Tirumala: శ్రీవారి ఆలయంలో అపశృతి.. మహాద్వారం వద్ద పడిపోయిన హుండీ
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Tirumala: తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి వారి ఆలయంలో అపశృతి చోటుచేసుకుంది. మహాద్వారం వద్ద స్వామివారి హుండీ పడిపోయింది. ఆలయం నుంచి శ్రీవారి హుండీని లారీలో పరకామణి మండపానికి తరలిస్తుండగా ఈ ఘటన చోటు చేసుకుంది. దీంతో హుండీలో నుంచి కానుకలు చెల్లాచెదురుగా పడిపోయాయి. వెంటనే అప్రమత్తమైన సిబ్బంది కానుకలను హుండీలో వేసి.. తిరిగి హుండీని జాగ్రత్తగా లారీలోకి ఎక్కించారు. అక్కడి నుంచి పరకామణికి తరలించారు. సిబ్బంది నిర్లక్ష్యం కారణంగానే హుండీ కింద పడి పోయినట్లు టీటీడీ అధికారులు భావిస్తున్నారు.
Also Read: Modi Warangal Tour: మోడీ పర్యటనకు సీఎం కేసీఆర్ కు ఆహ్వానం..! హాజరవుతారా? లేదా?
Also Read
- LA 2028 Olympics: ఒలింపిక్స్‌లో భారత్-పాక్ హైవోల్టేజ్ మ్యాచ్ ఉంటుందా? క్లారిటీ ఇదిగో..
- Samudra: ఆ వసూళ్లతో నాకేం సంబంధం లేదు.. ఎవరైనా నా పేరు వాడితే ఊరుకోను
- Sudha Kongara: ఆ సినిమా రిలీజ్ ఆపండి.. కోర్టుకెక్కిన సుధా కొంగర!
- Delhi EV Policy 2026: ఢిల్లీలో ఈవీ విప్లవం.. మరి పెట్రోల్, డీజిల్ వాహనాల భవిష్యత్ ఏంటి?
శ్రీవారిని దర్శించుకునేందుకు వచ్చిన భక్తులు ఆపద మొక్కుల వాడ మమ్ము కాచి కాపాడు అంటూ శ్రీవారికి కానుకలు సమర్పించి తమ మొక్కులు తీర్చుకుంటుంటారు. అవి డబ్బు రూపంలో గానీ, బంగారం రూపంలో గానీ భక్తులు కానులు సమర్పిస్తారు. భక్తులు సమర్పించిన కానుకలతో హుండీ నిండిన తర్వాత ఆలయం వెలుపలికి తీసుకువచ్చి లారీలో నూతన పరకామణికి తీసుకువెళతారు. ఇలా హుండీని పరకామణికి తీసుకువెళ్లే క్రమంలో ఆలయం వెలుపల లారీలోకి ఎక్కిస్తుండగా ఈ ఘటన జరిగింది. హుండీని లారీలోకి జాగ్రత్తగా ఎక్కించారు. సిబ్బంది అప్రమత్తంగా లేకపోవడంతోనే ఈ సంఘటన జరిగినట్లు తెలుస్తోంది.
శ్రీవారికి హుండీ ద్వారా కోట్లలో ఆదాయం వస్తుంది. కానుకలు సమర్పించడాన్ని భక్తులు పరమ పవిత్రంగా భావిస్తుంటారు. అలాంటి హుండీ కింద పడిపోవడంపై భక్తులు ఆందోళన చెందారు. అయితే ఈ ఘటనపై స్పందించిన టీటీడీ అధికారులు .. సిబ్బంది నిర్లక్ష్యం కారణంగానే హుండీ కింద పడి పోయినట్లు అనుమానం వ్యక్తం చేస్తున్నారు.
తాజావార్తలు
-
LA 2028 Olympics: ఒలింపిక్స్‌లో భారత్-పాక్ హైవోల్టేజ్ మ్యాచ్ ఉంటుందా? క్లారిటీ ఇదిగో..
-
Samudra: ఆ వసూళ్లతో నాకేం సంబంధం లేదు.. ఎవరైనా నా పేరు వాడితే ఊరుకోను
-
Sudha Kongara: ఆ సినిమా రిలీజ్ ఆపండి.. కోర్టుకెక్కిన సుధా కొంగర!
-
Amazon Mystery: ప్రపంచానికి దూరంగా మరో ప్రపంచం.. అమెజాన్ అడవిలో ఇప్పటికీ రహస్యంగా జీవిస్తున్న తెగలు
-
WTC Points Table: డబ్ల్యూటీసీ ఫైనల్ రేసులో న్యూజిలాండ్.. ఇంగ్లండ్, భారత్ అవకాశాలు సంక్లిష్టం!
ట్రెండింగ్
-
Jai Moondra: వాడు మనోడు కాదు.. పగోడు.. మొత్తం పరువు తీసేశాడుగా!
-
Inspiring Success Story: అమ్మ బంగారు గాజులు.. కూతురి బంగారు భవిష్యత్తు.. యువతి ఎమోషనల్ పోస్ట్ వైరల్
-
IND vs ENG 1st T20: తొలి టీ20లో వైభవ్ అరంగేట్రం.. సంజుకు కూడా ఛాన్స్.. వేటు ఎవరిపై!
-
PBKS Star: పంజాబ్ కింగ్స్ స్టార్ క్రికెటర్‌పై ఎఫ్ఐఆర్ నమోదు.. వంట మనిషిపై..!
-
Clean and Clutter Free Home: బిజీ లైఫ్‌లోనూ క్లీన్ హోమ్ సాధ్యం.. పరిశుభ్రమైన ఇంటి రహస్యం ఇదే.!