దీపావళి బోనస్ వస్తుందని ఎన్నో ఆశలు పెట్టుకున్నారు. పండుగ రానే వచ్చింది. కానీ బోనస్ మాత్రం అకౌంట్లలో పడలేదు. దీంతో ఒక్కసారిగా ఉద్యోగులకు చిర్రెత్తింది. డ్యూటీ పక్కన పెట్టి నిరసనకు దిగారు. అంతేకాకుండా అన్ని టోల్ గేట్లు ఎత్తేసి ఉచితంగా విడిచిపెట్టేశారు. దీంతో ఒక్కసారిగా యాజమాన్యం దిగొచ్చి కాళ్లబేరానికి వచ్చింది.
జియో వినియోగదారులకు గుడ్ న్యూస్. ఉచితంగా నెట్‌ఫ్లిక్స్, ప్రైమ్ వీడియోలను అందివ్వనుంది. అందుకోసం.. రిలయన్స్ జియో కొన్ని గొప్ప ప్లాన్‌లను మీ ముందుకు తీసుకొస్తుంది. జియో టాప్ 3 ప్లాన్లు తమ వినియోగదారులకు అందించబోతుంది. ఈ ప్లాన్‌లలో మీరు 84 రోజుల చెల్లుబాటుతో రోజుకు 3 GB డేటాను పొందుతారు.
టీ20 వరల్డ్ కప్కు సరిగ్గా నెల సమయం కూడా లేదు. ఐపీఎల్ అయిపోయిన వెంటనే.. ఈ మెగా టోర్నీ ప్రారంభంకానుంది. అమెరికా, వెస్టిండీస్ ఆతిధ్యమిస్తున్న టీ20 వరల్డ్ కప్.. జూన్ 2 నుంచి ప్రారంభం కానుంది. ఐపీఎల్ ను ఏంచక్కా ఎంజాయ్ చేస్తున్న క్రికెట్ అభిమానులకు.. మరో పండగ ప్రారంభం కానుంది. అయితే.. ఈ మెగా టోర్నీని చూసేందుకు డిస్నీ ప్లస్ హాట్ స్టార్ బంపర్ ఆఫర్ ప్రకటించింది.
తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం మహిళలకు టీఎస్ ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణం చేసే అవకాశాన్ని కల్పించింది. ఈరోజు మధ్యాహ్నం రెండు గంటల నుండి ఈ మహాలక్ష్మి పథకం ద్వారా ఆర్టీసీలో ఉచితంగా మహిళలు ప్రయాణించే కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. ఈ క్రమంలో రాష్ట్ర వ్యాప్తంగా ఆర్టీసీ బస్సులలో మహిళలకు ఉచిత ప్రయాణం కార్యక్రమాన్ని ప్రారంభించారు.
తెలంగాణ వ్యాప్తంగా మహిళలకు ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణం స్కీమ్ 'మహాలక్ష్మి' ప్రారంభమైంది. తెలంగాణ అసెంబ్లీ ముందు మహిళా మంత్రులు కొండా సురేఖా, సీతక్క, సీఎస్ శాంతికుమారి, తెలంగాణ మహిళా బాక్సర్ నిక్కత్ జరీన్ జెండా ఊపి ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో సీఎం రేవంత్ రెడ్డి, తెలంగాణ కాంగ్రెస్ ఇంచార్జ్ మాణిక్ రావ్ ఠాక్రే, పలువురు ఎమ్మెల్యేలు, , రవాణా శాఖ సెక్రటరీ వాణిప్రసాద్, ఇతర ఉన్నతాధికారులు పాల్గొన్నారు. అనంతరం మహిళా మంత్రులు, మహిళా ఎమ్మెల్యేలు, మహిళా…
ఆర్టీసీ మహిళల ఉచిత బస్సు ప్రయాణంపై మార్గదర్శకాలు జారీ చేశారు. బాలికలకు, మహిళలకు, ట్రాన్స్ జెండర్లకు అన్ని వయసుల వారికి ఉచిత బస్సు ప్రయాణం.. తెలంగాణ పరిధి వరకు వర్తిస్తుంది. రేపు మధ్యాహ్నం 2 గంటల నుంచి ఉచిత బస్సు ప్రయాణం అమలులోకి రానుంది. జిల్లాలో పల్లె వెలుగు, ఎక్స్ ప్రెస్ బస్సులలో అనుమతి ఉండనుంది. సిటీలో ఆర్డినరీ, ఎక్స్ ప్రెస్ బస్సులలో అనుమతి ఉండనుంది. కాగా.. అంతరాష్ట్ర బస్సులకు తెలంగాణ పరిధి వరకు ఉచితంగా ప్రయాణించవచ్చు.…
తెలంగాణ రాష్ట్రంలోని అన్ని వయసుల బాలికలు, మహిళలు, లింగమార్పిడి వ్యక్తుల కోసం మహాలక్ష్మి పథకం రేపటి నుంచి ప్రారంభం కానుంది. రాష్ట్రంలో TSRTC యొక్క పల్లె వెలుగు, ఎక్స్‌ప్రెస్ బస్సులలో మహాలక్ష్మి పథకం అమలవుతుందని ప్రభుత్వం జీవో జారీ చేసింది. తెలంగాణలో నివాసం ఉంటున్న అన్ని వయసుల బాలికలు మరియు మహిళలు, లింగమార్పిడి వ్యక్తులకు ఈ పథకం వర్తిస్తుంది. 9వ తేదీ(శనివారం) మధ్యాహ్నం నుండి పల్లె వెలుగు, ఎక్స్‌ప్రెస్ బస్సులలో తెలంగాణ రాష్ట్ర సరిహద్దులలో ఎక్కడికైనా ప్రయాణించవచ్చు.…
ఎన్నికల సమయం దగ్గర పడుతున్న కొద్దీ రాజకీయ పార్టీల నేతలు భారీ ఆఫర్లు ప్రకటిస్తున్నారు. అందులో భాగంగానే.. మధ్యప్రదేశ్ ఎన్నికల ప్రచారంలో ఉన్న కేంద్ర హోంమంత్రి అమిత్ షా అక్కడి జనాలకు ఓ హామీ ఇచ్చారు. సోమవారం విదిశలో ఎన్నికల ర్యాలీలో పాల్గొన్న ఆయన.. వచ్చే ఎన్నికల్లో మధ్యప్రదేశ్ లో తాము అధికారంలోకి వస్తే ఎలాంటి ఖర్చు లేకుండా రాష్ట్ర ప్రజలకు అయోధ్య రామ మందిర దర్శనం కల్పిస్తామన్నారు.
ఢిల్లీలోని జాతీయ ఆహార భద్రత కార్డుదారులకు ఇప్పుడు ఉచిత చక్కెర లభించనుంది. సోమవారం కేబినెట్ సమావేశంలో ముఖ్యమంత్రి కేజ్రీవాల్ ఈ నిర్ణయాన్ని తీసుకున్నారు.
Free Condoms : కొత్త సంవత్సరం ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది. ఇకపై యువతకు కండోమ్‌లు ఉచితంగా అందిచనున్నారు. 18 నుంచి 25 ఏళ్ల వయసున్న వారికి కండోమ్‌లను ఫ్రీగా ఇవ్వనున్నట్లు ఇప్పటికే ఫ్రెంచ్ అధ్యక్షుడు ఇమ్మాన్యుయెల్ మాక్రాన్ ప్రకటించారు.