Tamil Nadu: తమిళనాడులోని కృష్ణగిరి జిల్లాలోని బార్గూర్ సమీపంలోని ఒక ప్రభుత్వ పాఠశాలలో 8వ తరగతి చదువుతున్న బాలికను అదే పాఠశాలలో పనిచేస్తున్న ముగ్గురు ఉపాధ్యాయులు సామూహికంగా అత్యాచారం చేసి గర్భవతిని చేశారు. ఈ విషయం ఆలస్యంగా వెలుగులోకి రావడంతో బాలిక తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో పోలీసులు ముగ్గురు ఉపాధ్యాయులను అరెస్టు చేశారు. ఈ ఘటన రాష్ట్రవ్యాప్తంగా సంచలనం సృష్టించింది. బాలిక పాఠశాలకు రాకపోవడంతో అనుమానం వచ్చిన పాఠశాల ప్రధానోపాధ్యాయుడు బాలిక ఇంటికి వెళ్లి…
Gurukul Students Missing : సూర్యాపేట జిల్లా కోదాడ మండలం దొరకుంట సమీపంలోని నెమలిపురి సాంఘిక సంక్షేమ బాలుర గురుకుల పాఠశాలలో ఆరుగురు పదవ తరగతి విద్యార్థులు అదృశ్యమైన ఘటన కలకలం రేపింది. విద్యా సంవత్సరం ముగింపు సందర్భంగా గురుకులంలో ఉపాధ్యాయులు వీడ్కోలు పార్టీ నిర్వహించారు. ఈ సందర్భంగా కొందరు విద్యార్థులు మద్యం సేవించి పార్టీకి హాజరయ్యారు. వారి ప్రవర్తనతో తోటి విద్యార్థులతో గొడవ జరిగింది. ఈ విషయాన్ని ఉపాధ్యాయులు గమనించి వారిని మందలించారు. ఉపాధ్యాయుల మందలింపుతో…
Teachers Dismiss: యాదాద్రి భువనగిరి జిల్లాలో సుదీర్ఘ కాలం పాటు విధులకు గైర్హాజరయ్యే ఉపాధ్యాయులను, విద్యాశాఖ సీరియస్ గా పరిగణించి చర్యలు తీసుకుంది. ఈ నేపథ్యంలో 16 మంది ప్రభుత్వ ఉపాధ్యాయులను వారి సర్వీస్ ల నుండి తొలగించాలని నిర్ణయించారు. ఈ ఉపాధ్యాయుల్లో 9 మంది మహిళ ఉపాధ్యాయులు కూడా ఉండగా, మొత్తం 16 మంది ఎస్జిటి (స్కూల్ జూనియర్ టీచర్స్) లు సర్వీస్ నుండి తొలగింపుకు గురయ్యారు. ఈ ఉపాధ్యాయులు, సుదీర్ఘ కాలం పాటు విద్యా…
Terrorist Attack : పాకిస్తాన్లో దారుణం చోటు చేసుకుంది. పరీక్షల సందర్భంగా విధులు నిర్వహిస్తున్న టీచర్లపై టెర్రరిస్టులు కాల్పులు చేశారు. ఈ ఘటనలో ఎనిమిది మంది టీచర్లు ప్రాణాలు కోల్పోయారు.
సర్కారీ బడుల రూపరేఖల్ని మార్చేస్తున్న జగన్ సర్కార్… విద్యార్థులకు మెరుగైన విద్య అందేందుకు చర్యలు చేపడుతోంది. టీచర్లు రోజూ స్కూల్‌కు రావడమే కాదు… సమయపాలన పాటించేలా చేస్తోంది. దీనికోసం నేటి నుంచి ఫేషియల్ రికగ్నిషన్ యాప్‌ను ఉపయోగించబోతోంది. నాడు-నేడు కార్యక్రమంలో భాగంగా ప్రభుత్వ స్కూళ్లలో మౌలిక వసతులు కల్పిస్తోంది ఏపీ సర్కార్. ఇప్పుడు విద్యార్థులకు నాణ్యమైన విద్యను అందించడానికి కూడా నడుం కట్టింది. టీచర్లకు ప్రత్యేకంగా తయారు చేసిన ఫేషియల్ రికగ్నిషన్ యాప్‌ను ప్రారంభించబోతున్నారు ముఖ్యమంత్ వైఎస్…