Lady Dons: భారతదేశంలో నేర సామ్రాజ్యాన్ని పాలించిన వారిలో చాలా మంది మహిళలు కూడా ఉన్నారు. అలా ఏలిన వారిని ‘లేడీ డాన్స్’, ‘గాడ్ మదర్స్’ అని పిలుస్తుంటారు. లేడీ డాన్లుగా మారిన వారిలో ఎక్కువ మంది ప్రధాన నగరాల నుంచి వచ్చిన వారే ఉన్నారు. అలాగే గ్రామాలు, వ్యభిచార గృహాల నుంచి నేర సామ్రాజ్యంలోకి అడుగుపెట్టిన కొంతమంది లేడీ డాన్లు కూడా ఉన్నారు. ఇంతకీ వాళ్లలో భారతదేశంలో టాప్ 5 లేడీ డాన్స్ గురించి ఈ స్టోరీలో తెలుసుకుందాం.
READ ALSO: Telangana : పంచాయతీ ఎన్నికల షెడ్యూల్ విడుదల.. మూడు విడతల్లో పోలింగ్.. అమల్లోకి ఎలక్షన్ కోడ్
1990లలో లేడీ డాన్ల పేర్లలో దావూద్ ఇబ్రహీం సోదరి హసీనా పార్కర్, గుజరాత్‌కు చెందిన సంతోక్‌బెన్ సారాభాయ్ జడేజా, చంబల్ రాణి ఫూలన్ దేవి, సోను పంజాబన్, జెనాబాయి దారువాలి, అనురాధ చౌదరి, జోయా ఖాన్ ఖాన్ వంటి పేర్లు వెలుగులోకి వచ్చాయి. ఈ లేడీ డాన్లు హత్య, దోపిడీ, స్మగ్లింగ్, వ్యభిచారం వంటి తీవ్రమైన నేరాలకు పాల్పడి ఆ రోజుల్లో నిత్యం వార్తల్లో నిలిచారు. ఢిల్లీ, ముంబై, గుజరాత్, ఉత్తరప్రదేశ్ వంటి రాష్ట్రాల్లో వీళ్ల పలుకుబడి మామూలుగా ఉండేది కాదు. అయితే ఇప్పుడు వారిలో చాలామంది మరణించినప్పటికీ, కొందరు ఇంకా బతికే ఉన్నారు.
హసీనా పార్కర్
హసీనా పార్కర్ అండర్ వరల్డ్ డాన్ దావూద్ ఇబ్రహీం సోదరి. ఈమె జూలై 6, 2014న గుండెపోటుతో మరణించింది. 1991 గ్యాంగ్ వార్ సమయంలో ఆమె పేరు వెలుగులోకి వచ్చింది. “మాఫియా క్వీన్” పుస్తకం హసీనా గురించి అనేక విషయాలను వెల్లడిస్తుంది.
సంతోక్‌బెన్ సారాభాయ్ జడేజా
1980 – 1990లలో సంతోక్‌బెన్ సారాభాయ్ జడేజా జాతీయ స్థాయిలో గుర్తింపు పొందారు. గుజరాత్‌లోని పోర్బందర్‌లో మాఫియా డాన్‌గా మారిన తర్వాత, ఆమె రాజకీయ నాయకురాలిగా తన రూటు మార్చుకుంది. ఆమె రాజ్‌పుత్ కుటుంబం నుంచి వచ్చింది. పలు నివేదికల ప్రకారం.. ఆమె 14 హత్యలకు పాల్పడ్డారు. ఈమె ముఠా సభ్యులపై మొత్తం 500 కేసులు నమోదయ్యాయి.
సోను పంజాబన్ (గీతా అరోరా)
సోను పంజాబన్.. ఈమె అసలు పేరు గీతా అరోరా. సోను ఢిల్లీ-ఎన్‌సిఆర్, దేశవ్యాప్తంగా అనేక ఇతర రాష్ట్రాలలో సెక్స్ రాకెట్‌ను నడిపింది. ఈ రాకెట్ ద్వారా ఆమె ప్రముఖ గ్యాంగ్‌స్టర్లతో పరిచయం పెంచుకొని లేడీ డాన్‌గా మారింది. సోను 2017 నుంచి తీహార్ జైలులో శిక్ష అనుభవిస్తున్నారు.
జెనాబాయి దారువాలి
ముంబై అండర్ వరల్డ్‌లో తొలి మాఫియా రాణి జెనాబాయి దారువాలి. ఆ టైంలో ఆమె ప్రభావం ఎంత బలంగా ఉందంటే అందరూ ఆమెను అభినందించడమే కాకుండా ఆమె సలహా కూడా తీసుకున్నారు. దారువాలి ముస్లిం కుటుంబం నుంచి వచ్చింది. అయితే హాజీమస్తాన్, కరీం లాలా, దావూద్ ఇబ్రహీం, అబూ సలేం వంటి డాన్లు పరిపాలించిన నగరంలో ఏ వ్యాపారవేత్త లేదా బిల్డర్, ఏ నటుడు కూడా కూడా జెనాబాయి దారువాలి అనుమతి లేకుండా సినిమాపై సంతకం చేయకూడదు, భవనం నిర్మించకూడదనే రూల్ ఉండేది.
అనురాధ చౌదరి
రాజస్థాన్ లేడీ డాన్ అనురాధ చౌదరి. ఆమె గత కొన్ని సంవత్సరాలుగా వార్తల్లో నిలుస్తున్నారు. గత సంవత్సరం ఆమె పేరుమోసిన నేరస్థుడు సందీప్ అలియాస్ కాలా జతేరిని వివాహం చేసుకుంది. జాట్ కులానికి చెందిన అనురాధ చౌదరి ప్రస్తుతం తీహార్ జైలులో ఉన్నారు. ఆమెకు గ్యాంగ్‌స్టర్లు ఆనంద్ పాల్ సింగ్, లారెన్స్ బిష్ణోయ్ లతో కూడా సంబంధాలు ఉన్నాయని సమాచారం.
READ ALSO: Saudi Arabia: 73 ఏళ్లుగా మద్యం అమ్మని ముస్లిం దేశం.. కానీ ఇప్పుడు !