బంగారం ధరలు నేడు స్వల్పంగా పెరిగాయి. నేడు తులం పసిడి ధర రూ. 170 పెరిగింది. హైదరాబాద్ లో ఈరోజు 24 క్యారెట్ల బంగారం ధర (1 గ్రాము) రూ.10,18, 22 క్యారెట్ల బంగారం ధర (1 గ్రాము) రూ.9,265 వద్ద ట్రేడ్ అవుతోంది. హైదరాబాద్ బులియన్ మార్కెట్ లో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 150 పెరిగింది. దీంతో రూ. 92,650 వద్ద అమ్ముడవుతోంది. 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 170 పెరిగింది. దీంతో రూ. 1,01,080 వద్ద ట్రేడ్ అవుతోంది.
Also Read:Srinidhi Shetty : గ్లామర్ నుంచి నటన దిశగా.. మారుతున్న శ్రీనిధి జర్నీ!
విజయవాడ, విశాఖ పట్నంలో కూడా ఇదే ధరలు కొనసాగుతున్నాయి. దేశ రాజధాని ఢిల్లీలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 92,800 వద్దకు చేరింది. 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 1,01,210 వద్ద ట్రేడ్ అవుతోంది. నేడు కిలో సిల్వర్ పై రూ. 1000 పెరిగింది. హైదరాబాద్ బులియన్ మార్కెట్ లో ఈ రోజు కిలో వెండి ధర రూ. 1,22,000 వద్ద అమ్ముడవుతోంది. ఢిల్లీలో కిలో సిల్వర్ ధర రూ. 1,12,000 వద్ద ట్రేడ్ అవుతోంది.