Kidney Stones : మన శరీరంలోని ముఖ్యమైన అవయవాలలో కిడ్నీ ఒకటి. కిడ్నీ శరీరంలోని వ్యర్థాలను తొలగిస్తుంది. చాలా మంది కిడ్నీలను ఆరోగ్యంగా ఉంచుకోవడం పట్ల నిర్లక్ష్యం వహిస్తారు. కానీ ఇది రానురాను తరువాత ప్రాణాంతకం అవుతుంది. కిడ్నీలో మురికి పేరుకుపోవడం వల్ల రాళ్లు ఏర్పడే ప్రమాదం ఉంది. అనారోగ్యకరమైన ఆహారం, చెడు జీవనశైలి కారణంగా చాలా మందికి మూత్రపిండాల్లో రాళ్లు వస్తాయి. ఈ సమస్య చాలా బాధాకరం. అటువంటి పరిస్థితిలో ఆహారంలో కొన్ని ఆరోగ్యకరమైన పానీయాలను చేర్చుకోవచ్చు. ఇవి నొప్పిని తగ్గించడంలో సాయపడడమే కాకుండా.. రాళ్లను సులభంగా బయటకి పంపేందుకు సాయపడుతుంది. అందుకోసం డైట్ లో రెగ్యులర్ గా ఎలాంటి హెల్తీ డ్రింక్స్ తీసుకోవాలో తెలుసుకుందాం.
తగినంతగా నీరు
చాలా మంది తక్కువ నీటిని తాగుతారు. కానీ డీ హైడ్రేషన్ మూత్రపిండాల్లో రాళ్ల ప్రమాదాన్ని గణనీయంగా పెంచుతుంది. కాబట్టి, వీలైనంత ఎక్కువ నీటిని తాగాలి. కిడ్నీలో రాళ్ల నుంచి ఉపశమనం పొందేందుకు ఇది ఒక బెస్ట్ రెమెడీ. ఇది మీ శరీరం నుండి వ్యర్థాలను తొలగిస్తుంది. దీనితో పాటు మూత్రం ద్వారా రాళ్లు కూడా బయటకు వస్తాయి.
Read Also: Mla Sanjay Kumar : అప్పుడప్పుడు వైద్యం వికటించడం కామన్
ఆరెంజ్ జ్యూస్
ఆరెంజ్ చాలా ఆరోగ్యకరమైన, రుచికరమైన పండు. ఇందులో విటమిన్ సి పుష్కలంగా ఉంటుంది. ఇందులో సిట్రిక్ యాసిడ్ ఉంటుంది. క్రమం తప్పకుండా నారింజ రసం తాగితే.. ఇది కిడ్నీలో రాళ్లు ఏర్పడకుండా పనిచేస్తుంది.
పుచ్చకాయ జ్యూస్
కళింగ(పుచ్చకాయ)లో 90 శాతం నీరు. ఇది శరీరాన్ని హైడ్రేట్ గా ఉంచడంలో సహాయపడుతుంది. ఈ పండును వేసవిలో ఎంతో ఇష్టంగా తింటారు. ఇది చాలా ఆరోగ్యకరమైనది. ఇది కిడ్నీని శుభ్రపరచడానికి పనిచేస్తుంది. ఇది కిడ్నీలో రాళ్లు ఏర్పడకుండా చేస్తుంది. జ్యూస్‌ని అల్పాహారంగా కూడా తీసుకోవచ్చు.
నిమ్మ నీరు
ఒక గ్లాసు నిమ్మరసం వేసవిలో చాలా విశ్రాంతిని ఇస్తుంది. నిమ్మకాయలో సిట్రిక్ యాసిడ్ ఉంటుంది. ఇది మిమ్మల్ని హైడ్రేటెడ్‌గా ఉంచుతుంది. ఇది కిడ్నీలో రాళ్లను విచ్ఛిన్నం చేయడానికి పనిచేస్తుంది. దీని కారణంగా, రాయి సులభంగా కిడ్నీ నుండి బయటకు వెళ్లిపోతుంది.