ఫిబ్రవరి 15న కొలంబోలో పాకిస్తాన్‌తో భారత్ తలపడనుంది. ఈ మ్యాచ్ కోసం దేశంలోనే కాదు వరల్డ్ వైడ్ గా ఉన్న క్రికెట్ లవర్స్ ఈగర్ గా వెయిట్ చేస్తున్నారు. ఈ మ్యాచ్‌లో ఏ భారత బ్యాట్స్‌మన్ ఎక్కువ పరుగులు చేస్తాడనే దానిపై అందరి దృష్టి ఉంటుంది. T20 ప్రపంచ కప్‌లో పాకిస్తాన్‌పై భారత్ ఎప్పుడూ పైచేయి సాధించింది. రెండు జట్ల మధ్య మ్యాచ్ ఉత్కంఠభరితంగా సాగుతూ ఉంటుంది. ఇప్పుడు, రెండు జట్ల మధ్య జరిగిన T20 మ్యాచ్‌లలో పాకిస్తాన్‌పై భారతదేశం తరపున ఎవరు ఎక్కువ పరుగులు చేశారో తెలుసుకుందాం.
Also Read:PM Kisan 22nd Installment: రైతన్నలకు అలర్ట్.. ఈ ఒక్క తప్పు చేస్తే పీఎం కిసాన్ నిధులు గోవిందా!
కోహ్లీ అత్యధిక పరుగులు
అంతర్జాతీయ టీ20 క్రికెట్లో పాకిస్తాన్‌పై భారత్ తరఫున అత్యధిక పరుగులు చేసిన రికార్డు విరాట్ కోహ్లీ పేరిట ఉంది. ఆ జట్టుపై 11 మ్యాచ్‌ల్లో 492 పరుగులు సాధించగా, యువరాజ్ సింగ్ 8 మ్యాచ్‌ల్లో 155 పరుగులతో రెండవ స్థానంలో ఉన్నాడు. గౌతమ్ గంభీర్ 5 మ్యాచ్‌ల్లో 139 పరుగులతో మూడవ స్థానంలో, తిలక్ వర్మ 3 మ్యాచ్‌ల్లో 130 పరుగులతో నాల్గవ స్థానంలో ఉన్నాడు.
పాకిస్తాన్‌పై టీ20 అంతర్జాతీయ క్రికెట్లో అత్యధిక పరుగులు చేసిన భారత బ్యాట్స్‌మెన్ జాబితాలో రోహిత్ శర్మ 12 మ్యాచ్‌ల్లో 127 పరుగులు చేసి 5వ స్థానంలో ఉన్నాడు, ప్రస్తుత భారత టీ20 కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ ఈ జట్టుపై 8 మ్యాచ్‌ల్లో 112 పరుగులు చేసి 6వ స్థానంలో ఉన్నాడు. భారత ఓపెనర్ అభిషేక్ శర్మ 3 మ్యాచ్‌ల్లో 110 పరుగులు చేసి 7వ స్థానంలో ఉండగా, హార్దిక్ పాండ్యా 9 మ్యాచ్‌ల్లో 98 పరుగులు చేసి 8వ స్థానంలో ఉన్నాడు.
Also Read:Air India: ఎయిర్ ఇండియాకు రూ.కోటి జరిమానా విధించిన DGCA.. అసలేం జరిగిందంటే?
టీ20ల్లో పాకిస్థాన్‌పై అత్యధిక పరుగులు చేసిన టాప్ 8 భారత బ్యాట్స్మెన్లు
విరాట్ కోహ్లీ – 492 పరుగులు
యువరాజ్ సింగ్ – 139 పరుగులు
గౌతమ్ గంభీర్ – 130 పరుగులు
తిలక్ వర్మ – 139 పరుగులు
రోహిత్ శర్మ – 127 పరుగులు
సూర్యకుమార్ యాదవ్ – 112 పరుగులు
అభిషేక్ శర్మ – 110 పరుగులు
హార్దిక్ పాండ్యా – 98 పరుగులు