మధురలోని శ్రీ కృష్ణ జన్మభూమి, షాహీ ఈద్గా మసీదు వివాదంపై అలహాబాద్ హైకోర్టు సంచలన తీర్పు వెలువరించింది. ఆర్డర్ 7 రూల్ 11పై అభ్యంతరం వ్యక్తం చేస్తూ ముస్లిం పక్షం దఖలు చేసిన పిటిషన్ ను హైకోర్టు తిరస్కరించింది.
మధురలోని శ్రీకృష్ణ జన్మభూమి-షాహీ ఈద్గా మసీదు వివాదంపై అలహాబాద్ హైకోర్టు నేడు తీర్పు వెలువరించనుంది. షాహి ఈద్గా మసీదు భూమి హిందువులదేనని, అక్కడ పూజలు చేసుకునే హక్కు కల్పించాలని హిందూ పక్షం దాఖలు చేసిన పిటిషన్లలో పేర్కొంది.