today gold price in hyderabad 19.08.2022
బంగారం కొనుగోలు చేయాలనుకునే వారికి కొంత శుభవార్త ఇచ్చే విషయమే. ఎందుకంటే.. గత వారం రోజులుగా బంగారం ధరలు నిలకడగా కొనసాగతున్నాయి. అయితే నేడు కూడా పసిడి ధరలు స్థిరంగా కొనసాగుతున్నాయి. ఇదిలా ఉంటే.. వెండ ధరలు మాత్రం నేలచూపులు చూసాయి. దీంతో వెండి కొనుగోలు చేయాలనుకునే వారు త్వరపడాల్సిందే. అయితే.. మరోవైపు అంతర్జాతీయ మార్కెట్‌లో కూడా బంగారం ధరలు దిగి వచ్చాయి. గ్లోబల్ మార్కెట్‌లో బంగారం, వెండి ధరలు రెండూ పడిపోయాయి. పసిడి రేటు ఔన్స్‌కు 0.11 శాతం పడిపోయింది.
దీంతో బంగారం రేటు ఔన్స్‌కు 1769 డాలర్లకు తగ్గింది. ఇక వెండి రేటును గమనిస్తే.. సిల్వర్ రేటు 0.37 శాతం పడిపోయింది. ఔన్స్‌కు వెండి రేటు 19.39 డాలర్ల వద్ద కదలాడుతోంది. నేడు హైదరాబాద్‌లో 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 52,250లు కాగా, అలాగే 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం రూ. 47,900 వద్ద కొనసాగుతోంది. ఇక వెండి రేటు మాత్రం రూ. 900 పడిపోవడంతో కేజీ వెండి ధర రూ. 62,400కు దిగి వచ్చింది. కాగా పైన పేర్కొన్న రేట్లకు జీఎస్‌టీ, తయారీ చార్జీలు వంటివి అదనం.