Gold and Silver Price in Hyderabad on 2024 February 5: బంగారం ప్రియులకు శుభవార్త. ఆదివారం తగ్గిన పసిడి ధరలు నేడు స్థిరంగా ఉన్నాయి. బులియన్ మార్కెట్‌లో సోమవారం (ఫిబ్రవరి 5) 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.58,100గా ఉండగా.. 24 క్యారెట్ల (999 Gold) 10 గ్రాముల ధర రూ.63,380 గా ఉంది. నేడు దేశంలోని ప్రధాన నగరాల్లో పసిడి ధరలు ఎలా ఉన్నాయో చూద్దాం.
ఢిల్లీలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.58,250 ఉంటే.. 24 క్యారెట్ల ధర రూ.63,530గా ఉంది. ముంబైలో 22 క్యారెట్ల బంగారం ధర రూ.58,100గా.. 24 క్యారెట్ల ధర రూ.63,380గా నమోదైంది. చెన్నైలో 22 క్యారెట్ల పసిడి ధర రూ.58,700 కాగా.. 24 క్యారెట్ల ధర రూ.64,040గా ఉంది. బెంగళూరు, కోల్‌కతా, కేరళలలో 22 క్యారెట్ల బంగారం ధర రూ.58,100 కాగా.. 24 క్యారెట్ల ధర రూ.63,380గా ఉంది. హైదరాబాద్, విజయవాడ, విశాఖపట్నంలలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.58,100గా ఉండగా.. 24 క్యారెట్ల ధర రూ.63,380గా ఉంది.
Also Read: Raviteja: ఈగల్ అదిరిపోతుంది.. అతని డైలాగ్స్ అయితే నెక్స్ట్ లెవెల్
నేడు వెండి ధరలు కూడా స్థిరంగా ఉన్నాయి. బులియన్ మార్కెట్‌లో సోమవారం కిలో వెండి ధర రూ.75,500లుగా కొనసాగుతోంది. నేడు ఢిల్లీలో వెండి కిలో ధర రూ.75,500గా ఉంది. ముంబైలో రూ.75,500 ఉండగా.. చెన్నైలో రూ.77,000గా కొనసాగుతోంది. హైదరాబాద్, విజయవాడ, విశాఖపట్నంలో కిలో వెండి ధర రూ.77,000లుగా కొనసాగుతోంది. అత్యల్పంగా బెంగళూరులో కిలో వెండి ధర రూ.75,500 ఉంది.