తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి వారి ఆలయంలో అపశృతి చోటుచేసుకుంది. మహాద్వారం వద్ద స్వామివారి హుండీ పడిపోయింది. ఆలయం నుంచి శ్రీవారి హుండీని లారీలో పరకామణి మండపానికి తరలిస్తుండగా ఈ ఘటన చోటు చేసుకుంది.
ప్రపంచాన్ని వణికించిన కరోనా మహమ్మారి తగ్గుముఖం పట్టిన తర్వాత సాధారణ పరిస్థితులు నెలకొన్నాయి.. ఇక, కలియుగ ప్రత్యక్షదైవం తిరుమలలో భక్తుల రద్దీ క్రమంగా పెరుగుతూ వస్తోంది.. భక్తుల తాకిడితో పాటు శ్రీవారి హుండీ ఆదాయం కూడా ఏ మాత్రం తగ్గడం లేదు.. కరోనా సమయంలో పడిపోయిన హుండీ ఆదాయం ఆ తర్వాత ఏ నెల తీసుకున్నా రూ.100 కోట్ల మార్క్ కంటే తక్కువగా వచ్చిందే లేదు.. ఇవాళ శ్రీవారి హుండి ఆదాయం 4.18 కోట్లు రాగా… వరుసగా…