రాయి దాడితో సీఎం జగన్ భద్రతపై నిఘా విభాగం కీలక సూచనలు చేసింది. జగన్ బస్సుకు వంద మీటర్ల పరిధిలో జన ప్రవేశం నిషిద్దం..?అని తెలిపింది. మరీ అవసరమైతేనే జగన్ బస్ పరిసరాల్లోకి నేతలు, కార్యకర్తలకు అనుమతి ఇచ్చింది. క్రేన్లు ఆర్చులు, భారీ గజమాలలను తగ్గించాలని సూచించింది. జగన్ కు, జనానికి మధ్య గతంలో మాదిరిగా బారికేడ్లు ఉండేలా చూసుకోవాలని తెలిపింది. అనంత జిల్లా గుత్తిలో సీఎం జగన్ కాన్వాయిపై చెప్పులు, ఇప్పుడు రాళ్లు విసరడంతో నిఘా విభాగం హై అలర్ట్ ప్రకటించింది. సభల్లో ర్యాంప్ వాక్ చేయొద్దని గతంలోనే జగన్ కు భద్రతా పరమైన సూచనలు ఇచ్చింది. వీలైనంత వరకు బస్సులో కూర్చునే రోడ్ షో చేయాలని నిఘా వర్గాలు సూచించాయి. ఇక నుంచి జగన్ చేసే పర్యటనల్లో భద్రతా వైఫల్యాలు లేకుండా చూసుకోవాలని ఆదేశం ఇచ్చింది.
Read Also: Iran: మా లక్ష్యం నెరవేరింది, ఆపరేషన్ ముగిసింది..
నిన్న (శనివారం)విజయవాడలో “మేమంతా సిద్ధం” బస్సు యాత్రలో సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డిపై గుర్తు తెలియని వ్యక్తి రాయితో దాడి చేసిన సంగతి తెలిసిందే. ప్రజలకు అభివాదం చేస్తున్నప్పుడు దాడి జరిగింది. అత్యంత వేగంగా వచ్చి సీఎం జగన్ కనుబొమ్మకు తాకిన రాయి.. సీఎం జగన్ పై క్యాట్ బాల్ తో దాడి చేసినట్లు అనుమానం వ్యక్తం అవుతుంది. రాయి తగలడంతో సీఎం జగన్ ఎడమకంటి కనుబొమ్మపై తీవ్ర గాయం అయింది. సీఎం జగన్ పక్కనే ఉన్న ఎమ్మెల్యే వెల్లంపల్లి శ్రీనివాస్ ఎడమ కంటికి సైతం గాయం అయింది. వెంటనే సీఎం జగన్ కు బస్సులో డాక్టర్లు ప్రథమ చికిత్స అందించారు.
Read Also: Indian 2: జూన్‌లో వచ్చేస్తున్నా .. ‘భారతీయుడు 2’