బంగారం ధరలు లక్షకు చేరుకుని కొనుగోలుదారులకు చుక్కలు చూపిస్తున్నాయి. సామాన్యులకు అందని ద్రాక్షలా మిగిలిపోతోంది. పెరుగుతున్న గోల్డ్ ధరలతో ఆందోళన చెందుతున్న వారికి నేడు పసిడి ధరలు తగ్గి ఊరటనిచ్చాయి. ఇవాళ గోల్డ్ ధరలు భారీగా తగ్గాయి. తులం బంగారంపై రూ. 680 తగ్గింది. వెండి ధరలు స్వల్పంగా తగ్గాయి. హైదరాబాద్ లో ఈరోజు 24 క్యారెట్ల బంగారం ధర (1 గ్రాము) రూ. 9,753, 22 క్యారెట్ల బంగారం ధర (1 గ్రాము) రూ.8,940 వద్ద అమ్ముడవుతోంది.
Also Read:Odisha: 35 ఏళ్లుగా భారత్‌లోనే నివాసం.. పాక్‌లో ఎవరూ లేకపోయినా పంపేసే యత్నం. ఓ అబల ధీనగాథ
హైదరాబాద్ బులియన్ మార్కెట్ లో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 620 తగ్గడంతో రూ. 89,400 వద్ద అమ్ముడవుతోంది. 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 680 తగ్గడంతో రూ. 97,530 వద్ద ట్రేడ్ అవుతోంది. విజయవాడ, విశాఖ పట్నంలో కూడా ఇదే ధరలు కొనసాగుతున్నాయి. దేశ రాజధాని ఢిల్లీలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 89,550గా ఉంది. 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. రూ. 97,680 వద్ద ట్రేడ్ అవుతోంది.
Also Read:Deputy CM Pawan Kalyan: ఇచ్చిన మాట నిలబెట్టుకున్నాం.. సీఎం చంద్రబాబుకు కృతజ్ఞతలు..
బంగారంతోపాటు వెండి ధరలు స్వల్పంగా తగ్గాయి. ఇవాళ కిలో వెండిపై రూ.100 తగ్గింది. హైదరాబాద్ బులియన్ మార్కెట్ లో ఈ రోజు కిలో వెండి ధర రూ. 1,11,800 వద్ద ట్రేడ్ అవుతోంది. ఢిల్లీలో కిలో సిల్వర్ ధర రూ. 1,01,800 వద్దకు చేరింది.