Tollywood: టాలీవుడ్‌లో సినీ కార్మికుల సమ్మె 15వ రోజుకు చేరుకుంది. షూటింగ్స్ పూర్తిగా ఆగిపోవడంతో సగటు కార్మికులు విలవిలలాడుతున్నారు. నిర్మాతలతో చర్చలు ఫలితమివ్వకపోవడంతో ఫెడరేషన్ నాయకులు ఒక పక్క చర్చలు కొనసాగిస్తూనే మరోపక్క నిరసనలకు దిగుతున్నారు. ఈ సమస్యల నేపథ్యంలో ఈరోజు సాయంత్రం 4 గంటలకు ఫెడరేషన్ నాయకులు మెగాస్టార్ చిరంజీవిని కలవనున్నారు. అంతకు ముందు మధ్యాహ్నం 11 గంటలకు ఫెడరేషన్ కార్యాలయంలో కార్మిక సంఘాల సమావేశం జరగనుంది. నిన్న నిర్మాత సీ.కళ్యాణ్ కార్మిక సంఘాల సమస్యలపై…