Tragedy: ఒకే కాన్పులో ముగ్గురు పిల్లలు.. ఆ తల్లి కళ్లారా చూసుకునేలోపే..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Tragedy: ఆ తల్లి ఎన్ని ఆశలు పెట్టుకోందో… నవమాసాలు మోసి తల్లికి ఒకే కాన్పులో ముగ్గురు పిల్లలకు జన్మనిచ్చిన సంతోషం ఎక్కువ సేపు నిలువలేదు …కన్న బిడ్డలను కళ్ళారా చూసుకునేలోపు పుట్టిన ముగ్గురు పిల్లలు అనారోగ్యంతో మరి చెందడం అత్యంత విషాదాన్ని అకుటుంబంలో నింపింది. చౌడేపల్లి (మం)అన్నిపల్లికి చెందిన తల్లి పవిత్రను ఓదార్చడం ఎవరితరం కాలేదు. అన్నమయ్య జిల్లాలో చోటుకుంది ఈ విషాద ఘటన అందరినీ కలచివేస్తోంది.
Also Read: Kanwar Yatra: కన్వర్ యాత్ర బస్సుకు కరెంట్‌షాక్.. ఐదుగురు శివ భక్తులు మృతి
Also Read
అన్నమయ్య జిల్లాలోని చౌడేపల్లి మండలం అన్నిపల్లికి చెందిన పవిత్ర(22) అనే మహిళకు శనివారం నొప్పులు రావడంతో 108 వాహనంలో మదనపల్లి ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. ఆస్పత్రికి తరలించేలోపే 108 వాహనంలోనే ఆ మహిళ ఆడపిల్లలకు జన్మనిచ్చింది. పుట్టిన పిల్లలకు వెంటనే ఆరోగ్యం మందగించసాగింది. బిడ్డల పరిస్థితి విషమంగా ఉండడంతో వైద్యులు తిరుపతికి రెఫర్ చేశారు. వెంటనే తిరుపతికి వెళ్లాలని కుటుంబసభ్యులు నిర్ణయించుకున్నారు. ఈ నేపథ్యంలో తిరుపతికి తరలిస్తుండగా మార్గమధ్యంలో ముగ్గురు బిడ్డలు మృతి చెందారు. పుట్టిన కాసేపటికే పిల్లలు ప్రాణాలు కోల్పోవడంతో ఆ కుటుంబాన్ని విషాదఛాయలు అలుముకున్నాయి. ఆ తల్లి వేదన అంతా ఇంతా కాదు. తన కడుపులో మోసిన పిల్లలను చూడకుండానే వారు తిరిగిరాని లోకాలకు వెళ్లడంతో ఆ మహిళ కన్నీటిపర్యంతమైంది. ఆమెను ఓదార్చడం ఎవరి తరం కాలేదు.
తాజావార్తలు
-
Ebola Virus : గాంధీ ఆసుపత్రిలో సుడాన్ వ్యక్తికి ‘ఎబోలా’ నెగిటివ్.. ఊపిరి పీల్చుకున్న వైద్యులు
-
Shreyas Iyer: చరిత్రను లిఖించనున్న శ్రేయస్ అయ్యర్.. 2028 వరకు కెప్టెన్‌గా సర్పంచ్ సాబ్..
-
Hyderabad: బంధాల్ని తెంచుతున్న వివాహేతర సంబంధాలు.. తెలుగు రాష్ట్రాల్లో కలకలం
-
NTR Viral Tweet: కుకీలు పంపమన్న అభిమాని.. ఎన్టీఆర్ క్రేజీ రిప్లై ట్వీట్ వైరల్!
-
Natural gas: భారత్‌కు జాక్‌పాట్.. అండమాన్‌లో గ్యాస్ నిల్వలు..
ట్రెండింగ్
-
Kitchen Tips : వండిన తర్వాత వచ్చే వెల్లుల్లి, చేపల వాసనను తొలగించడానికి ఇవి ఉంటే సరిపోతుంది.
-
Ants Control Tips : ఇంట్లో చీమల దండయాత్రా..? మీకు తెలియకుండానే చేస్తున్న ఈ తప్పులే కారణం.!
-
Career Growth : AI ప్రపంచంలో రాణించాలంటే.. ఈ 4 నైపుణ్యాలు నేర్చుకోండి
-
WhatsApp: మీ వాట్సాప్ చాట్స్ సురక్షితమేనా.? ఈ ఒక్క సెట్టింగ్ ఆన్ చేస్తే సేఫ్.!
-
Rajma Chawal: క్విక్ అండ్ హెల్దీ మీల్.. “రాజ్మా రైస్”తో హై ప్రోటీన్ లంచ్.!