ఉంటే, తాజాగా ఉత్తర్ ప్రదేశ్ లో పాకిస్తాన్ తరుపున గూఢచర్యం చేస్తున్నారనే ఆరోపణలతో యూపీ యాంటీ-టెర్రరిజం స్వ్కాడ్ (ఏటీఎస్) ఇద్దరు వ్యక్తుల్ని అరెస్ట్ చేసింది.
గుల్జార్‌హౌస్ అగ్నిప్రమాదం వెనుక అక్రమ కరెంట్ కనెక్షన్..! హైదరాబాద్ పాతబస్తీలోని గుల్జార్‌హౌస్ ప్రాంతంలో సంభవించిన ఘోర అగ్నిప్రమాదం మృత్యుపాశాన్ని మోసుకొచ్చింది. ఈ ఘటనపై పోలీసులు, ఫైర్ సిబ్బంది ప్రాథమికంగా చేసిన దర్యాప్తులో ఓ కీలక విషయాన్ని బయటపెట్టింది. ఆ విషాదానికి మూలంగా అక్రమ కరెంట్ కనెక్షన్ ఉన్న ఉన్నట్టు అధికారులు అనుమానిస్తున్నారు. ప్రభావిత భవనానికి ఎదురుగా ఉన్న నగల దుకాణం రాత్రి మూతపడిన అనంతరం, అక్కడి కొన్ని కుటుంబాలు హైటెన్షన్ వైర్ నుంచి కరెంట్‌ను కోక్కేల ద్వారా…
అమెరికా మాజీ అధ్యక్షుడు జో బైడెన్ కు ప్రోస్టేట్ క్యాన్సర్.. అమెరికా మాజీ అధ్యక్షుడు జో బైడెన్ తీవ్రమైన ప్రోస్టేట్ క్యాన్సర్‌తో బాధపడుతున్నట్లు నిర్ధారణ అయ్యింది. బైడెన్‌కు ప్రోస్టేట్ క్యాన్సర్ ఉందని, ఆ క్యాన్సర్ కణాలు ఇప్పుడు అతని ఎముకలకు వ్యాపించాయని వైద్యులు నిర్ధారించారు. దీనికి సంబంధించి ఆయన కార్యాలయం అధికారిక ప్రకటన విడుదల చేసింది. 82 ఏళ్ల బైడెన్ మూత్ర విసర్జన లక్షణాల గురించి పరీక్షలు చేయించుకున్నప్పుడు ఈ విషయం బయటపడింది. వైద్యులు బైడెన్ కు…