Longest Bus Route in India : మహారాష్ట్ర, కర్ణాటకలలో దశాబ్దాల నాటి భాషా వివాదం మరోసారి వేడెక్కింది. మరాఠీ, కన్నడ మద్దతుదారుల మధ్య ఈ వివాదం అనేక సంఘటనలకు దారితీసింది.
ఆర్టీసీ మహిళల ఉచిత బస్సు ప్రయాణంపై మార్గదర్శకాలు జారీ చేశారు. బాలికలకు, మహిళలకు, ట్రాన్స్ జెండర్లకు అన్ని వయసుల వారికి ఉచిత బస్సు ప్రయాణం.. తెలంగాణ పరిధి వరకు వర్తిస్తుంది. రేపు మధ్యాహ్నం 2 గంటల నుంచి ఉచిత బస్సు ప్రయాణం అమలులోకి రానుంది. జిల్లాలో పల్లె వెలుగు, ఎక్స్ ప్రెస్ బస్సులలో అనుమతి ఉండనుంది. సిటీలో ఆర్డినరీ, ఎక్స్ ప్రెస్ బస్సులలో అనుమతి ఉండనుంది. కాగా.. అంతరాష్ట్ర బస్సులకు తెలంగాణ పరిధి వరకు ఉచితంగా ప్రయాణించవచ్చు.…
భారత్-బంగ్లాదేశ్‌ల మధ్య బస్సు సర్వీసులు పునఃప్రారంభమయ్యాయి. కరోనా నేపథ్యంలో రెండేళ్ల క్రితం ఇరు దేశాల మధ్య ఈ బస్సు సర్వీసులను నిలిపేసిన విషయం తెలిసిందే. త్రిపుర రాజధాని అగర్తల నుంచి బంగ్లాదేశ్ రాజధాని ఢాకా మీదుగా కోల్‌కతాకు వచ్చే బస్సు సర్వీసును పునరుద్ధరించారు. కరోనా తగ్గుముఖం పట్టడంతో ఈ సర్వీసులను ఇవాళ మళ్లీ ప్రారంభించారు. అగర్తలా ఇంటిగ్రేటెడ్ చెక్ పోస్ట్-ఆఖావ్డా, హరిదాస్‌పూర్ ఇంటిగ్రేటెడ్ చెక్ పోస్ట్-బేనాపూల్ మధ్య ఈ బస్సు సర్వీసులు అందుబాటులో ఉంటాయని బంగ్లాదేశ్‌లోని భారత…
ఒకటి కాదు రెండు కాదు.. ఏకంగా 26 ఏళ్ళ కల అది. తమ గ్రామానికి ఆర్టీసీ బస్సు రావాలని కోరుకున్నారు. అది ఇప్పుడు నెరవేరింది. ఆదివాసీలు తమ కల సాకారం అయినందుకు తెగ హ్యాపీగా ఫీలవుతున్నారు. 30 నివాస సముదాయాలున్న ఆదివాసీ గ్రామం మంగీ గ్రామ పంచాయతీలో ఇప్పుడు ఆర్టీసీ బస్సు శబ్దం వినిపిస్తోంది. రయ్యి రయ్యి మంటూ దూసుకువస్తున్న ప్రజారవాణా వ్యవస్థను అక్కడి మహిళలు, పిల్లలు చక్కగా ఉపయోగించుకుంటున్నారు. ఆసిఫాబాద్ జిల్లాలోని మంగీ గ్రామ పంచాయతీకి…