Madhura: శ్రీకృష్ణ జన్మభూమి-షాహీ ఈద్గా మసీదు వివాదం..నేడు హైకోర్టు తీర్పు
- మధురలోని శ్రీకృష్ణ జన్మభూమి-షాహీ ఈద్గా మసీదు వివాదం
- అక్కడ పూజలు చేసుకునే హక్కు కల్పించాలని హిందూ పక్షం పిటిషన్
- హిందూ పక్షం పిటిషన్లను కొట్టివేయాలని ముస్లిం పక్షం వాదన
- వివాదంపై నేడు తీర్పు వెలువరించనున్న అలహాబాద్ హైకోర్టు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
మధురలోని శ్రీకృష్ణ జన్మభూమి-షాహీ ఈద్గా మసీదు వివాదంపై అలహాబాద్ హైకోర్టు నేడు తీర్పు వెలువరించనుంది. షాహి ఈద్గా మసీదు భూమి హిందువులదేనని, అక్కడ పూజలు చేసుకునే హక్కు కల్పించాలని హిందూ పక్షం దాఖలు చేసిన పిటిషన్లలో పేర్కొంది. అదే సమయంలో, ముస్లిం పక్షం ప్రార్థనా స్థలాల చట్టం, వక్ఫ్ చట్టం, పరిమితి చట్టం, నిర్దిష్ట స్వాధీన ఉపశమన చట్టాలను ఉదహరించి, హిందూ పక్షం పిటిషన్లను కొట్టివేయాలని ముస్లిం పక్షం వాదించింది.
READ MORE: Prabhas: కల్కి OTT రిలీజ్ డేట్ ఫిక్స్.. స్ట్రీమింగ్ ఎప్పుడంటే..?
Also Read
- EPFO Update: పీఎఫ్ డబ్బుల డ్రాపై ఈపీఎఫ్ఓ కొత్త రూల్.. ఇకపై ఆ ఫారమ్‌లు పనిచేయవు!
- Abhishek Sharma: సూర్యకుమార్ ప్రపంచ రికార్డుపై కాటేరమ్మకొడుకు కన్ను..
- BC Reservations: సర్కార్ కీలక ఉత్తర్వులు.. పంచాయతీ, మున్సిపల్ ఎన్నికల్లో బీసీ రిజర్వేషన్లకు గ్రీన్ సిగ్నల్..!
- CJP Leaders Released: సీజేపీ నాయకులకు బిగ్ రిలీఫ్.. అభిజీత్, సౌరవ్, అశుతోష్, ధృవ్ రాఠీ విడుదల..
మధురలోని శ్రీకృష్ణ జన్మభూమి వివాదంలో దాఖలైన 18 పిటిషన్లను కలిపి విచారించాలా వద్దా అనేది ఇప్పుడు అలహాబాద్ హైకోర్టు నిర్ణయించనుంది. హైకోర్టులోని న్యాయమూర్తి జస్టిస్ మయాంక్ కుమార్ జైన్‌తో కూడిన సింగిల్ బెంచ్ తీర్పును వెలువరించనుంది. అంతకుముందు.. జూన్ 6న విచారణ పూర్తయిన తర్వాత హైకోర్టు నిర్ణయాన్ని రిజర్వ్ చేసిన విషయం తెలిసిందే. హిందూ పక్షం నుంచి 18 పిటిషన్లు దాఖలయ్యాయి. అదే సమయంలో, ముస్లిం పక్షం ఆర్డర్.. 7, రూల్ 11 ప్రకారం ఈ పిటిషన్ల నిర్వహణపై ప్రశ్నలను లేవనెత్తింది. వాటిని కొట్టివేయాలని విజ్ఞప్తి చేసింది. హిందూ, ముస్లిం వర్గాలకు ఈరోజు కీలకం కానుంది.
READ MORE:Collectors Conference: 5న కలెక్టర్ల కాన్ఫరెన్స్.. వీటిపై ఫోకస్ పెట్టిన సీఎం చంద్రబాబు..
హిందూ పార్టీల వాదనలు…
రెండున్నర ఎకరాల విస్తీర్ణంలో ఉన్న ఈద్గా మొత్తం శ్రీకృష్ణుడి పవిత్ర క్షేత్రం.
షాహీ ఈద్గా మసీదు కమిటీ వద్ద భూమికి సంబంధించిన ఎలాంటి రికార్డు లేదు.
షాహి ఈద్గా మసీదు శ్రీ కృష్ణ ఆలయాన్ని కూల్చివేసి నిర్మించబడింది.
యాజమాన్య హక్కులు లేకుండా, ఎలాంటి చట్టపరమైన ప్రక్రియ లేకుండా వక్ఫ్ బోర్డు ఈ భూమిని వక్ఫ్ ఆస్తిగా ప్రకటించింది.
READ MORE: SC Classification: ఎస్సీ వర్గీకణ అంటే ఏంటి?..మూడు దశాబ్ధాలుగా మంద కృష్ణ పోరాటం ఎందుకు..?
ముస్లిం పార్టీల వాదనలు
1968లో ఈ భూమిపై ఇరువర్గాల మధ్య ఒప్పందం కుదిరిందని ముస్లిం పార్టీలు వాదిస్తున్నాయి.
60 ఏళ్ల తర్వాత ఒప్పందాన్ని తప్పు అనడం సరికాదు. అందువల్ల కేసు నిర్వహణ సాధ్యం కాదు.
ప్రార్థనా స్థలాల చట్టం 1991 ప్రకారం కూడా కేసు నిర్వహించబడదు.
తాజావార్తలు
-
EPFO Update: పీఎఫ్ డబ్బుల డ్రాపై ఈపీఎఫ్ఓ కొత్త రూల్.. ఇకపై ఆ ఫారమ్‌లు పనిచేయవు!
-
Prabhas : వాయిదాలకు కేరాఫ్ అడ్రస్ ప్రభాస్ మూవీస్
-
Thomson 4K QLED Smart TVs: థామ్సన్ నుంచి కొత్త 4K QLED స్మార్ట్ టీవీలు.. ధర రూ.11,999 నుంచే!
-
Nepal Flood Alert: నేపాల్‌లో వరద హెచ్చరిక.. బుధి గండకి నదికి భారీ వరద ముప్పు
-
Abhishek Sharma: సూర్యకుమార్ ప్రపంచ రికార్డుపై కాటేరమ్మకొడుకు కన్ను..
ట్రెండింగ్
-
Cockroach Control Tips: వంటింట్లో బొద్దింకలు తిరుగుతూ చికాకు తెప్పిస్తున్నాయా.? ఈ చిట్కాతో శాశ్వతంగా సమస్యకు చెక్ పెట్టండి..!
-
Least Eligible Bachelor: లీస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ రివ్యూ..
-
Onion Peel Benefits: ఉల్లిపాయ తొక్కలను పారేస్తున్నారా? వీటి ఉపయోగాలు తెలిస్తే చెత్తబుట్టలో అస్సలు వేయరు..!
-
Tirumala: నవరాత్రి బ్రహ్మోత్సవాలకు అంకురార్పణ.. నేటి నుంచి ప్రత్యేక దర్శనాలు రద్దు.!
-
WCL 2026: ఉతప్ప మెరుపులు వృథా.. భారత్ ఛాంపియన్స్‌పై సౌతాఫ్రికా విజయం.!