Matrimony: పెళ్లి చేసుకుంటానంది.. రూ. కోటి కాజేసింది
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Matrimony: దేశంలో రోజు రోజుకి మ్యా్ట్రిమోనీయల్ మోసాలు పెరిగిపోతున్నాయి. మ్యాట్రిమోనీయల్ సైట్స్ లో ఉన్న వారితో పరిచయాలు చేసుకోవడం.. వారితో స్నేహంగా నటించడం.. తరువాత వారి నుంచి డబ్బు వసూలు చేయడం. ఇలాంటి ఘటనలు ఈ మధ్య కాలంలో బాగా పెరిగిపోతున్నాయి. ఇలాంటి వాటిలో యువ వ్యాపారవేత్తలు, సాఫ్ట్ వేర్ ఇంజనీర్లు ఎక్కువగా మోసపోతున్నారు. మ్యాట్రిమోనియల్ సైట్స్ లో పరిచయమైన ఒక అమ్మాయితో ఎన్‌ఆర్‌ఐ టెక్కీ స్నేహం చేశాడు. పరిచయమైన తరువాత పెళ్లి చేసుకుంటానని నమ్మబలికింది. నిజమేనని టెక్కీ నమ్మాడు. ఇంకేముంది తనకు కొంత అమౌంట్ కావాలని కొద్ది రోజుల తరువాత అడిగింది. అడిగింది తక్కువ అమౌంటేనని పంపాడు. తరువాత పరిచయం పెరిగి నిత్యం ఫోన్‌లో మాట్లాడుకోసాగారు. ఒకరోజు అతడికి నగ్నంగా వీడియో కాల్ చేసింది. వీడియోకాల్ రికార్డు చేసిన యువతి.. అతన్ని బ్లాక్‌మెయిల్ చేసి రూ. కోటి లాగేసింది..
Read also: Manchu Vishnu: మా ప్రెసిడెంట్ కీలక నిర్ణయం.. అది చేయలేకనేనా.. ?
Also Read
- Bangladesh: ‘‘ప్రతీసారి భారత్ గురించి ఆలోచించం, హసీనా మాదిరి ఉండదు’’.. బంగ్లాదేశ్ పొగరు మాటలు..
- IAF Report: ఆపరేషన్ సిందూర్‌పై IAF సంచలన రిపోర్ట్.. పాక్ F-16లు, రాడార్లు ధ్వంసం..
- Ravi Shastri: పుతిన్, మోడీ, జిన్‌పింగ్.. బ్రిక్స్‌పై రవిశాస్త్రి సంచలన పోస్ట్..
- ఎవరూ చూడట్లేదు కదా అని Indian Railways లో ఈ పని చేస్తున్నారా? దొరికితే బెయిల్ కూడా దొరకదు!
బెంగళూరులోని ఆర్‌కే పురానికి చెందిన ఓ వ్యక్తి యూకే (UK)లో సాఫ్ట్‌వేర్ కొలువు చేస్తున్నాడు. ట్రైనింగ్ కోసమని బెంగళూరుకు వచ్చాడు. ఈ సమయంలోనే మంచి అమ్మాయిని చూసి వివాహం చేసుకోవాలని అనుకున్నాడు. ఈ క్రమంలో మ్యాట్రీమోనీలో రిజిస్టర్ అయ్యాడు. సైట్‌లో ఒక యువతితో పరిచయం ఏర్పడింది. నిత్యం ఫోన్లో మాట్లాడుకునేవారు. పెళ్లి చేసుకోవాలని కూడా నిర్ణయించుకున్నారు. తన తండ్రి చనిపోయాడంటూ.. ప్రస్తుతం తల్లితోనే ఉంటున్నానని చెప్పడంతో అతను నిజమేనని విశ్వసించాడు. తన తల్లికి ఆరోగ్యం బాగోలేదని ఆసుపత్రికి వెళ్లేందుకు రూ. 1500లను అప్పుగా ఇవ్వమంటూ ఒక రోజు అతడికి ఫోన్ చేసింది. ఆమె మాటలు నమ్మి డబ్బు పంపించాడు. రెండు రోజుల తర్వాత నగ్నంగా అతడికి వీడియో కాల్ చేసి మాట్లాడింది. ఈ క్రమంలోనే అతడికి తెలియకుండా అదంతా రికార్డు చేసింది. అనంతరం ఆ క్లిపింగ్‌ను అతడికి షేర్ చేసింది. అడిగినంత డబ్బు ఇవ్వకపోతే మీ తల్లిదండ్రులకు పంపిస్తానంటూ.. బెదిరించడం ప్రారంభించింది. అలా రూ. కోటికి పైగా కాజేసింది. యువతి వేధింపులు తాళలేక బాధితుడు సైబర్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. కేసు నమోదు చేసిన పోలీసులు ఆమె బ్యాంక్ ఖాతాలను గుర్తించి స్తంభింపజేశారు. ఆ విధంగా రూ. 84 లక్షలను ఆమె వినియోగించడానికి వీలు లేకుండా చేశారు. ‘‘ఇప్పటి వరకు ఆమె రూ. 30 లక్షలు వినియోగించింది. అతడి ఫిర్యాదుతో ఆమె ఖాతాను స్తంభింపజేశాం. గుర్తు తెలియని వ్యక్తులతో ఆన్‌లైన్ లావాదేవీలు జరపకూడదు. మీకు వచ్చే ఫేక్ కాల్స్‌ను నమ్మకండి’’ అంటూ డీసీపీ హెచ్చరించారు.
తాజావార్తలు
-
Abhishek Sharma: కాటేరమ్మ కొడుకా మజాకా.. బంతి వేయడమే ఆలస్యం కొట్టుడే కొట్టుడు.. చరిత్ర స్పష్టించిన అభిషేక్..
-
Bangladesh: ‘‘ప్రతీసారి భారత్ గురించి ఆలోచించం, హసీనా మాదిరి ఉండదు’’.. బంగ్లాదేశ్ పొగరు మాటలు..
-
IND Vs SL: మహిళల ఆసియా కప్ ఫైనల్.. శ్రీలంక బౌలర్లపై విరుచుకుపడిన షఫాలీ వర్మ, స్మృతి మంధాన..
-
IAF Report: ఆపరేషన్ సిందూర్‌పై IAF సంచలన రిపోర్ట్.. పాక్ F-16లు, రాడార్లు ధ్వంసం..
-
Prithviraj Sukumaran: ‘వారణాసి’ చేస్తూనే 9 సినిమాలు.. మాలీవుడ్ స్టార్ స్పీడ్ చూసి జక్కన్న షాక్!
ట్రెండింగ్
-
Vaibhav Sooryavanshi Tears: వైభవ్ సూర్యవంశీ కంటతడి.. వీడియో, ఫొటోస్ వైరల్!
-
Smriti Mandhana: హార్డెస్ట్ నైట్.. స్మృతి మంధానను వెంటాడుతున్న ఆ జ్ఞాపకం!
-
Head Coach: హెడ్ కోచ్‌గా సౌరవ్ గంగూలీ.. అసిస్టెంట్ కోచ్‌గా యువరాజ్ సింగ్!
-
International Chocolate Day : చాక్లెట్ ప్రియులకు స్పెషల్ డే.. ఈ రోజు ఎందుకంత స్పెషల్?
-
Ganesh Chaturthi AI Prompts: మీ స్వంత ఫొటోలతో AI ఉపయోగించి గణపతి శుభాకాంక్షలు చెప్పండి.. ప్రాంప్ట్స్ ఇదిగో మీకోసం..!