Yogi Adityanath: 1.27 కోట్ల మంది హిందువుల ఓట్లు గల్లంతు.. యోగి సంచలన వ్యాఖ్యలు..
- ఓటర్ల జాబితాలో 1.27 కోట్ల హిందువుల పేర్లు లేవు..
- అర్హులైన ప్రతీ ఒక్కరి పేరు జాబితాలో ఉండేలా చూడాలి..
- కార్యకర్తలకు సీఎం యోగి ఆదిత్య నాథ్ ఆదేశాలు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Yogi Adityanath: ఉత్తర్ ప్రదేశ్ ఓటర్ల జాబితాలో భారీ సంఖ్యలో హిందువుల పేర్లు గల్లంతయ్యాయని సీఎం యోగి ఆదిత్యనాథ్ ఆరోపించారు. సుమారు 1.27 కోట్ల మంది హిందువుల పేర్లు ఓటర్ల జాబితాలో లేవని చెప్పారు. అర్హులైన ప్రతీ ఒక్కరి పేరును ఓటర్ల జాబితాలో చేర్చేలా బీజేపీ కార్యకర్తలు అప్రమత్తంగా వ్యవహరించాలని సూచించారు. శుక్రవారం జరిగిన బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సమావేశంలో యోగి ఈ వ్యాఖ్యలు చేశారు. ఓటర్ల జాబితా స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్(SIR) ప్రక్రియపై పార్టీ నాయకులు, కార్యకర్తలు ప్రత్యేక దృష్టిపెట్టాలని చెప్పారు. బూత్ స్థాయి అధికారులతో (BLOs) సమన్వయం చేసుకుంటూ అర్హులైన ఓటర్ల పేర్లు జాబితాలో ఉండేలా చూడాలని ఆదేశించారు.
ఓటర్ల జాబితా నుంచి పేర్లు తొలగిపోవడం వల్ల రాష్ట్రంలోని 28 పట్టణ స్థానిక సంస్థల నియోజకవర్గాల్లో బీజేపీ బలహీనపడుతోందని యోగి వ్యాఖ్యానించారు. ఉత్తరప్రదేశ్లో 16 కోట్లకు పైగా ఓటర్లు ఉండాల్సి ఉండగా, ప్రస్తుతం సుమారు 13 కోట్ల మంది మాత్రమే ఓటర్లుగా ఉన్నారని ఆయన పేర్కొన్నారు. పంచాయతీ ఓటర్ల జాబితాలో పేర్లు ఉన్నప్పటికీ, అసెంబ్లీ నియోజకవర్గాల ఓటర్ల జాబితాలో 66 లక్షల మంది పేర్లు లేవని అన్నారు. ప్రభుత్వ సంక్షేమ పథకాల ద్వారా లబ్ధి పొందుతున్న 55 లక్షల మంది పేర్లు కూడా ఓటర్ల జాబితాలో లేవని ఆరోపించారు. 18 నుంచి 19 ఏళ్ల వయసున్న సుమారు 4.5 లక్షల మంది యువ ఓటర్ల పేర్లు కూడా జాబితాలో లేవని చెప్పారు.
Also Read
- Pune: కొడుకుతో సహా 18వ అంతస్తు నుంచి దూకిన మహిళ.. భర్త మరో పెళ్లి చేసుకోవాలని లేఖ!
- Rajasthan: 40 విల్లాలు, కాటేజీలు.. IAS-IPS దంపతుల అవినీతి బాగోతం..
- Punjab elections: ఆప్ తొలి జాబితా విడుదల.. ధురి నుంచి సీఎం పోటీ, జైలులో ఉన్న ఎమ్మెల్యేకు టికెట్.
- CM Vijay: తేని జైలు నుంచి 17 మంది ఖైదీలు పరార్.. సీఎం విజయ్ సంచలన చర్య, అధికారులపై వేటు!
గతంలో జరిగిన ఎస్ఐఆర్ ప్రక్రియలో యూపీ ఓటర్ జాబితాలో కేవలం 4 లక్షల మంది పేర్లు మాత్రమే కొత్తగా చేరాయని, ఈసారి అర్హులైన ఓటర్ల పేర్లు జాబితాలో ఉండేలా బూత్ లెవల్ ఆఫీసర్లతో సమన్వయం చేసుకోవాలని బీజేపీ కార్యకర్తలకు సూచించారు. హిందూ ఓటర్ల పేర్లు ఓటర్ల జాబితాలో ఉండేలా ఎంపీలు, ఎమ్మెల్యేలు కూడా బాధ్యతలు తీసుకోవాలని అన్నారు.
ఇదిలా ఉంటే, ఉత్తర్ ప్రదేశ్ ఎస్ఐఆర్ ప్రక్రియ తర్వాత 2.04 కోట్లకు పైగా ఓటర్ల పేర్లు జాబితా నుంచి తొలగించారు. ఈ తొలగింపులు ఎక్కువగా పట్టణ ప్రాంతాల్లో నమోదయ్యాయని, వీరిలో మహిళలు అధిక శాతంలో ఉన్నట్లు తెలుస్తోంది. అదే సమయంలో 84 లక్షలకు పైగా కొత్త ఓటర్ల పేర్లు జాబితాలో చేర్చారు. దీంతో ఉత్తరప్రదేశ్ తుది ఓటర్ల సంఖ్య 13,39,84,792కు చేరింది.
తాజావార్తలు
-
Yogi Adityanath: 1.27 కోట్ల మంది హిందువుల ఓట్లు గల్లంతు.. యోగి సంచలన వ్యాఖ్యలు..
-
Ramayana: “నా మనసంతా హైదరాబాద్లోనే ఉంది”.. రకుల్ ప్రీత్ సింగ్ ఎమోషనల్!
-
Shekar Kammula : “వైలెన్స్ ఉంటేనే సినిమా హిట్ అనుకోవడం భ్రమ.. శేఖర్ కమ్ముల సంచలన వ్యాఖ్యలు
-
Anirudh : హీరోలను మించిపోతున్న అనిరుద్ రెమ్యునరేషన్
-
RC 17 : రామ్ చరణ్ ‘RC 17’ కోసం రంగంలోకి అనిరుధ్
ట్రెండింగ్
-
TB Prevention : టీబీ చికిత్సలో కీలక మార్పు.. మాత్రలకు బదులు ఇంజెక్షన్లు!
-
Nitish Kumar Reddy: ఆహా నితీష్ రెడ్డి.. విధి ఆడింది రా నీతో వింతనాటకం!
-
Green Moong Dal Laddu: ఫిట్నెస్ ప్రియుల కోసం స్పెషల్ రెసిపీ.. చక్కెర, బెల్లం లేకుండానే తియ్యని పెసరపప్పు లడ్డూలు..
-
Shreyas Iyer Record: టాస్లలో ‘రారాజు’ శ్రేయస్ అయ్యర్!
-
Ryan Rickelton: ‘మీ అమ్మ సింగిలా?’.. అభిమాని ప్లకార్డుతో షాకైన స్టార్ క్రికెటర్!