Rapthadu Attack: రాప్తాడు ఘటన.. గాయపడిన విద్యార్థినికి మెరుగైన వైద్యం కోసం బెంగళూరు తరలింపు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
అనంతపురం జిల్లా రాప్తాడు జడ్పీ హైస్కూల్లో పదో తరగతి విద్యార్థినిపై జరిగిన ఉన్మాది దాడి ఘటన తీవ్ర దిగ్భ్రాంతిని కలిగించింది. పాఠశాల ఆవరణలోనే విద్యార్థినిపై దాడి జరగడంతో ఆమె తీవ్రంగా గాయపడింది. ఈ విషయం తెలిసిన వెంటనే రాష్ట్ర విద్య, ఐటీ శాఖల మంత్రి నారా లోకేష్ తక్షణమే స్పందించి, సహాయక చర్యలను స్వయంగా పర్యవేక్షించి.. జిల్లా యంత్రాంగం, పోలీసు అధికారులు, విద్యాశాఖ అధికారులతో మాట్లాడారు. బాధితురాలి ఆరోగ్య పరిస్థితిని సమీక్షించిన అనంతరం, ఆమెకు మరింత మెరుగైన అత్యవసర వైద్యం అందించాల్సిన అవసరం ఉందని భావించి, బెంగళూరులోని మణిపాల్ ఆస్పత్రికి తరలించాలని నిర్ణయించారు.
విద్యార్థిని ప్రాణాలను కాపాడటమే ధ్యేయంగా మంత్రి లోకేష్ స్వయంగా బెంగళూరు మణిపాల్ ఆస్పత్రి ఉన్నత స్థాయి వైద్య బృందంతో మాట్లాడారు. బాధితురాలికి అత్యుత్తమ వైద్య సేవలు అందించాలని ప్రత్యేకంగా కోరారు. ఆస్పత్రికి త్వరగా చేర్చేందుకు ఎలాంటి ట్రాఫిక్ ఆటంకాలు లేకుండా ‘గ్రీన్ ఛానల్’ ఏర్పాటు చేయాలని కర్ణాటక ప్రభుత్వంతో కూడా మాట్లాడి ఏర్పాట్లు పూర్తి చేయించారు.
Also Read
- Eggs Collection: ఒక్కో యువతికి రూ.30 వేలు ఇచ్చి అండాల సేకరణ.. హైదరాబాద్లో వెలుగులోకి కొత్త మాఫియా..
- Omar Abdullah: జమ్మూ కశ్మీర్ సీఎం ఒమర్ అబ్దుల్లా రెండో పెళ్లి.. పెళ్లికూతురు ఎవరంటే..
- Yogi Adityanath: 1.27 కోట్ల మంది హిందువుల ఓట్లు గల్లంతు.. యోగి సంచలన వ్యాఖ్యలు..
- Pune: కొడుకుతో సహా 18వ అంతస్తు నుంచి దూకిన మహిళ.. భర్త మరో పెళ్లి చేసుకోవాలని లేఖ!
స్థానిక ఆసుపత్రి నుంచి బెంగళూరు తరలించే వరకు ప్రతి క్షణం అధికారులతో, వైద్యులతో మంత్రి సమన్వయం చేసుకుంటూ పరిస్థితిని పర్యవేక్షించారు. విద్యార్థినికి అవసరమైన అన్ని రకాల వైద్య సహాయం అందిస్తామని, ఆమె త్వరగా కోలుకోవడానికి ప్రభుత్వం పూర్తి అండగా ఉంటుందని హామీ ఇచ్చారు. మరోవైపు ఈ దారుణానికి ఒడిగట్టిన నిందితుడిపై కఠిన చర్యలు తీసుకోవాలని ఆదేశించారు.
తాజావార్తలు
-
Rapthadu Attack: రాప్తాడు ఘటన.. గాయపడిన విద్యార్థినికి మెరుగైన వైద్యం కోసం బెంగళూరు తరలింపు..
-
Eggs Collection: ఒక్కో యువతికి రూ.30 వేలు ఇచ్చి అండాల సేకరణ.. హైదరాబాద్లో వెలుగులోకి కొత్త మాఫియా..
-
Omar Abdullah: జమ్మూ కశ్మీర్ సీఎం ఒమర్ అబ్దుల్లా రెండో పెళ్లి.. పెళ్లికూతురు ఎవరంటే..
-
Dragon: ఎన్టీఆర్ ‘డ్రాగన్’లో మరో మ్యూజిక్ డైరెక్టర్?
-
Yogi Adityanath: 1.27 కోట్ల మంది హిందువుల ఓట్లు గల్లంతు.. యోగి సంచలన వ్యాఖ్యలు..
ట్రెండింగ్
-
TB Prevention : టీబీ చికిత్సలో కీలక మార్పు.. మాత్రలకు బదులు ఇంజెక్షన్లు!
-
Nitish Kumar Reddy: ఆహా నితీష్ రెడ్డి.. విధి ఆడింది రా నీతో వింతనాటకం!
-
Green Moong Dal Laddu: ఫిట్నెస్ ప్రియుల కోసం స్పెషల్ రెసిపీ.. చక్కెర, బెల్లం లేకుండానే తియ్యని పెసరపప్పు లడ్డూలు..
-
Shreyas Iyer Record: టాస్లలో ‘రారాజు’ శ్రేయస్ అయ్యర్!
-
Ryan Rickelton: ‘మీ అమ్మ సింగిలా?’.. అభిమాని ప్లకార్డుతో షాకైన స్టార్ క్రికెటర్!