Srinidhi Shetty : గ్లామర్ నుంచి నటన దిశగా.. మారుతున్న శ్రీనిధి జర్నీ!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
శ్రీనిధి శెట్టి .. చేసినవి, చేస్తున్నవి పెద్ద సినిమాలే అయినా కెరీర్ ఆశించిన రీతిలో ముందుకెళ్ల లేకపోతుంది. భారీ హిట్ అయిన KGF లో ఆమె పాత్ర ఎక్కువగా గ్లామర్ పరంగా ఉండటంతో, ఆమె నటనకు తగిన ప్రాధాన్యత రాలేదు. తర్యాత ఆమె తమిళంలో ‘కోబ్రా’ అనే సినిమాతో అరంగేట్రం చేసింది. ఈ ప్రాజెక్టులు ఆమెకు పెద్దగా బ్రేక్ తీసుకు రాలేకపోయారు. కానీ రీసెంట్‌గా ఆమె నటించిన ‘HIT 3’ లో మాత్రం తన నైపుణ్యాన్ని నిరూపించే అవకాశం దక్కించుకుంది.
Also Read : Kajal : మళ్లీ ఫామ్‌లోకి కాజల్.. ఏకంగా బోల్డ్ పాత్రలకు గ్రీన్ సిగ్నల్!
Also Read
- Nani: "18 ఏళ్ల కెరీర్.. 33 సినిమాలు.. ఇలాంటిది ఎప్పుడూ చూడలేదు" ది ప్యారడైజ్ టాక్‌పై నాని ఓపెన్ రియాక్షన్!
- Jailer 2: రజినీ 'జైలర్ 2' బిజినెస్‌పై ట్రేడ్ షాక్! ఏకంగా 4 రెట్లు పెరిగిన రేటు..
- Suriya: ఆ హీరో వివాదం వేళ.. సోషల్ మీడియా ట్రోలింగ్‌పై ఫ్యాన్స్‌కి హితవు పలికి సూర్య!
- Venkatesh: "20 ఏళ్ల తర్వాత మళ్లీ త్రివిక్రమ్‌తో .. పెళ్లికాని ప్రసాద్ కాలం పోయింది"
కానీ ఏం లాభం.. బహుళ భాషల్లో మాట్లాడగలగడం, ప్రమోషన్లలో చురుకుదనం చూపడం వంటి గుణాలు ఉన్నా కూడా, ఆమెకు స్క్రిప్ట్ పరంగా బలమైన పాత్రలు లభించలేదు. ఇక ఇప్పటికి శ్రీనిధి చేతిలో పెద్దగా ప్రాజెక్టులు లేనప్పటికీ, ఆమెను కొన్ని ఆసక్తికరమైన సినిమాల కోసం సంప్రదిస్తున్నట్టు సమాచారం. వాటిలో ఒకటి తమిళ స్టార్ అజిత్‌తో చేయబోయే చిత్రం కావడం గమనార్హం. ‘గుడ్ బ్యాడ్ అగ్లీ’ సినిమాతో, అజిత్‌తో పని చేసిన దర్శకుడు అధిక్ రవిచంద్రన్ ఈ మూవీలో శ్రీనిధిని హీరోయిన్‌గా తీసుకునే ప్లాన్ లో ఉన్నారని సినీ వర్గాల టాక్.
అజిత్ లాంటి స్టార్‌తో స్క్రీన్ షేర్ చేసుకోవడం అంటే శ్రీనిధికి కెరీర్ మరోసారి ఫామ్ లోకి వచ్చినట్లే. కానీ కంటెంట్ బేస్డ్ రోల్స్‌లో నటిస్తే ఆమె టాలెంట్ మరింత వెలుగులోకి వస్తుంది. మాస్ మార్కెట్‌కు ఓన్ అయ్యే సినిమా కన్నా, కథానాయకి పాత్రకు బలం ఉన్న చిత్రాలను ఎంచుకుంటే మంచిది. అందుకే శ్రీనిధికి ఇండస్ట్రీలో స్థిరమైన గుర్తింపు రావాలంటే, సరైన కథలు, పాత్రలు ఎంపిక చేయడమే కాకుండా, తాను చేసే ప్రతీ సినిమాతో తన టాలెంట్‌ను మరో మెట్టు ఎక్కించడం చాలా కీలకం.
తాజావార్తలు
-
BAR Tender: తెలంగాణలో 41 కొత్త బార్లు.. దరఖాస్తులకు నోటిఫికేషన్
-
Shai Hope: మమ్మల్ని దారుణంగా ముంచేశారు.. ఇలా ఆడతారని అస్సలు ఊహించలేదు: వెస్టిండీస్ కెప్టెన్
-
Nani: “18 ఏళ్ల కెరీర్.. 33 సినిమాలు.. ఇలాంటిది ఎప్పుడూ చూడలేదు” ది ప్యారడైజ్ టాక్‌పై నాని ఓపెన్ రియాక్షన్!
-
Ind Vs WI: కోహ్లీ, గిల్ మానియా.. 295 రన్స్ ఉఫ్.. భారత్ ఘన విజయం..
-
LPU Students Protest: పంజాబ్ LPUలో ఆరని మంటలు.. స్టూడెంట్స్, పోలీసుల మధ్య ఉద్రిక్తత..
ట్రెండింగ్
-
Why Do Dogs Howl at Night: రాత్రిపూట కుక్కలు ఎందుకు ఏడుస్తాయి? దెయ్యాలు కనిపిస్తాయా?.. అసలు రహస్యం ఇదే!
-
Xiaomi Pocket Guitar: చేతిలో ఫోన్.. వెనుక గిటార్..! Xiaomi సరికొత్త యాక్సెసరీ మాములుగా లేదుగా.!
-
Hardik Pandya: రీఎంట్రీకి మరో బ్రేక్.. స్కాన్‌లో బయటపడ్డ కొత్త గాయం.!
-
Saturday Horoscope: ఆ రాశి వారికి నేడు పట్టిందల్లా బంగారమే.. నేటి రాశిఫలాలు ఇలా.!
-
Nuclear Weapons: 12 వేలకుపైగా అణ్వాయుధాలు.. ప్రపంచానికి పొంచి ఉన్న ముప్పేంటి.?