Tollywood: టాలీవుడ్‌లో సినీ కార్మికుల సమ్మె 15వ రోజుకు చేరుకుంది. షూటింగ్స్ పూర్తిగా ఆగిపోవడంతో సగటు కార్మికులు విలవిలలాడుతున్నారు. నిర్మాతలతో చర్చలు ఫలితమివ్వకపోవడంతో ఫెడరేషన్ నాయకులు ఒక పక్క చర్చలు కొనసాగిస్తూనే మరోపక్క నిరసనలకు దిగుతున్నారు. ఈ సమస్యల నేపథ్యంలో ఈరోజు సాయంత్రం 4 గంటలకు ఫెడరేషన్ నాయకులు మెగాస్టార్ చిరంజీవిని కలవనున్నారు. అంతకు ముందు మధ్యాహ్నం 11 గంటలకు ఫెడరేషన్ కార్యాలయంలో కార్మిక సంఘాల సమావేశం జరగనుంది. నిన్న నిర్మాత సీ.కళ్యాణ్ కార్మిక సంఘాల సమస్యలపై చిరంజీవితో మాట్లాడగా.. చిన్న నిర్మాతల బృందం కూడా ఆయనను కలిసి సినిమాల సమస్యలను వివరించింది. ఇది ఇలా ఉండగా మంగళవారం నాడు నిర్మాతలు, ఫెడరేషన్ నాయకులతో కలిసి చిరంజీవి సమావేశం అయ్యే అవకాశముందని సమాచారం.
Ramantapur: విషాదం మిగిల్చిన శ్రీకృష్ణాష్టమి వేడుకలు.. కరెంట్ తీగలు తాకి ఐదుగురు మృతి!
ఈ నేపథ్యంలో మరోవైపు మంగళవారం నాడు కృష్ణానగర్‌లో సినీ కార్మిక సంఘాలు నిరసన కార్యక్రమం చేపట్టనున్నాయి. ఈ కార్యక్రమంలో భవిష్యత్ కార్యాచరణను ప్రకటించనున్నట్లు ఫెడరేషన్ నాయకులు తెలిపారు. ఇది ఇలా ఉండగా నిర్మాతల నుంచి కార్మిక సంఘాలకు రావాల్సిన రూ.13 కోట్ల బకాయిలు వెంటనే చెల్లించాలని ఫెడరేషన్ అధ్యక్షుడు అనిల్ వల్లభనేని విజ్ఞప్తి చేశారు. నిర్మాతలు మా కష్టాన్ని గుర్తించాలని ప్రొడక్షన్ అసిస్టెంట్ యూనియన్ సభ్యులు తెలిపారు. నిర్మాతలు పెట్టిన నాలుగు కండిషన్లలో రెండు కండిషన్ల దగ్గర చర్చలు ఆగిపోయాయి. ఈ విషయంలో నిర్మాతల వైఖరిపై అసహనం వ్యక్తం చేస్తూ సినీ కార్మిక సంఘాలు కఠిన నిర్ణయాలకు సిద్ధమవుతున్నాయి. మొత్తంగా టాలీవుడ్‌ను స్తంభింపజేసిన ఈ సమ్మె పరిష్కారం దిశగా వెళ్తుందా? లేక నిరసనలు మరింత ముదురుతాయా? అనేది చూడాల్సి ఉంది.
Weather Update: తడిసి ముద్దైన తెలంగాణ.. రాష్ట్రవ్యాప్తంగా భారీ వర్షాలు!