గోల్డ్, సిల్వర్ ధరలు వరుసగా రోండోరోజు దిగొచ్చాయి. తులం బంగారం ధర రూ. 200 తగ్గింది. కిలో సిల్వర్ ధర రూ. 2000 తగ్గింది. హైదరాబాద్ లో ఈరోజు 24 క్యారెట్ల బంగారం ధర (1 గ్రాము) రూ.9,982, 22 క్యారెట్ల బంగారం ధర (1 గ్రాము) రూ.9,150 వద్ద ట్రేడ్ అవుతోంది. హైదరాబాద్ బులియన్ మార్కెట్ లో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 200 తగ్గింది. దీంతో రూ.91,500 వద్ద అమ్ముడవుతోంది. 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 210 తగ్గింది. దీంతో రూ. 99,820 వద్ద ట్రేడ్ అవుతోంది.
Also Read:Kingdom Collections Day 1: బాక్సాఫీస్ ను కుమ్మేసిన విజయ్.. కింగ్డమ్ ఫస్ట్ డే కలెక్షన్స్ ఎంతంటే?
విజయవాడ, విశాఖ పట్నంలో కూడా ఇవే ధరలు కొనసాగుతున్నాయి. దేశ రాజధాని ఢిల్లీలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 91,650 వద్దకు చేరింది. 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 99,970 వద్ద ట్రేడ్ అవుతోంది. హైదరాబాద్ బులియన్ మార్కెట్ లో ఈ రోజు కిలో వెండి ధర రూ. 1,23,000 వద్ద అమ్ముడవుతోంది. ఢిల్లీలో కిలో సిల్వర్ ధర రూ. 1,13,000 వద్ద ట్రేడ్ అవుతోంది.