Eggs Collection: ఒక్కో యువతికి రూ.30 వేలు ఇచ్చి అండాల సేకరణ.. హైదరాబాద్‌లో వెలుగులోకి కొత్త మాఫియా..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
హైదరాబాద్ మహానగరంలో యువతుల ఆర్థిక ఇబ్బందులు, అమాయకత్వాన్ని ఆసరాగా చేసుకుని సాగిస్తున్న అక్రమ అండాల సేకరణ , సరఫరా ముఠా గుట్టును పోలీసులు రట్టు చేశారు. మల్కాజ్గిరి స్పెషల్ ఆపరేషన్ టీమ్ (SOT) తో పాటు బేగంపేట, సరూర్‌నగర్ పోలీసులు జరిపిన సంయుక్త దాడుల్లో ఈ దందా వెలుగులోకి వచ్చింది. బేగంపేట్‌లోని ప్రకాష్‌నగర్‌లో ఒక మహిళా హాస్టల్ ముసుగులో, అలాగే సరూర్‌నగర్ పరిధిలో అక్రమంగా నిర్వహిస్తున్న కేంద్రాలపై పోలీసులు దాడులు నిర్వహించి ప్రధాన సూత్రధారి దుర్గాప్రసాద్‌తో పాటు పలువురిని అదుపులోకి తీసుకున్నారు.
వివిధ గ్రామీణ ప్రాంతాలతో పాటు బీహార్, ఉత్తరప్రదేశ్, ఒడిశా వంటి ఇతర రాష్ట్రాల నుంచి ఉద్యోగాలు లేదా ఉపాధి నిమిత్తం నగరానికి వచ్చిన యువతులను ఈ మాఫియా టార్గెట్ చేసినట్లు విచారణలో తేలింది. పేదరికంలో ఉన్న యువతులకు ఆశ చూపి, మాయమాటలు చెప్పి ట్రాప్ చేస్తూ, ఒక్కో యువతికి రూ.30,000 వరకు చెల్లించి అండాలను సేకరిస్తున్నారు. ఈ క్రమంలో యువతుల ఆరోగ్య భద్రతను పక్కనపెట్టి, నిబంధనలకు విరుద్ధంగా హార్మోనల్ ఇంజెక్షన్లు ఇస్తూ ఈ దందాను నడిపిస్తున్నట్లు అధికారులు గుర్తించారు.
Also Read
- Pune: కొడుకుతో సహా 18వ అంతస్తు నుంచి దూకిన మహిళ.. భర్త మరో పెళ్లి చేసుకోవాలని లేఖ!
- Mule Accounts : సైబర్ నేరగాళ్లకు ‘మ్యూల్’ ఖాతాల విక్రయం... అంతర్రాష్ట్ర ముఠా గుట్టురట్టు, ముగ్గురు అరెస్ట్!
- Meerpet : సీజ్ చేసిన ఫోన్, బంగారాన్ని కాజేసిన కానిస్టేబుల్ అరెస్ట్!
- Honor X9e s: హానర్ X9e s స్మార్ట్‌ఫోన్ లాంచ్.. 8,560mAh భారీ బ్యాటరీ, 50MP కెమెరా, 120Hz AMOLED డిస్ప్లే
ఈ దాడుల సమయంలో సుమారు 30 మంది యువతులను పోలీసులు అదుపులోకి తీసుకుని రక్షించారు. ఇలా సేకరించిన అండాలను హైదరాబాద్‌లోని ప్రధాన కార్పొరేట్ ఐవీఎఫ్ (IVF) కేంద్రాలతో పాటు ఢిల్లీ, ముంబై వంటి మెట్రో నగరాల్లోని ఫెర్టిలిటీ క్లినిక్‌లకు భారీ ధరకు విక్రయిస్తున్నట్లు సమాచారం అందింది. ప్రస్తుతం నిందితుడు దుర్గాప్రసాద్‌ను విచారిస్తున్న పోలీసులు, ఈ అక్రమ నెట్వర్క్ వెనుక ఉన్న అసలు సూత్రధారులు ఎవరు, ఏయే ప్రముఖ ఆసుపత్రులు , ఫెర్టిలిటీ సెంటర్లు వీరితో చేతులు కలిపాయనే కోణంలో సమగ్ర దర్యాప్తు జరుపుతున్నారు. చట్టవిరుద్ధంగా సాగుతున్న ఈ హార్మోన్ల వ్యాపారంపై కఠిన చర్యలు తీసుకునేందుకు అధికారులు సిద్ధమవుతున్నారు.
తాజావార్తలు
-
Eggs Collection: ఒక్కో యువతికి రూ.30 వేలు ఇచ్చి అండాల సేకరణ.. హైదరాబాద్‌లో వెలుగులోకి కొత్త మాఫియా..
-
Omar Abdullah: జమ్మూ కశ్మీర్ సీఎం ఒమర్ అబ్దుల్లా రెండో పెళ్లి.. పెళ్లికూతురు ఎవరంటే..
-
Dragon: ఎన్టీఆర్ ‘డ్రాగన్’లో మరో మ్యూజిక్ డైరెక్టర్?
-
Yogi Adityanath: 1.27 కోట్ల మంది హిందువుల ఓట్లు గల్లంతు.. యోగి సంచలన వ్యాఖ్యలు..
-
Ramayana: “నా మనసంతా హైదరాబాద్‌లోనే ఉంది”.. రకుల్ ప్రీత్ సింగ్ ఎమోషనల్!
ట్రెండింగ్
-
TB Prevention : టీబీ చికిత్సలో కీలక మార్పు.. మాత్రలకు బదులు ఇంజెక్షన్లు!
-
Nitish Kumar Reddy: ఆహా నితీష్ రెడ్డి.. విధి ఆడింది రా నీతో వింతనాటకం!
-
Green Moong Dal Laddu: ఫిట్నెస్ ప్రియుల కోసం స్పెషల్ రెసిపీ.. చక్కెర, బెల్లం లేకుండానే తియ్యని పెసరపప్పు లడ్డూలు..
-
Shreyas Iyer Record: టాస్‌లలో ‘రారాజు’ శ్రేయస్ అయ్యర్!
-
Ryan Rickelton: ‘మీ అమ్మ సింగిలా?’.. అభిమాని ప్లకార్డుతో షాకైన స్టార్ క్రికెటర్!