జగిత్యాల ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ కుమార్ మరోసారి వివాదస్పద వ్యాఖ్యలు చేశారు. క్యాంపు కార్యాలయంలో సీఎం సహాయ నిధి చెక్కుల పంపిణీ కార్యక్రమంలో పాల్గొన్న ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్.. అప్పుడప్పుడూ వైద్యం వికటించొచ్చంటూ వ్యాఖ్యలు చేశారు. మహిళ కడుపులో క్లాత్ పెట్టారనేది రెండు సంవత్సరాల క్రితం జరిగిన ఘటన.. కానీ ఇప్పుడు పేపర్లలో వస్తుందున్నారు. ప్రభుత్వ ఆస్పత్రుల్లో వైద్య సేవలు పెరిగాయి. అప్పుడప్పుడూ వైద్యం వికటించడం సహజమంటూ ఎమ్మెల్యే సంజయ్ కుమార్ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు
Also Read : Poonch terror attack: పూంచ్ ఉగ్రదాడిలో ఏడుగురు టెర్రరిస్టుల హస్తం..
డాక్టర్లుతో నేను కాక సిబ్బందితో కూడా తప్పులు జరగొచ్చు.. డాక్టర్లు, నర్సుల సమిష్టి బాధ్యతతో ఆపరేషన్లు జరుగుతాయని వివరించారు. ప్రభుత్వ ఆస్పత్రులపై నమ్మకంతో వచ్చి వైద్యం చేయించుకోవాలని జగిత్యాల ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ కుమార్ అన్నారు. ప్రైవేట్ ఆస్పత్రుల్లోనూ ఇలాంటి ఘటనలు జరుగుతున్నాయన్నారు. ప్రభుత్వ హస్పటల్స్ కు పేషంట్ల తాకిడి పెరిగిందని.. అందుకే ఒకటి, రెండు ఘటనలు ఎక్కువ అవుతున్నాయని ఆయన చెప్పుకొచ్చారు. అంతమాత్రాన భయపడొద్దన్నారు.
Also Read : Vallabhaneni Vamsi Mohan: వల్లభనేని కౌంటర్ ఎటాక్.. వెంటిలేటర్‌పై ఉంది ఎవరు..?
ఆస్పత్రుల్లో చనిపోతే ఆస్పత్రికి వెళ్లడం మానేస్తామా అంటూ ఎమ్మెల్యే డాక్టర్ ఎమ్మెల్యే సంజయ్ కుమార్ వ్యాఖ్యానించారు. దీంతో ఎమ్మెల్యే కామెంట్స్ పై సర్వత్రా విమర్శలు వస్తున్నాయి. కాగా 16 నెలల క్రితం ప్రభుత్వ ఆస్పత్రిలో ఓ మహిళకు సర్జరీ ద్వారా డెలివరీ చేశారు.. అయితే కడుపులోనే బట్టను మరిచి ఆపరేషన్ పూర్తి చేశారు. సంవత్సరం తర్వాత మహిళకు తీవ్రమైన కడుపు నొప్పి వచ్చింది. ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో వైద్యుల సూచనతో స్కానింగ్ చేయించగా.. కడుపులో బట్ట ఉన్నట్లు గుర్తించారు. వెంటనే డాక్టర్లు మహిళకు ఆపరేషన్ చేసి క్లాత్ తీసి వేశారు. ఈ విషయం తెలుసుకున్న మహిళ బంధువులు క్లాత్ మరిచి ఆపరేషన్ చేసిన ఆస్పత్రి వద్ద ఆందోళనకు దిగారు. స్థానిక పెద్దల జోక్యంతో బాధితురాలికి వైద్య ఖర్చులు ఇప్పిస్తామని బంధువులకు నచ్చ చెప్పడంతో ఆందోళన విరమించారు. రూ. 7 లక్షలు వైద్య ఖర్చుల నిమిత్తం రోగి బంధువులకు అందజేశారు.