Ponnam Prabhakar Counters On BJP and PM Modi Telangana Tour: తెలంగాణలో బీజేపీ డ్యామేజ్‌ని కంట్రోల్ చేసుకోవడం కోసం ప్రధాని మోడీ రాష్ట్ర పర్యటనకు వస్తున్నారని మాజీ ఎంపీ పొన్నం ప్రభాకర్ వ్యాఖ్యానించారు. రాజన్నసిరిసిల్ల జిల్లా వేములవాడలో నిర్వహించిన ప్రెస్‌మీట్‌లో పొన్న ప్రభాకర్ మాట్లాడుతూ.. 2017లోనే సీఎం కేసీఆర్ రూ.3500 కోట్లతో ‘కాకతీయ టెక్స్‌టైల్ పార్క్’కు శంకుస్థాపన చేశారని, దీని ద్వారా 30 వేల ఉద్యోగ అవకాశాలు లభిస్తాయని కూడా ప్రకటించిందని గుర్తు చేశారు. మరి.. ప్రధాని మోడీ నడుస్తున్న టెక్స్‌లైట్ పార్క్‌కు శంకుస్థాపన చేస్తున్నారా? లేక కొత్తగా మంజూరు చేసిన దానికి చేస్తున్నారా? అనేది ప్రజలకు స్పష్టతనివ్వాలని డిమాండ్ చేశారు.
Kishan Reddy: బీఆర్ఎస్, కాంగ్రెస్ బొమ్మ-బోరుసు లాంటివి.. నీతివంతమైన పాలన తెస్తాం
పార్లమెంట్ సాక్షిగా.. రైల్వే కోచ్ ఫ్యాక్టరీకి రాష్ట్ర ప్రభుత్వం స్థలం సేకరించలేదని కేంద్రమంత్రి కిషన్ రెడ్డి చెప్పారని, ఇప్పుడు ప్రధాని మోడీ విభజన హామీలను నెరవేరుస్తున్నారని చెబుతూ రైల్వే కోచ్ ఫ్యాక్టరీ శంకుస్థాపన చేస్తున్నారని ప్రచారం చేయడంలో ఎంతవరకు నిజముందని పొన్న ప్రభాకర్ నిలదీశారు. అసలు వేస్తుంది రైల్వే కోచ్ ఫ్యాక్టరీనా, వ్యాగన్ వాషింగ్ ఫ్యాక్టరీనా? దీనిపై ప్రజలకు కిషన్‌రెడ్డి, మోడీ క్లారిటీ ఇవ్వాలన్నారు. సిరిసిల్లకు టెక్స్‌టైల్ పార్కును ఇవ్వాలని ఎన్నిసార్లు కోరినా పట్టించుకోని కేంద్రం.. ఇప్పుడు ప్రారంభించిన చోటే ఎందుకు ప్రారంభిస్తున్నారని ప్రశ్నించారు. కేంద్రమంత్రిగా ఉన్న కిషన్ రెడ్డికి ఎన్నిసార్లు చెప్పినా.. ఆయనకు కనపడకపోగా వినిపించలేదని ఎద్దేవా చేశారు.
Dimple Hayathi: ఫ్రంటు, బ్యాక్ చూపిస్తూ రెచ్చిపోయిన తెలుగమ్మాయి డింపుల్ హయతి
తాను పార్లమెంట్‌లో ఉన్న సమయంలో 2014లోనే వరంగల్ నుండి జగిత్యాలకు జాతీయ రహదారికి అనుమతులు తీసుకొచ్చామని.. ఈ రహదారి ఇప్పటికే రూ.40 కోట్లు ఖర్చు చేశారని పొన్న ప్రభాకర్ చెప్పారు. అప్పటి పార్లమెంట్ సభ్యుడు బోయినపల్లి వినోద్ కుమార్ అలైన్మెంట్ మార్చారని బండి సంజయ్‌కి తమ నేతలు పలుమార్లు చెప్పారని కూడా గుర్తు చేశారు. వినోద్ కుమార్ తన సొంత మెడికల్ కాలేజీ ప్రయోజనాల కోసం అలైన్మెంట్ మార్చారని విమర్శించారు. బండి సంజయ్ దీనిపై ఎందుకు మాట్లాడలేదలో ప్రజలు అర్థం చేసుకోవాలని సూచించారు. సిద్రాబాద్ పార్లమెంటరీ నియోజకవర్గం నుండి కిషన్‌రెడ్డిపై తమ అభ్యర్థి అంజన్ కుమార్ యాదవ్ పోటీ చేస్తే.. శ్రీనివాస్ యాదవ్ కొడుకును బరిలో దింపారన్నారు. ఒకే సామాజిక వర్గంలో ఓట్లు చీల్చి.. కిషన్ రెడ్డికి మేలు చేసే విధంగా బీఆర్ఎస్ ప్రయత్నించిందని ఆరోపించారు.
నిజామాబాద్‌లో బండి సంజయ్, కవితలు అన్నాచెల్లెళ్ల మాదిరిగా పలకరించుకోవడంపై పెద్ద చర్చ కూడా జరిగిందని.. దీన్ని బట్టి బీఆర్ఎస్, బీజేపీ ఒకటేనని అర్థం చేసుకోవచ్చని పొన్నం ప్రభాకర్ వ్యాఖ్యానించారు. 9 ఏళ్ల కేంద్ర పరిపాలన రాష్ట్రానికి ఇచ్చిందేమిటని ప్రశ్నించారు. ప్రజాస్వామ్య దేశంలో నిధులు మావంటే, మావి అని కొట్లాడుకున్న తీరు ఈ రాష్ట్రంలోనే చూశామని సెటైర్లు వేశారు. నిర్మలా సీతారామన్ రాష్ట్రానికి వచ్చి బాత్రూం దగ్గర, చౌకధర దుకాణాల దగ్గర మోడీ ఫోటో ఎక్కడ అని అడిగారే తప్ప.. ఏం చేశారని ఘాటుగా విమర్శించారు. బీజేపీ, బీఆర్ఎస్ ప్రభుత్వాలని ఎదుర్కొనేది ఒక్క కాంగ్రెస్ పార్టీనేనని ఉద్ఘాటించారు. జాతీయ రహదారిపై కారు చక్రాలు నాలుగు పంచరయ్యాయని బీఆర్ఎస్‌పై కౌంటర్ వేశారు.